టయోటా ఫార్చ్యూనర్ - దీని ప్రజాదరణకి కారణం ఏది ?
టయోటా ఫార్చ్యూనర్ 2016-2021 కోసం konark ద్వారా డిసెంబర్ 14, 2015 05:32 pm ప్రచురించబడింది
- 11 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూఢిల్లీ:టయోటా ఫార్చ్యూనర్ ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇది మార్కెట్ లో లాంచ్ చేయబడిన రోజు నుండి ఈ రోజు వరకు టయోటా యొక్క కిరీటంలో ఒక కలికితు రాయి గా నిలిచిపోయింది. 'పెద్ద కారు' అనే మన అభిప్రాయం తో సంపూర్ణంగా లీనం అవుతూ, ఈ ఎస్యూవీ నిజమైన టయోటా పద్ధతిలో అమ్మకాల ఛార్ట్ లను ఎంతో ఎత్తులో నిలబెట్టింది. టయోటా యొక్క ధరల పెంపు నిర్ణయంతో చూస్తే , ఈ సంవత్సరం ముగిసే లోపు ఒక కారు కొనుగోలు చేయడం ఖచ్చితంగా ఒక తెలివైన నిర్ణయం.
అంత ప్రాముఖ్యానికి కారణం ఏమిటి?
వాస్తవంగా చూస్తే ఎస్యూవీ లు రోడ్డు పై ఉనికిని కలిగి ఆధిపత్యాన్ని చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా టయోటా యొక్క ఈ ప్రీమియం ఎస్యూవీ టయోటా ఫార్చ్యూనర్ ఒక అందమైన బ్రూట్ లా కనిపిస్తూ, దాని దేహం చుట్టూ బలమైన కండరాల వంటి బాడీ ని కలిగి ఉంటుంది. ఎవరైన ఒక చదువు రాని వారిని, ఆటోమొబైల్స్ గురించి ఒక్క విషయం కూడా తెలియని వారిని " మీ ఫేవరెట్ కారు ఏది ?" అని అడగండి. సమాధానంలో ఒక స్పేస్ క్రాఫ్ట్ ఆకారంలో ఉన్న స్పోర్ట్స్ కారు లేదా ఒక పెద్ద ఎస్యూవీ అనే ఉంటుంది. చాలా మంది ప్రజలలో "పెద్ద" కారు అనేది ఒక రకమైన భయాన్ని ఇతరులలో కలగజేస్తుంది. అంతేకాకుండా ఈ నిజం వారి యొక్క అహాన్ని కూడా దెబ్బకొడుతుంది.
ఎస్యూవీ లు చిన్న కార్ల కంటే సురక్షితమైనవా?
భౌతిక శాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాల ప్రకారం, ప్రయాణికులు మరియు కారు యొక్క భౌతిక భాగం మధ్య తక్కువ స్థలం ఉంటే , చిన్న వాహనం లో వెళ్లే సమయంలో తీవ్రమైన గాయాలు తగిలే అవకాశం పెరుగుతూ ఉంటుంది. అవును, కారు యొక్క భారీ శరీరం ఏదోవిధంగా ఒక సురక్షితమైన పర్యావరణాన్ని సృష్టిస్తుంది, కానీ ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ట్రాక్షన్ నియంత్రణ, కర్టన్ ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేక్లు వంటి ఫీచర్స్ కలిగిన ఈనాటి చిన్న కార్లు కూడా ,పాత మరియు తక్కువ భద్రతా లక్షణాలను కలిగిన ఎస్యూవీ ల కంటే అత్యంత సురక్షితమైనవిగా చెప్పవచ్చు.
టయోటా కార్లు భారత దేశ పరిస్థితుల్లో నమ్మదాగినవీ అని చెప్పవచ్చు. టయోటా ఫార్చ్యూనర్ దాని రిచ్ లుక్స్ తో మరియు బలమైన శక్తి తో మా వీధుల్లో ఒక స్టేటస్ సింబల్ మారింది. టయోటా ఫార్చ్యూనర్ 2016 మోడల్ మునుముందు రాబోతుంది. దీనిలో 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ మరియు ఒక అదనపు లగ్జరీగా విస్తృత సన్-రూఫ్ ఉంటుందని ఆశిస్తున్నాము.
తరువాతి తరం టయోటా ఫార్చ్యూనర్ వచ్చేస్తుంది.
ఇది కూడా చదవండి: భారత ప్రత్యేక: 2016 టొయోటా ఫార్చునర్ ఆస్ట్రేలియాలో విడుదల అయ్యింది
ఇంకా చదవండి : ఫార్చ్యూనర్ గురించి