వోక్స్వాగన్ పండుగ కాలంలో 'వోక్స్‌ఫెస్ట్' అనే కార్యక్రమంతో ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వచ్చారు
అక్టోబర్ 23, 2015 05:20 pm nabeel ద్వారా సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వోక్స్వాగెన్ వారు 2015 వోక్స్‌ఫెస్ట్ అనే ఒక కార్యక్రమాన్ని పండుగ కాలం సందర్భంగా ప్రారంభించారు. ఈ జతియ్య స్థాయి కార్యక్రమం 30 రోజులు నడుస్తుంది మరియూ ప్రత్యేక ఆఫర్లు ఇప్పటి కస్టమర్లకి మరియూ భవిష్యత్ కస్టమర్లకి కూడా లభిస్తుంది. ఈ ఆటో దిగ్గజం ఎన్నో ఆశక్తికరమైన మరియూ ఖచ్చితమైన బహుమతులను, హాలిడే ప్యాకేజీలను మరియూ ఆర్థిక సహాయాలు వంటివి అందిస్తారు. ఇవి దేశం అంతటా ఉన్న వోక్స్వాగెన్ డీలర్‌షిప్ లలో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులకు ఉచితంగా ఒక ఏడాది పాటు ఇన్షురెన్స్ తో పాటుగా ఎక్స్‌చేంజ్ మరియూ రాయితీలు దాదాపు రూ.40,000 వరకు అందించనున్నారు.
ఫైనాన్స్ స్కీములు ఈ పండుగ మొదలులో జెట్టా కి 9.99 శాతం ఏడాదికి, 3.99 శాతం పఒలోకి మరియూ 9.75 శాతం వెంటో కి అందిస్తున్నారు. కస్టమర్లు లక్కీ డ్రా లో బ్లౌపంక్ట్ మల్టీమీడియా టాబ్లెట్ ని అందుకోవచ్చును. ఈ కంపెనీ వారు హాలిడే ప్యాకేజీలు వోక్స్వాగెన్ ఎక్స్‌చేంజ్ పై, వోక్స్వాగెన్ ప్రీ-ఓనడ్ కారు విభాగం, దస్ ఆటో లో అందుబాటులో ఉంటుంది.
ఈ నెల మొదట్లో, కంపెనీ వారు వెంటో ఇంకా పోలో యొక్క లిమిటెడ్ ఎడిషన్ లను విడుదల చేశరు. పోలో ఎక్స్‌క్విజిట్ ఎడిషన్ హైలైన్ ఎంటీ 1.2-లీటర్ ఎంపీఐ మరియూ 1.5-లీతర్ టీడీఐ లను రూ. 5.5 లక్షలకు మరియూ రూ. 8.73 లక్షలకు (ఎక్స్-షోరూం, ముంబై) కి లభిస్తుంది. పోలో కి ఒక నలుపు పై కప్పు, కార్బన్ ఫైబర్ ఉన్న బాహ్యపు అద్దాలు, నలుపు సైడ్ బాడీ మోల్డింగ్, ట్రంక్ గార్నిష్ మరియూ స్కఫ్ ప్లేటులు. లోపల సెంట్రల్ కన్సోల్ తో కార్బన్ ఫైబర్ పూతలు, కొత్త సీటు కవర్లు మరియూ ఫ్లోర్ మ్యాట్స్ వంటివి ఉంటాయి. వెంటోకి కూడా నలుపు పై కప్పు మరియూ కార్బన్ ఫైబర్ కవరింగ్ బాహ్యపు అద్దాలకి ఉంటాయి. వెంటో స్పెషల్ ఎడిషన్ కి టచ్‌స్క్రీన్ బ్లౌపంక్ట్ ఇంఫొటెయిన్‌మెంట్ నావిగేషన్ మరియూ విండో షేడులు ఉంటాయి.