• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ ఇండియా 2015 డిసెంబర్ 19 న బీటిల్ ని పునః ప్రారంభించనున్నది

వోక్స్వాగన్ బీటిల్ కోసం raunak ద్వారా డిసెంబర్ 10, 2015 06:17 pm ప్రచురించబడింది

  • 15 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వోక్స్వ్యాగన్ బీటిల్  1.4 లీటర్ TSi టర్బో పెట్రోల్ మోటార్ తో అందుబాటులో ఉంటుంది మరియు  మినీ కూపర్ ఎస్, మెర్సెడెజ్-బెంజ్ A-క్లాస్ మరియు BMW తో  పాటు  ఫియట్ అబార్త్  595 కాంపిటజోన్  వంటి వాటితో పోటీగా ఉంటుంది 

పూర్తిగా నిలిపివేసిన తరువాత, వోక్స్వ్యాగన్ డిసెంబర్ 19 న భారత మార్కెట్ లోనికి బీటిల్ ని తిరిగి ప్రవేశపెడుతుంది. కొత్త బీటిల్ యొక్క బుకింగ్స్ రూ .1 లక్ష తో సుమారు నెల క్రితం ప్రారంభించబడ్డాయి. ఇది దేశంలో VW యొక్క ఇప్పటికే ఉన్న డీలర్షిప్ ద్వారా పంపబడతాయి మరియు దాదాపు రూ. 30 లక్షల ధరను కలిగి ఉండవచ్చు. ఇది CBU మార్గం ద్వారా(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్) దిగుమతి చేయబడుతుంది.   

కొత్త బీటిల్  VW యొక్క 1.4 లీటర్ టర్బోచార్జెడ్ పెట్రోలు ఇంజన్ ద్వారా అమర్చబడి ఉండి, 7-స్పీడ్ DCTడ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ 150ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక, ఈ కారు  205/60 క్రాస్‌సెక్షన్ అలాయ్ వీల్స్ తో నడపబడుతుంది మరియు ఆటో స్టార్ట్-స్టాప్ వ్యవస్థ & బ్రేక్ ఎనర్జీ పునరుత్పత్తి తో వస్తుంది. అంతే కాకుండా, ఇది ప్రామాణిక 6-ఎయిర్బ్యాగ్స్, ESC(ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) తో పాటు హిల్ హోల్డ్ ఫంక్షన్, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ASR (యాంటీ-స్లిప్ రెగ్యులేషన్), EDL(ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్  లాక్) మరియు EDTC (ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్) వంటి లక్షణాలను కలిగి ఉంది.   

లక్షణాల గురించి మాట్లాడుకుంటే, ఇది  8 స్పీకర్ సిస్టమ్ తో టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ , LED పగటిపూట నడుస్తున్న లైట్లు తో బై-జినాన్ హెడ్లైట్లు (DRL), LED టైల్లాంప్స్, పారానోమిక్ సన్‌రూఫ్, ఆటో రెయిన్ మరియు లైట్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, ఎత్తు సర్దుబాటు తో ముందు సీట్లు మరియు హీటింగ్ ఆప్షన్ తో లంబర్ సపోర్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ORVM లు  శక్తి సర్దుబాటు, మడత వేయగల మరియు హీటెడ్ సదుపాయంతో వస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Volkswagen బీటిల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience