• English
  • Login / Register

టయోటా ఇన్నోవా క్రిస్టా Vs 7-సీటర్ SUVలు: అదే ధర, ఇతర ఎంపికలు

టయోటా ఇనోవా క్రైస్టా కోసం ansh ద్వారా మే 08, 2023 12:02 pm ప్రచురించబడింది

  • 34 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కేవలం డీజిల్ వెర్షన్ ఇన్నోవా క్రిస్టాను కొనుగోలు చేయాలనుకుంటే, పరిగణించగలిగిన మూడు-వరుసల ప్రత్యామ్నాయ వాహనాలు కొన్ని ఇక్కడ చూడవచ్చు

Toyota Innova Crysta vs 7-seater SUVs: Same Price, Other Options

చాలాకాలం తరువాత, టయోటా ఎట్టకేలకు 2023 ఇన్నోవా క్రిస్టా ధరలను వెల్లడించింది మరియు డీజిల్ؚతో నడిచే MPVని తిరిగి మార్కెట్ؚలోకి ప్రవేశపెట్టింది. రూ.19.99 లక్షల నుండి రూ.25.43 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్న దీని ధరను పరిగణిస్తే, డీజిల్‌తో నడిచే ఇతర 7-సీటర్ SUV ప్రత్యామ్నాయాలను కూడా చూడవచ్చు. ఈ ధరలో మీకు అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలు ఏమిటో ఇప్పుడు చూద్దాం:

ఎంపికలు 

Toyota Innova Crysta

 

టయోటా ఇన్నోవా క్రిస్టా 

మహీంద్రా XUV700

టాటా సఫారి 

MG హెక్టార్ ప్లస్ 

హ్యుందాయ్ ఆల్కజార్ 

GX (7S & 8S)-రూ.19.99 లక్షలు 

 

XT+ డార్క్ MT -  రూ. 19.98 లక్షలు 

   
 

AX5 AT–రూ. 20.90 లక్షలు 

XZ MT – రూ. 20.47 లక్షలు 

స్మార్ట్- రూ. 20.52 లక్షలు 

ప్లాటినం (O) AT – రూ. 20.76 లక్షలు 

   

XTA+ AT – రూ. 20.93 లక్షలు

 

సిగ్నేచర్ (O) AT – రూ. 20.88 లక్షలు

 

AX7 MT – రూ. 21.21 లక్షలు

XTA+ డార్క్ AT – రూ. 21.28 లక్షలు

   
   

XZA AT – రూ. 21.78  లక్షలు 

   
   

XZ+ MT – రూ. 22.17 లక్షలు 

   
   

XZ+ అడ్వెంచర్ MT – రూ. 22.42 లక్షలు

   
   

XZ+ డార్క్ MT -  రూ. 22.52 లక్షలు

   
 

AX7 AT – రూ. 22.97 lakh

XZ+ రెడ్ డార్క్ MT – రూ. 22.62 లక్షలు

షార్ప్ ప్రో – రూ. 22.97 లక్షలు 

 
 

AX7 MT లగ్జరీ ప్యాక్- రూ. 23.13 లక్షలు 

XZA+ AT – రూ. 23.47  లక్షలు

   

VX 7S – రూ. 23.79 లక్షలు 

 

XZA+ అడ్వెంచర్ AT – రూ. 23.72 లక్షలు 

   

VX 8S – రూ. 23.84 లక్షలు 

 

XZA+ డార్క్ AT – రూ. 23.82 లక్షలు 

   
   

XZA+ రెడ్ డార్క్ AT – రూ. 23.92 లక్షలు 

   
 

AX7 AT AWD – రూ. 24.41 లక్షలు 

XZA+ O AT – రూ. 24.47 లక్షలు 

   
   

XZA+ O అడ్వెంచర్ AT -  రూ. 24.72 లక్షలు 

   
 

AX7 AT లగ్జరీ ప్యాక్- రూ. 24.89 లక్షలు 

XZA+ O డార్క్ AT – రూ. 24.82 లక్షలు

   

ZX 7S – రూ. 25.43 లక్షలు 

 

XZA+ O రెడ్ డార్క్ AT – రూ. 24.92 లక్షలు

   

*ధరలు 7-సీటర్ డీజిల్ వేరియెంట్ؚలవి

  • పేర్కొన్న వాటిలో ఇన్నోవా క్రిస్టా అత్యధిక ఎంట్రీ ధరను కలిగి ఉంది, ఇది ఎంట్రీ-లెవెల్ సఫారిؚకి సమానంగా మరియు XUV700 మరియు MG హెక్టార్ ప్లస్ మిడ్-స్పెక్ వేరియెంట్ؚలకు రూ. 1 లక్ష తేడాతో ఉంది. అంతేకాకుండా, అదే ప్రీమియంకు టాప్-స్పెక్ డీజిల్-ఆటో ఆల్కజార్ؚను కొనుగోలు చేయవచ్చు.

  • తదుపరి క్రిస్టా వేరియెంట్ ధర సుమారు రూ.4 లక్షలు ఎక్కువగా ఉంది. అదే ధరకు, టాప్-స్పెక్ డీజిల్-మాన్యువల్ XUV700 లేదా దాని డీజిల్-ఆటో AWD ఎంపికను కూడా పరిగణించవచ్చు. ప్రత్యామ్నాయంగా, సఫారి టాప్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ కంటే ఒక స్థానం దిగువన ఉన్న అడ్వెంచర్, డార్క్ మరియు రెడ్ డార్క్ ఎడిషన్‌ల ఆటోమ్యాటిక్ వేరియెంట్‌లను కూడా పరిగణించవచ్చు. 

  • టాప్-స్పెక్ MG హెక్టార్ ప్లస్ ధర మిడ్-స్పెక్ ఇన్నోవా క్రిస్టా కంటే సుమారు ఒక లక్ష తక్కువ. 

  • టాప్-స్పెక్ ఇనోవా క్రిస్టాను టయోటా ఈ 7-సీటర్ SUVల టాప్-స్పెక్ వేరియెంట్ؚల కంటే ఎక్కువ ధరకు అందిస్తున్నది. XUV700 మరియు సఫారీల టాప్-స్పెక్ డీజిల్-ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚల కంటే దీని ధర రూ.50,000 కంటే అధికం.

పవర్ؚట్రెయిన్ؚలు

ఇదే ధరలో లభిస్తున్న ప్రత్యామ్నాయాలతో పోల్చితే ఇన్నోవా క్రిస్టా పర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం: 

స్పెసిఫికేషన్‌లు 

టయోటా ఇన్నోవా క్రిస్టా

మహీంద్రా XUV700

టాటా సఫారి 

MG హెక్టార్ ప్లస్

హ్యుందాయ్ ఆల్కజార్

ఇంజన్ 

2.4-లీటర్ డీజిల్ 

2.2-లీటర్ డీజిల్

2-లీటర్ డీజిల్ 

2-లీటర్ డీజిల్ 

1.5-లీటర్ 

పవర్ 

150PS

185PS వరకు 

170PS

170PS

115PS

టార్క్ 

343Nm

  450Nm వరకు

350Nm

350Nm

250Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ల MT

6-స్పీడ్ల MT/ 6-స్పీడ్ల AT

6-స్పీడ్ల MT/ 6-స్పీడ్ల AT

6-స్పీడ్ల MT

6-స్పీడ్ల MT/ 6-స్పీడ్ల AT

ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నిటిలో, మహీంద్రా XUV700 అత్యంత శక్తివంతమైన డీజిల్ యూనిట్ؚతో వస్తుంది, సఫారి మరియు హెక్టార్ ప్లస్ؚలు ఏకరితి అవుట్ؚపుట్ గణాంకాలను అందించే 2-లీటర్‌ల డీజిల్ యూనిట్ؚతో వస్తాయి మరియు ఆల్కజార్ తక్కువ పవర్ మరియు టార్క్ؚతో చిన్న యూనిట్ؚను కలిగి ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం, ఇన్నోవా మరియు హెక్టార్ ప్లస్ؚలను మినహాయించి, ఇతర మోడల్‌లు అన్నీ తమ డీజిల్ యూనిట్‌లతో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను అందిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి : టయోటా ఇన్నోవా క్రిస్టా Vs హైక్రాస్ : రెండిటిలో ఎక్కువ చవకైనది ఏది?

అంతేకాకుండా, XUV700, హెక్టార్ ప్లస్ మరియు ఆల్కజార్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో కూడా వస్తాయి, ఇది ఇన్నోవా క్రిస్టాలో లేదు. కానీ మీరు టయోటా బాడ్జెడ్ పెట్రోల్-ఆధారిత 7-సీటర్ؚను ఎంచుకుంటే మీరు టయోటా ఇన్నోవా హైక్రాస్ؚను పరిగణించవచ్చు.

ఫీచర్‌లు & భద్రత 

Toyota Innova Crysta

టయోటా ఇన్నోవా క్రిస్టా: ఇన్నోవా క్రిస్టా ఇంతకు ముందు ఉన్న ఫీచర్‌లతోనే వస్తుంది: ఎనిమిది-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, ఎయిట్-వే పవర్డ్ డ్రైవర్ సీట్, రేర్ AC వెంట్ؚలతో ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏడు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) మరియు రేర్ పార్కింగ్ సెన్సర్‌లు. 

Mahindra XUV700మహీంద్రా XUV700: పైన పేర్కొన్న XUV700 వేరియెంట్ؚలు డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్ؚరూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏడు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీల కెమెరా మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్‌లను అందిస్తాయి.

Tata Safari Red Dark Edition

టాటా సఫారి: టాటా సఫారి, 2023 క్రిస్టా ధర పరిధిలో, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ మరియు పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్‌లు, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. భద్రత విషయంలో, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలను, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆల్ వీల్ డిస్ బ్రేక్‌లు, 360-డిగ్రీల కెమెరా మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్-కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫంక్షన్‌లను అందిస్తుంది. 

MG Hector PlusMG హెక్టార్ ప్లస్: 2023లో నవీకరించబడిన హెక్టార్ ప్లస్ؚతో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, పనోరమిక్ సన్ؚరూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, పవర్డ్ టెయిల్ؚగేట్, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు 360-డిగ్రీల కెమెరా వస్తాయి. హెక్టార్ ప్లస్ ADAS ఫంక్షనాలిటీలను కూడా అందిస్తుంది, అయితే ఇవి టాప్-స్పెక్ వేరియెంట్ؚలో మాత్రమే లభిస్తాయి, ఇవి ఇన్నోవా క్రిస్టా కంటే అధిక ధరను కలిగి ఉంటుంది.

Hyundai Alcazar

హ్యుందాయ్ ఆల్కజార్: ఈ జాబితాలోని చివరి మోడల్ ఆల్కజార్ కూడా డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లేؚలు, పనోరమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ లు మరియు ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్‌లను అందిస్తుంది. భద్రత విషయంలో, ఇది ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలతో, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆల్-వీల్ డిస్ బ్రేక్ؚలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు రేర్ పార్కింగ్ కెమెరాలతో వస్తుంది.  

ఇది కూడా చదవండి: ఎంతో కాలంగా మనుగడలో-18 సంవత్సరాల తరువాత కూడా ఆధారణ పొందుతున్న టయోటా ఇన్నోవా క్రిస్టా

ఇన్నోవా క్రిస్టా ధరతో సమానంగా ఉన్న ప్రత్యామ్నాయాలు ఇక్కడ అందించబడ్డాయి. ఈ SUVలు కొత్త సాంకేతికతలతో మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉన్నపటికి, ప్రయాణించడానికి టయోటా వాహనాలలో ఉండే సౌకర్యం ఈ వాహనాలలో ఉండదనే చెప్పాలి. ప్రజాదరణ పొందిన టయోటా MPVని ఎంచుకుంటారా, లేదా ఇతర 7-సీటర్‌లలో దేన్నైనా ఎంచుకుంటారా? కామెంట్‌ల ద్వారా క్రింద తెలియజేయండి.

ఇక్కడ మరింత చదవండి: ఇన్నోవా క్రిస్టా డీజిల్

was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా Crysta

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience