Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2016 లో హోండా నుంచి రానున్న కార్లు

జనవరి 04, 2016 07:04 pm sumit ద్వారా ప్రచురించబడింది

Upcoming Cars From Honda in 2016

త్త సంవత్సరం మొదలవుతున్న కారణంగా ఆటోమొబైల్ ఔత్సాహికులు వాహన తయారీదారుల నుండి పునరుద్ధరించబడిన అంచనాలతో 2016 ని ప్రారంభించారు. అయితే 2015 క్రెటా, బాలెనో మరియు క్విడ్ వంటి చాలా ప్రారంభాలను చూసింది. అయితే, 2016 కూడా కొన్ని అద్భుతమైన సమర్పణలను అందించేందుకు సిద్ధంగా ఉంది. 2016 లో రాబొయే కార్ల యొక్క జాబితా మా దగ్గర ఉంది.

హోండా బిఆర్-వి

Honda BR-V

హోండా సంస్థ ఆటో ఎక్స్పో 2016 లో ఒక కాంపాక్ట్ ఎస్యూవీ, బిఆర్-వి ని ప్రారంభించనున్నదని భావిస్తున్నారు. అయితే ఇది మొబిలియో, బిఆర్-వి వలే నిటారు వైఖరితో అదే ప్లాట్‌ఫార్మ్ ని కలిగి ఉంది. ఈ కారు అమేజ్ నుండి ఒక 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 1.5 లీటర్ ఇంజన్ ని కలిగి ఉంది. ఈ ఆటోమొబైల్ హోండా యొక్క ఎర్త్ డ్రీమ్స్ టెక్నాలజీ ని కలిగియున్న ఒక ఛ్వ్ట్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ని కలిగి ఉండవచ్చు. ప్రారంభ ధర రూ. 9 లక్షల నుండి 12 లక్షల పరిధిలో ఉంటుంది.

బిఆర్-V అంశాలు చూడండి

హోండా బ్రియో

Honda Brio

ప్రతిదీ ప్రణాళిక ప్రకారం వెళితే, హోండా 2016 లో బ్రియో ఒక ఫేస్లిఫ్ట్ ని బహిర్గతం చేయాలి. ఇది ప్రస్తుతం బ్రియో లో ఉన్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది, కానీ హోండా కంపెనీ i-DTEC లైన్ ఆధారంగా ఒక కొత్త 1.1 లీటర్ డీజిల్ ఇంజన్ తో రావచ్చు. ఈ కారు టు పెడల్ డ్రైవింగ్ ని ఇష్టపడే వారికి మాన్యువల్ వాటితో పాటు ఆటోమేటిక్ వేరియంట్లతో అందింస్తుందని భావిస్తున్నారు.

ఈ ఆటోమబైల్ 2016 చివరలో ప్రారంభించబడవచ్చు మరియు రూ.4.5 లక్షల నుండి రూ. 6.5 లక్షల పరిధిలో ఉండవచ్చని ఊహిస్తున్నారు.

హోండా సిటీ

Honda City

హోండా దాని ఇకానిక్ సెడాన్ సిటీ యొక్క ఫేస్లిఫ్ట్ ని ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఆటో ఎక్స్పో 2016 వద్ద వెల్లడి అంచనా మరియు కారు 2013 సిటీ తో యాంత్రికంగా పోలి ఉంటుందని ఊహించడమైనది. 2016 సిటీ వాహనం లోపల మరియు బయట చాలా సౌందర్య మార్పులను కలిగి ఉంది. అలానే దీని ధర రూ. . 8.5 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకూ ఊహించడమైనది.

హోండా అకార్డ్ హైబ్రిడ్

Honda Accord Hybrid

హోండా దాని ప్రీమియం సెడాన్ అకార్డ్ ని 2016 లో తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఇది 2011 లో మొదటిసారి ప్రారంభించబడి అమ్మకాలు సరిగా లేని కొన్ని కారణాల చేత 2013 లో ఆపివేయబడింది. హోండా సివిక్ హైబ్రిడ్ లా కాకుండా, జపనీస్ వాహనతయారి సంస్థ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా అకార్డ్ హైబ్రిడ్ ని తీసుకురాదని ఊహించడమైనది. ఈ యూఇనిట్లు స్థానిక ప్లాంట్లలో తయారుచేయబడవచ్చు. దీని ధర రూ. 30 లక్షల నుండి రూ. 34 లక్షల మధ్య ఊహించడమైనది. కారు ఇప్పటికే ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి ఉంది.

ఇంకా చదవండి : హోండా ఇండియా వారు హోండా కనెక్ట్ ను ప్రదర్శించారు

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర