రాబోయే మెర్సిడేజ్ జీఎల్ఎస్ కారు జీఎల్-క్లాస్ ని భర్తీ చేయనుంది
డిల్లీ:
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం అయిన మెర్సిడేజ్ వారు కొంత కాలంగా పునరుద్దరణల పరంపరలో ఉన్నట్టుగా ఉన్నారు. 2016 లో మెర్సిడేజ్ జీఎల్ ని మెర్సిడేజ్ జీఎల్ఎస్ భర్తీ చేయనుంది. తాజాగా మెర్సిడేజ్ అధికారిక బ్రోషర్ ద్వారా చిత్రాలు వెలువడ్డాయి. దీనితో దీని రాక ఖరారు అయ్యింది. సమగ్ర సౌందర్య పునరుద్దరణ తో పాటుగా కొత్త ఇంజిన్లు వస్తాయి అని అంచనా. స్టైలింగ్ నవీకరణలలో సర్దుబాటు చేసిన హెడ్‌లైట్స్ మరియూ టెయిల్ ల్యాంప్స్ తో పాటుగా మరింత ధుడుకైన ముందు వైపు గ్రిల్లు ఇంకా రీడిజైన్ చేసిన బంపర్లు ఉంటాయి.
జీఎలీ ఆధారిత ఎమెల్-క్లాస్ లో ఉన్నటువంటి మార్పులే ఇందులో కూడా కనపడతాయి. కొత్త అంతర్ఘత ట్రింస్ ఉండటం చేత, డిటాచబుల్ టాబ్లెట్-స్టైల్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టం ఉండటంతో పాటుగా క్యాబిన్లో ఏడు సీట్లు ఉంటాయి. ఇంకా మెర్సిడేజ్ వారు అధికారికంగా ఈ మార్పులను ధృవీకరించాల్సి ఉంది. ఇది ఈ ఏడాది చివరికి ఆశించవచ్చును.
ఈ కొత్త పునరుద్దరణలు అంతర్జాతీయంగా విడుదల అయిన వెంటనే భారతదేశంలో కూడా చోటు చేసుకుంటాయి. పరాన్ని అనుసరించి మొదట్లో ఈ కారు సీబీయూ ద్వారా వస్తుంది. డిమాండ్ ని బట్టి డీజిల్ ఇంజిను వేరియంట్ ని స్థానికంగా నిర్మిస్తారు.