• English
  • Login / Register

టైగన్ వాహనాన్ని, 2016 ఆటో ఎక్స్పో వద్దకు తీసుకురాబోతున్న వోక్స్వాగన్

వోక్స్వాగన్ టైగన్ కోసం sumit ద్వారా ఫిబ్రవరి 05, 2016 11:29 am ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వోక్స్వాగన్ సంస్థ, టైగన్ వాహనాన్ని జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనుంది. ఈ వాహనం, వోక్స్వాగన్ గ్రూప్ యొక్క మోడ్యులరర్ క్వర్బ్కెస్టన్ (ఎం క్యూ బి) ప్లాట్ఫాం పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ వాహనం, ఇదే విభాగంలో ఉండే ఫోర్డ్ యొక్క అన్ని కొత్త ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు చెవ్రోలెట్ ట్రైల్ బ్లాజర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇవ్వడానికి రాబోతుంది. ఈ ఎం క్యూబి ప్లాట్ ఫాం, పి క్యూ35 ప్లాట్ ఫాం కంటే 100 కిలోలు తేలికైనది మరియు ఇది, కారు యొక్క ప్రయోజనాలకు జత చేస్తుంది. ఈ టైగన్ వాహనం, ఆన్లైన్ అసిస్టెన్స్ మరియు ఆటోమేటిక్ యాక్సిడెంట్ హెచ్చరిక వంటి నవీకరించబడిన అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది డ్రైవర్ కు కీలకమైన సమాచారాన్ని అందజేస్తుంది అలాగే పార్కింగ్ స్పేస్ ఇంఫో మరియు వాహన స్టాటస్ రిపోర్ట్ ల గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. వీటన్నింటితో పాటు ఈ వాహనం, రేర్ వ్యూ కెమెరా వ్యవస్థ, కీ లె యాక్సిస్ తో పుష్ బట్ స్టార్ట్ వంటి అంశాలను కూడా కలిగి ఉంది. ఈ వాహనం లో ఉండే సంగీత వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే, వినోద ఔత్సాహికుల కోసం సౌకర్యాన్ని జత చేయడానికి ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి మద్దతిస్తుంది. భద్రతా విభాగం విషయానికి వస్తే, ఈ కారు ఎయిర్బాగ్ లతో పాటు ఏబిఎస్ అలాగే ఈబిడి లను కలిగి ఉంది. ఈ వాహనం యొక్క లుక్స్ ను పరిగణలోనికి తీసుకుంటే, ఈ క్రాస్ ఓవర్ పొడవైన కొలతలు కారణంగా ఎస్యువి ను పోలి ఉంటుంది.  

అద్భుతమైన 4X4 పనితీరుతో ఈ టైగన్ వాహనం, విలాసవంతాన్ని, హ్యాండ్లింగ్ ను, భద్రతా మరియు సామర్ధ్యం, వినూత్న మరియు కనెక్టవిటీ యొక్క గ్లోబల్ సంబందిత నుండి ఎస్యువి యొక్క క్యాటగిరీ కోడ్ ల వరకు అంశాలను కలిగి ఉంది అని కారు తయారీదారు ఒక సందర్భంగా మాట్లాడాడు. తయారీదారుడు ఈ వాహనానికి, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ను అందించాడు. ఈ ఇంజన్ అత్యధికంగా, 148 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 6- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఆల్టర్నేట్ మార్గాన్ని ఇష్టపడే వారి కోసం సంస్థ ఈ వాహనాన్ని, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ తో అందిస్తుంది.    

ఈ టైగన్ కాన్సెప్ట్, ముందుగా జరిగిన 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శింపబడింది. భారతదేశంలో ఈ వాహనం, 2.2 లీటర్ ఇంజన్ ను కలిగి ఉన్న అన్ని కొత్త ఎండీవర్ వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ వాహనం అత్యధికంగా, 158 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోర్డ్ యొక్క ఉత్పత్తి కూడా 4X4 వేరియంట్ తో వస్తుంది మరియు ఆఫ్ రోడింగ్ కోసం మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen టైగన్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience