• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ బీటిల్ డూన్ ఉత్పత్తి మోడల్ బహిర్గతం

వోక్స్వాగన్ బీటిల్ కోసం nabeel ద్వారా నవంబర్ 19, 2015 04:43 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

బీటిల్ వోక్స్వ్యాగన్ యొక్క అత్యంత ఇకానిక్ కార్లు మధ్య ఉంది. ఈ వాహనం కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో నిలిపివేయబడి ఉన్నప్పటికీ, జర్మన్  వాహనతయారి సంస్థ దేశంలో త్వరలో కొత్త బీటిల్ తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. LA మోటార్ షో 2015 వద్ద అధికారికంగా ప్రారంభం కాక ముందే  VW 2017 వోక్స్వ్యాగన్ బీటిల్ డూన్ కాన్సెప్ట్ ఆధారంగా  దాని బీటిల్ డూన్ యొక్క ఉత్పత్తి వెర్షన్ యొక్క చిత్రాలను విడుదల చేసింది. ఈ కూపే, 2016 యొక్క మొదటి త్రైమాసికంలో, యు.ఎస్.ఎ లో అమ్మకానికి వెళ్ళవచ్చని భావిస్తున్నారు. అయితే, డూన్  కన్వర్టిబుల్ అదే సంవత్సరంలో మూడవ త్రైమాసికంలో షో రూంలకు చేరనున్నది.

డూన్ యొక్క రూపకల్పన ప్రామాణిక బగ్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో చాలా ప్రముఖమైన అంశం కొద్దిగా భిన్నంగా ఉండే ఎయిర్ వెంట్లతో ఫాగ్ ల్యాంప్స్ మరియు ఇండికేటర్స్ తో అమర్చబడియున్న ఫ్రంట్ బంపర్ ఉండడం. అంతేకాకుండా దీనిలో ఫ్రంట్ బంపర్ పైన ఒక అదనపు ఎయిర్ ఇన్‌టేక్ అమర్చబడి ఉండి కారుకి కఠినమైన లుక్ జతచేస్తుంది. హెడ్లైట్లు కూడా  DRLs చుట్టూ ప్రొజెక్టర్ యూనిట్ తో కొత్తగా ఉంటాయి. ప్రక్కభాగంలో డూన్ గ్రాఫిక్స్ కొత్త అలాయ్స్ తో అందించబడుతుంది. వెనుక భాగంలో బంపర్ పై  స్పాయిలర్ మరియు స్కిడ్ ప్లేట్లు అమర్చబడి ఉంటాయి.       

ఈ వాహనం రూఫ్ మౌంట్ రేర్ స్పాయిలర్ మరియు నలుపు మరియు తెలుపు ఇన్పుట్లతో టైల్ లైట్ క్లస్టర్ వంటి అంశాలు తప్ప మిగిలిన కొన్ని అంశాలని కాన్సెప్ట్ నుండి తీసుకుంది. ఆరంభంలో బీటిల్ డూన్, 1.8 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ మరియు టర్బోచార్జెడ్ TSI నాలుగు సిలిండర్ల ఇంజన్ కలిగి ఉండి 170 హార్స్పవర్ శక్తిని మరియు 184Nm టార్క్ ని అందిస్తుంది. అలానే ఇది ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది.      

ఇది కూడా చదవండి  భారతదేశంలో తయారుచేయబడిన వోక్స్వాగెన్ వెంటో మోడల్స్ కి రక్షణ కి ఎన్‌సీఏపీ వారు 5-స్టార్ రేటింగ్ ఇచ్చారు

కారు అంతర్భాగాలలో రంగు పథకం మరియు డాష్బోర్డ్ కాన్సెప్ట్ లో చూపించిన దానికి ఎక్కువగా పోలి ఉంది. స్టీరింగ్ వీల్ కి కాన్సెప్ట్ యొక్క రంగు చేరికలు కాకుండా నల్లని పియానో ఫినిషింగ్ ని ఉపయోగించడం జరిగింది. డూన్ ఒక 6.3-అంగుళాల స్క్రీన్ ని కలిగియుండి స్వైపింగ్ మరియు జూమింగ్ నియంత్రణలు కలిగి ఉంటాయి. అలానే దీనిలో ఎంఐబి ఈఈ ప్రోక్సిమిటీ సెన్సార్ ని కలిగి ఉంటుంది. బీటిల్ వాహనం యుఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటూ వెనుక వీక్షణ కెమెరా మరియు పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ సిస్టమ్ ని కలిగి ఉంటుంది.  

2016 బీటిల్ డూన్ సాండ్ స్టార్మ్ ఎల్లో, ప్యూర్ వైట్ మరియు   డీప్ బ్లాక్ పెర్ల్ అను మూడు బాహ్య రంగులలో అందుబాటులో ఉంటుంది. సాండ్ స్టార్మ్ ఎల్లో కార్లు, శరీరం రంగు ఎగువ డోర్ ట్రింస్ మరియు డాష్ ప్యాడ్స్ ని కలిగి ఉంటుంది. అయితే ప్యూర్ వైట్ మరియు డీప్ బ్లాక్ పెర్ల్ వాహనాలు  నలుపు డోర్ మరియు డాష్ ప్యాడ్ ట్రిమ్ ని కలిగి ఉంటాయి.  

ఇది  కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen బీటిల్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience