పైరస్ హైబ్రిడ్ వాహనాన్ని, 2016 ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం చేసిన టయోటా
టయోటా ప్రీయస్ కోసం saad ద్వారా ఫిబ్రవరి 06, 2016 05:53 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అతి పెద్ద తయారీదారుడు అయిన టయోటా, ఒక కొత్త పైరస్ హైబ్రిడ్ కారును ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు. ఈ కొత్త కారు, నాల్గవ తరానికి సంబందించింది మరియు ఇది, ముందుగా జరిగిన 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శింపబడింది. ఈ వాహనం యొక్క దృడత్వం, 60 శాతం బలమైనది అని చెప్పవచ్చు మరియు ఇదంతా కూడా టి ఎన్ జి ఏ (టయోటా న్యూ జనరేషన్ ఆర్కిటెక్చర్) ప్లాట్ఫాం ఆధారితమైనది.
టయోటా నుండి రాబోతున్న కొత్త పైరస్ వాహనం, ఎప్పుడూ చూడనటువంటి హైబ్రిడ్ మోడల్ ఉత్పత్తి మరియు ఇంధన సామర్ధ్యం 10 శాతం మెరుగైనది అని చెప్పవచ్చు అలాగే మునుపటి వెర్షన్ తో పోలిస్తే 40 శాతం ఎక్కువ థెర్మల్ సామర్ధ్యం కలిగి ఉంది. ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ప్రొజక్టార్ హెడ్ ల్యాంప్ల ఆకృతి, పొడవైన టైల్ ల్యాంప్లు మరియు ట్రైయాంగులర్ ఆకృతి కలిగిన ఫాగ్ ల్యాంప్లు వంటి పొదునైన డిజైన్ కలిగిన అంసాలు అందించబడతాయి. పాత వెర్షన్ తో పోలిస్తే, ఈ కొత్త అవతార్ 15 మిల్లీ మీటర్లు ఎక్కువ వెడల్పును, 60 మిల్లీ మీటర్ల ఎక్కువ పొడవును అలాగే 20 మిల్లీ మీటర్ల తక్కువ ఎత్తును కలిగి ఉంది.
ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, కొత్త టయోటా పైరస్ హైబ్రిడ్ వాహనం, మార్పు చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్ స్క్రీన్ సమాచార యూనిట్ వంటి నవీకరించబడిన అంశాలు అందించబడతాయి. ఈ కారుకు, మూడు స్పోక్ల స్టీరింగ్ వీల్ ను అందించడం జరిగింది. దీనితో పాటు డ్రైవర్ కు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం ఈ స్టీఇంగ్ వీల్ పై బహుల ఫంక్షనల్ స్విచ్చులు అందంగా పొందుపరచబడి ఉంటాయి. ఈ వాహనం కలిగి ఉన్న భద్రతా లక్షణాల విషయానికి వస్తే, ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ డైనమిక్ రేడర్ క్రూజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, ప్రీ కొలిజన్ వ్యవస్థ, ఆటోమేటిక్ హై బీం మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి అంశాలు అందించబడతాయి.
యాంత్రికంగా, ఈ కొత్త హైబ్రిడ్ కారు పెట్రోల్ అలాగే ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. ముందుగా పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనం 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 97.8 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 142 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు వివిటి ఐ, ఎక్కువ గాలి పీల్చుకొనుటకు మరియు మార్పు చేయబడిన ఇంజన్ ను మరింత చల్లబరచడం కోసం మార్పు చేయబడిన ఇంటేక్ పోర్ట్ లను కలిగి ఉంటుంది.
0 out of 0 found this helpful