వోక్స్వాగెన్ వారు భారతదేశంలో కార్లను ఉపసమ్హరించుకోనున్నారు
నవంబర్ 02, 2015 02:34 pm sumit ద్వారా సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వోక్స్వాగెన్ వారి ఇబ్బందులు భారతదేశంలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రపంచ నంబర్.1 కారు తయారీదారి స్థానాన్ని కోల్పోవడంతో పాటుగా ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా లక్ష కార్లను ఉపసమ్హరించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉండబోతున్న కార్ల జాబితాలో పోలో హ్యాచ్‌బ్యాక్, పోలో క్రాస్, వెంటో, జెట్టా మరియూ పస్సాట్ సెడాన్ ఉండబోతున్నాయి. భారతదేశంలో ఆటోమోటివ్ రీసర్చ్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా చే దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ఇది జరుగుతుంది. " వివిధ బ్రాండ్ల కలగలిపి ఎన్నో మోడల్స్, వివిధ ఇంజిన్లు, ఎన్నో వేరియంట్స్ వగైరాలు ఉన్నందున వాస్తవాలు వెలుగులోకి తీసుకు రావడం ఆలస్యం అవుతోంది," అని కంపెనీ వారు సెలవిచ్చారు.
ఈ జర్మన్ ఆటోమేకర్ వారు ఎమిషన్ కుంభకోణంలో ఇరుక్కుని దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ వాహనాలను ఉపసమ్హరించుకున్నారు. రోడ్లపైకి వీరి వాహనాలను తీసుకు వచ్చే మునుపు ఎమిషన్ పరీక్షలను మోసపూరితంగా ఉత్తీర్ణం పొంది కుంభకోణానికి పాల్పడ్డారు. భారతదేశంలో జరిగే ఎమిషన్ పరీక్షలు సులువైనవే అయినప్పటికీ కూడా, ఇంజిన్లను వగైరాలు భర్తీ చేయవలసిన అవసరం ఉంటాయి. భారతదేశం కూడా దాదాపుగా యూరప్‌లోఉన్నటువంటి ఎమిషన్ పరీక్షల విధానమే పాటిస్తుంది.