• English
    • Login / Register

    విటారా భారతదేశంలో రహస్యంగా కనిపించింది మరియు 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద రెండు నెలల తర్వాత అరంగేట్రం చేయనున్నది!

    మారుతి గ్రాండ్ విటారా కోసం raunak ద్వారా నవంబర్ 25, 2015 02:16 pm ప్రచురించబడింది

    • 21 Views
    • 3 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    కారు యొక్క బాహ్య లుక్స్ బాగోకపోతే అది మార్కెట్ లో రాణించదు. ఉదాహరణకు క్రెటా వాహనం ఎస్-క్రాస్ కంటే మార్కెట్ లో ఎక్కువ అమ్మకాలు సాధిస్తుంది. ఎస్-క్రాస్ వాహనం యొక్క ఇంజిన్ శక్తివంతమైనది అయినప్పటికీ బాహ్య లుక్స్ పరంగా అంత ఆకర్షించలేకపోయింది కనుక క్రెటా కంటే ఎక్కువ అమ్మకాలను సాధించలేకపోయింది. అయితే,మారుతి సంస్థ దీనికి విటారా తో సమాధానం చెప్తున్నది. ఈ విటారా వాహనం యూరోపియన్ మార్కెట్ లో చాలా బాగా రాణిస్తుంది. ఇప్పుడు ఈ వాహనం భారతదేశంలో ప్రారంభం కానున్నది, అలానే భారతదేశంలో ప్రారంభించబడి బాగా రాణించిన క్రెటా వాహనం ఇప్పుడు యూరప్ లో ప్రారంభం కానున్నది. గ్రాండ్ విటారా వాహనం స్థానికంగా తయారుచేయబడని కారణంగా 20 లక్షల అధిక ధర వద్ద అమ్మకాలు చేయబడుతుంది. ఇది ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ ద్వారా అమ్మకాలు చేయబడుతుంది.    

    ఈ ఇంజిన్ ఫియాట్ యొక్క 1.6 లీటర్ మల్టీజెట్ అనగా DDiS320 , ఎస్-క్రాస్ లో చూసినటువంటి అదే ఇంజిన్ 120ps / 320 ఎన్ఎమ్ 6-స్పీడ్ MT అందిస్తుంది. విటారా ఈ విభాగంలో  320Nm టార్క్ అందించే  ఎస్-క్రాస్ కంటే మెరుగైన సమర్ధతను విటారా ఇంజిన్  అందిస్తుంది. క్రెటా, ఎస్-క్రాస్ మరియు విటారా చూసినట్లయితే,  విటారా మరియు క్రెటా రెండూ suv లా కనిపిస్తాయి.

    అంతేకాక, సంస్థ విటారాతో ఆల్‌గ్రిప్  AWD టెక్నాలజీ రాబోతుందని భావిస్తున్నారు. డస్టర్ తప్ప ఈ విభాగంలో మిగతా ఏదీ అవ్ద్ టెక్నాలజీని అందించడం లేదు. మరో హైలైట్  బాలెనో లో ప్రారంభించబడిన ఆపిల్ కార్‌ప్లే తో 7 అంగుళాల స్మాట్‌ప్లే సమాచార వినోద వ్యవస్థ.

    మారుతి ఎల్లప్పుడూ భారత ఆటో ఎక్స్పో వద్ద మంచి అనుభందాన్ని కలిగి ఉంటుంది. దేశంలో దిగుమతి అయ్యే యూనిట్లు బహుశా ఫిబ్రవరి లో రాబోయే ప్రదర్శనకు కోసం ఉంటాయి. గత సారి సియాజ్ మరియు  S-క్రాస్ ప్రజల యొక్క ఆకర్షణను దోచుకున్నాయి. ప్రారంభం గురించి మాట్లాడితే, క్రెటా కి ప్రాముక్యత చూస్తుంటే మారుతి తొందరగా విటారా ని ప్రారంభించవచ్చు.

    was this article helpful ?

    Write your Comment on Maruti గ్రాండ్ విటారా

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience