ప్రపంచవ్యాప్తంగా 2.9 మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టొయోటా సంస్థ
ఫిబ్రవరి 19, 2016 07:38 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 39 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టొయోటా సంస్థ సీటుబెల్ట్ సమస్య కారణంగా సుమారు 3 మిలియన్ వాహనాలను రీకాల్ చేసింది. జపనీస్ కార్ల తయారీ సంస్థ వారి వెనుక సీటుబెల్ట్లు ప్రమాద సమయంలో ప్రయాణికులకు భద్రత అందించడం లేదు. ఈ విషయం ఒక ప్ర్తయాణికుడు ప్రమాదంలో సీటుబెల్ట్ సీటు నుంచి వేరయ్యి ప్రాణాలు కోల్పోయిన తరువాత వెలుగులోనికి వచ్చింది. అందువలన భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా టొయోటా సంస్థ దీనిపై ముందస్తు చర్యను తీసుకోంటుంది. ఈ రీకాల్ ప్రపంచవ్యాప్తంగా స్వదేశీ మార్కెట్ జపాన్ నుండి U.S వరకూ అన్ని ప్రాంతాల కార్లపై ప్రభావం చూపించింది. అదృష్టవశాత్తు, ఏ భారతీయ మోడల్ ఈ జాబితాలో లేదు.
ఈ కాల్ బ్యాక్ ఇప్పటివరకూ RAV4 మరియు వాన్గార్డ్ అనే రెండు కార్లను ప్రభావితం చేసింది. అయితే ఈ కార్లలో RAV4 ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయింది మరియు వాన్గార్డ్ కారు జపనీస్ మార్కెట్ కోసం మాత్రమే తయారుచేయబడింది. RAV4జూలై 2005 నుండి ఆగష్టు 2014 మధ్యకాలంలో తయారుచేయబడింది మరియు వాన్గార్డ్ అక్టోబర్ 2005 మరియు జనవరి 2016 మధ్య తయారుచేయాబడింది. ఈ రెండూ కూడా ఇప్పుడు రీకాల్ చేయబడ్డాయి. ఉత్తర అమెరికా నుండి 1.3 మిలియన్ వాహనాలు,యూరోప్ లో 625.000 వాహనాలు,చైనా లో 434,000 వాహనాలు మరియు జపాన్ లో 177,000 వాహనాలు ప్రధానంగా రీకాల్ చేయబడ్డాయి.
ఆటో సంస్థ ఇది RAV4 యొక్క వెనుక సీట్లలో మెటల్ సీట్ల కుషన్ ఫ్రేముల రూపకల్పన సమస్యకి కారణమని గుర్తించింది. తీవ్రమైన ఫ్రంటల్ క్రాష్ లో, సీటు నుంచి సీటుబెల్ట్ లు విడిపోయి ప్రయాణికుడికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కార్ల తయారీసంస్థ కారు మెటల్ సీట్ల కుషన్ ఫ్రేములకు రెసిన్ కవర్లు జోడించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రతీ వాహనం ఒక గంట సమయం తీసుకుంటుంది.
ఇతర కార్ల భద్రత గురించి అడిగేసరికి సంస్థ " ఈ పరిస్థితి ఇతర వాహనాలలో రాదు, ఎందుకంటే మెటల్ సీట్ల కుషన్ ఫ్రేమ్ యొక్క ఆకారం ప్రతీ కారుకి మారుతూ ఉంటుంది." జపనీస్ సంస్థ ఈ రీకాల్ లోపం ఉన్న ఎయిర్బ్యాగ్స్ కోసం చేయబడింది. అయితే, ముందర సమస్య జాగ్రత్తగా చర్య తీసుకోవాలి, తదుపరి సమస్య టకట సారఫరాదారి యొక్క ఫాల్ట్ కారణంగా జరిగింది.