టయోటా ఫార్చ్యూనర్

` 25.7 - 31.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్‌లు

 
*Rs

టయోటా ఫార్చ్యూనర్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


జనవరి 23, 2016: టయోటా ఇండోనేషియా లో దాని ప్రీమియం ఎస్యూవి విభాగంలో, ఫార్చ్యూనర్ తరువాతి తరం నమూనాను ప్రారంభించింది. ఈ ప్రయోగం, ఫిలిప్పీన్స్ మార్కెట్లో ఎస్‌యూవీల పరిచయాన్ని అనుసరిస్తుంది మరియు ఈ 2016 టయోటా ఫార్చ్యూనర్ వాహనాన్ని ఇండోనేషియాలో, ఆర్ పి. 442,000,000 నుండి ఆర్పి. 631,500,000 ధర ట్యాగ్ వద్ద ప్రారంబించడం జరిగింది. భారతీయ రూపాయిలలో చూసినట్లైతే ఈ వాహనం యొక్క ధర సుమారు, రూ. 22 లక్షల నుండి 31 లక్షల వరకు ఉంటుంది అని అంచనా. ఈ ఎస్యూవి ను, రెండవ తరం టయోటా హైలక్స్ పికప్ ట్రక్కు నుండి స్థాపించబడి సరఫరా చేయబడింది. ఇండోనేషియా లో, ఈ 2016 టయోటా ఫార్చ్యూనర్ వాహనం, 4క్ష్2 మరియు 4క్ష్4 డ్రైవ్ ఆకృతీకరణలతో మొత్తం 6 వేరియంట్ లలో అందించబడింది.

అవలోకనం


పరిచయం


ఫార్చ్యూనర్ మొదట సుమారు 18 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది. సంవత్సరాలు గడిచే కొద్ది, టయోటా దాని ధరలను పెంచింది మరియు ఈ రోజుకి, ఫార్చ్యూనర్ ఎస్యువి వాహనం 25 లక్షల రూపాయిలతో అందుబాటులో ఉంది. ప్రతి సారి ధరను పెంచినప్పటికీ, ఈ వాహనం యొక్క లక్షణాల విషయంలో ఏ మార్పులను చోటు చేసుకోలేకపోయింది. ఈ ఫార్చ్యూనర్ వాహనం, ఇదే విభాగంలో ఉండే దాని పోటీదారులకు గట్టి పోటీ ను ఇవ్వడానికి విడుదలకు సిద్దంగా ఉంది. ఈ 2016 రెండవ తరం ఫార్చ్యూనర్ వాహనం తరువాతి భాగంలో విడుదల అవ్వనుంది అని భావిస్తున్నారు. తరువాయి భాగంలో విడుదలవ్వడానికి సిద్దంగా ఉన్న ఈ టయోటా ఫార్చ్యూనర్ వాహనం, ఫోర్డ్ ఎండీవర్ వాహనానికి గట్టి పోటీ ను ఇవ్వనుందా? చూద్దాం రండి!

అనుకూలాలు1. ఏ ప్రదేశం లో అయినా అద్భుతమైన డ్రైవ్ ను ఇవ్వడానికి, కఠినమైన అలాగే దృడమైన వైఖరిని కలిగి ఉంది.


2. చాలా సంవత్సరాలు తరువాత, రోడ్డు పై ఈ వాహనం, గంభీరమైన డిజైన్ ను కలిగి ఉంది.


3. ఇతర పోటీదారులతో పోలిస్తే ఈ వాహనం, ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

ప్రతికూలాలు1. ఫ్రేం డిజైన్ పై లేడర్ హ్యాండ్లింగ్ లో దెబ్బతీసింది. ఇదే విభాగంలో ఉండే సాంట ఫీ వాహనం, మోనోకోక్యూ శరీర నిర్మాణాన్ని కలిగి మంచి నిర్వహణను అందిస్తుంది.


2. అంతర్గత భాగం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, లోపలి భాగంలో చాలా తక్కువ అంశాలు అందించబడ్డాయి.

అత్యద్భుతమైన లక్షణాలు1. ఈ వాహనానికి, విస్తారమైన క్యాబిన్ భాగం అందించబడింది మరియు ప్రయాణికులు ఈ వాహనం లో రైడ్ ను ఖచ్చితంగా ఆనందిస్తారు.


2. ఇతర పోటీదారులతో పోలిస్తే, ఈ వాహనం అద్భుతమైన ప్రదర్శనను కలిగి ఉంది.

అవలోకనం


ఈ ఫార్చ్యూనర్ వాహనం, రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఈ వాహనం కలిగి ఉన్న 3.0 లీటర్ ఇంజన్ ఒకటి మరియు ఇన్నోవా వాహనం నుండి తీసుకోబడిన 2.5 లీటర్ ఇంజన్ రెండవది. 3.0 లీటర్ ఇంజన్, మొత్తం నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా, 4X2 మరియు 4X4 అలాగే ఇవి మాన్యువల్ మరియు ఆటోమేటి వెర్షన్ లు ఆధారంగా నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం యొక్క అంతర్గత భాగం మూడు పొరలుగా విభజించి ఉంటుంది. ఈ విభాగంలో కొనుగోలుదారులు దీనిని ఇష్టపడతారు. ఈ వాహనం గురించి చెప్పదగ్గ మరొక అంశం ఏమిటంటే, ఇతర వాహనాలలో ఉండే కొన్ని అంశాలు ఈ వాహనం లో అందించబడటం లేదు. అవి వరుసగా, వినోదం మరియు సౌకర్య అంశాలు. ఈ వాహనం అద్భుతమైన సమాచార వ్యవస్థ అందించబడింది మరియు ఇది, ఇతర పోటీ వాహనాలకు అసలు పోలిక లేదు. కొనుగోలుదారులు ఈ విభాగంలో గనుక వాహనాన్ని ఎంపిక చేసుకోదలచుకుంటే, ఈ విభాగంలో ఈ వాహనం ఖచ్చితమైన ధరతో ఉంది కాబట్టి సరైనది అని చెప్పవచ్చు.

బాహ్య భాగం


ఈ వాహనం యొక్క బాహ్య భాగం గురించి మాట్లాడటానికి వస్తే, పొడవుగా మరియు విస్తారంగా ఉంటుంది. ఈ వాహనం మొదటి చూపులోనే అందరిని ఆకట్టుకోవడమే కాకుండా మందపాటి లుక్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం యొక్క డిజైన్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.

Image 1

ముందుగా, ఈ వాహనం యొక్క ముఖ భాగం విషయానికి వస్తే బారీ బోనెట్ తో అలాగే గంభీరమైన ముందు భాగం, ఆకట్టుకునే క్రోం గ్రిల్ మరియు అద్భుతమైన బంపర్ వంటి అంశాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే దూకుడు డిజైన్, ఈ వాహనం యొక్క వెనుక భాగానికి కూడా కొనసాగుతుంది. ఈ వాహనం రోడ్డు పై ఉన్నప్పుడు కొనుగోలుదారుల మనస్సును విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Image 2 ముఖ భాగం నుండి మొదలుపెడితే, రెండు రంగుల కలయిక కలిగిన రేడియేటర్ గ్రిల్ ముందు భాగం అందంగా కనపడటం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గ్రిల్ కు పై భద్య భాగంలో, ససంథ యొక్క ప్రముఖ చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంటుంది మరియు దీనికి ఇరువైపులా క్రోం హైలైట్ లను కలిగిన స్మోకెడ్ హెడ్ ల్యాంప్‌లు విలీనం చేయబడి ఉంటాయి. వీటి వలన ముందు భాగానికి, ఖరెదైన లుక్ అందించబడుతుంది. Image 3

దీని క్రింది భాగం విషయానికి వస్తే, ఒక దృడ నిర్మాణం కలిగిన బంపర్ అందించబడుతుంది. దీనికి, ఒక ఎయిర్ డాం తో పాటు ఒక జత ఫాగ్ ల్యాంప్‌లు విలీనం చేయబడి ఉంటాయి. ఈ ఫాగ్ ల్యాంప్‌లు, నలుపు రంగుతో ఒక చక్కని క్రోం బెజెల్ తో అందించబడతాయి. గ్రిల్ పై భాగంలో ఒక బారీ బోనెట్ అందించబడుతుంది దీని మధ్య భాగంలో హుడ్ స్కూప్ విలీనం చేయబడి ఉంటుంది. మరోవైపు ఈ బోనెట్ సమతుల్యంగా ఉండటం కోసం అనేక పంక్తులు విలీనం చేయబడి ఉంటాయి. వీటన్నింటి వలన బోనెట్ స్పోర్టీ లుక్ ను కలిగి ఉంటుంది.

Image 4

మరోవైపు ఈ వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, అందరిని ఆకర్షతులను చేయడం కోసం డోర్ హ్యాండిళ్ళు క్రోం తో అలంకరించబడి ఉంటాయి. అంతేకాకుండా, నలుపు విండో ఫ్రేం లు, రూఫ్ రైల్స్ వంటి అంశాలు అందించబడతాయి. వీటన్నింటితో పాటు ఈ వాహనం యొక్క బారీ వీల్ ఆర్చులకు వీల్ ఫెండర్లు మరియు మజిల్ వంటివి అందించబడతాయి. వాహనానికి స్పోర్టీ లుక్ ను ఇవ్వడం కోసం ఈ వీల్ ఆర్చులకు అల్లాయ్ వీల్స్ అందించబడతాయి.

Image 5

మరోవైపు ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, కుదించిన డిజైన్ కలిగిన టైల్ ల్యాంప్‌లు అందించబడతాయి. వాహనానికి డైనమిక్ ప్రభావాన్ని అందించడానికి, క్రోం స్ట్రిప్ ర్యాప్ ను అందించడం జరిగింది. వీటన్నింటి వలన ఈ వాహనం మరింత అందంగా కనబడుతుంది.

Image 6

Table 1

Table 2

అంతర్గత భాగం


ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, విశాలమైన బారీ క్యాబిన్ అందించబడుతుంది. ఈ క్యాబిన్, పరిమాణం విషయంలో అపారమైన పరిమాణాన్ని కలిగి ఉంది మరియు సౌకర్యవంతంగా ఏడుగురు వ్యక్తులు హాయిగా కూర్చునే స్థలం అందించబడుతుంది. లోపల భాగంలో కూర్చునే ప్రయాణికులు కొంచెం బొద్దుగా ఉన్నట్లైతే అసౌకర్యం అందించబడుతుంది. కాక్‌పిట్ విభాగంలో ఉండే డాష్‌బోర్డ్ ఒకే ఒక రంగు నలుపు రంగు పధకాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది మరింత అందంగా కనబడటం కోసం చెక్క చేరికలు అందిచ్నబడతాయి మరియు దీనిపై, వెండి రంగు లో ఉండే స్విచ్చులు విలీనం చేయబడి ఉంటాయి.

Image 7

ఎయిర్ కండీషనింగ్ వెంట్లు, సాధారణ అర్ధ సమాంతర చతుర్భుజ యూనిట్ల ను కలిగి ఉంటాయి మరియు ఇవి వ్యక్తిగతంగా మూసివేయవచ్చు.

Image 8

సెంట్రల్ కన్సోల్ యొక్క డిజైన్ కొంచెం తక్కువగా ఉంటుంది మరియు కొనుగోలుదారుల యొక్క అభిప్రాయం మేరకు దీనిని రూపొందించుకోవచ్చు. డాష్‌బోర్డ్ పై ఉండే సమాచార వ్యవస్థ, ఒక టచ్ స్క్రీన్ యూనిట్ తో వస్తుంది మరియు దీనిపై, నాబ్ లు అలాగే స్విచ్చులు అందంగా పొందుపరచబడి ఉంటాయి.

Image 9

డాష్‌బోర్డ్ యొక్క కుడి వైపు, నాలుగు స్పోక్ల స్టీరింగ్ వీల్ అందించబడుతుంది మరియు ఇది, మంచి పట్టును కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం లో ఉండే స్టీరింగ్ వీల్ పట్టు విషయంలో రాజీ పడవలసిన అవసరం లేదు. ఈ స్టీరింగ్ వీల్ లెధర్ తో కప్పబడి ఉంటుంది మరియు వెండి చేరికలతో అలంకరించబడి ఉంటుంది. సమాచార వ్యవస్థ, ఎం ఐ డి మరియు వాయిస్ కంట్రోల్ వ్యవస్థ వంటివి స్టీరింగ్ వీల్ కు ఇరువైపులా విలీనం చేయబడి ఉంటాయి.

స్టీరింగ్ వీల్ కు కుడి వైపు భాగంలో, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా దీనిలో, స్పీడోమీటర్, టాకోమీటర్ మరియు ఇంధన సూచికను ప్రదర్శించే మూడవ డైల్ వంటి మీటర్లు విలీనం చేయబడి ఉంటాయి. స్పీడోమీటర్, క్రోం రింగ్ లతో వస్తుంది మరియు ప్రతిసారి సులభంగా చదవడానికి ఈ డైల్స్ ప్రకాశంతో అందించబడతాయి.

Image 10

క్యాబిన్ లో ఉండే సీటును గనుక ఎంపిక చేసుకోదలచుకుంటే, దీనిలో అందించబడిన సీటు మరి అంత సౌకర్యంగా ఉండదు. ఎందువలన అంటే, ఈ జపనీస్ సంస్థ, సీటింగ్ అమరిక విషయంలో ఎక్కువ మొత్తం లో ఎర్గనామిక్స్ ను అందించడం జరిగింది. క్యాబిన్ లో ఉండే సీట్లు, ఎర్గనామికల్ గా పొందుపరచబడి ఉంటాయి.

Image 11

క్యాబిన్ లో అందించబడిన సీట్లు, విస్తారంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సీట్ల విషయం లో ఎక్కువగా పిర్యాదు చేయవలసిన అవసరం లేదు. ప్రయాణ సమయాలలో ప్రయాణికులకు ఖరీదైన అనుభూతిని అందించడానికి క్యాబిన్ లో ఉండే అన్ని సీట్లు, లెధర్ తో కప్పబడి ఉంటాయి. మరింత సౌకర్యాన్ని అందించడం కోసం సీట్లకు, ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్లు మరియు ఆర్మ్ రెస్ట్లు అందించబడతాయి. క్యాబిన్ రెండవ వరుస లో కూర్చునే ప్రయాణికులు చాలా హాయిగా మరియు సౌకర్యవంతంగా ఉంటారు ఎందుకంతే వారికి, పుష్కలమీన్ లెగ్ రూం అందించబడుతుంది. కానీ మూడవ వరుస సీట్లను మరింత అబివృద్ది పరచ వలసిన అవసరం ఉంది. వెనుక మద్దతు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ, సీట్లు తొడ క్రింది మద్దతును కలిగి లేవు.

Image 12

పనితీరు


తయారీదారుడు ఈ వాహనానికి, రెండు ఇంజన్ ఎంపికలను అందించాడు. అవి వరుసగా 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్. ముందుగా 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 2494 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్ లను అలాగే 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ ఒక టర్బో చార్జర్ ను కలిగి అత్యధికంగా, 3400 ఆర్ పి ఎం వద్ద 142 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1600 నుండి 2800 ఆర్ పి ఎం మధ్యలో 343 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వాహనం యొక్క ముందు చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, 2982 సిసి స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి డి ఓ హెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా నాలుగు సిలండర్లను మరియు 16 వాల్వ్ లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ కూడా ఒక టర్బో చార్జర్ ను కలిగి అత్యధికంగా, 3600 ఆర్ పి ఎం వద్ద 168.5 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 1400 నుండి 3200 ఆర్ పి ఎం మధ్యలో 360 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఆటోమేటిక్ వెర్షన్ లో అయితే, 1400 నుండి 3400 ఆర్ పి ఎం మధ్యలో 343 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని ద్వారా, విడుదల అయిన టార్క్ ఉత్పత్తి వేరియంట్ రకాన్ని బట్టి వాహనం యొక్క చక్రాలకు పంపిణీ అవుతుంది. మరోవైపు ఇంజన్ యొక్క త్వరణం విషయానికి వస్తే, ఈ రెండు ఇంజన్లు కూడా 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి, 9.6 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం 176 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ ఇంజన్లు యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే సి ఆర్ డి ఐ ఇంధన ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చేయబడి ఉంటాయి. ముందుగా 2.5 లీటర్ దీజిల్ ఇంజన్ నగరాలలో, 9.25 మైలేజ్ ను అలాగే రహదారులలో 13 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, నగరాలలో 9.25 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా రహదారులలో 12.55 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Image 13

Table 3

రైడ్ మరియు హ్యాండ్లింగ్


తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అన్ని వేళలా స్థిరంగా ఉండటానికి మరియు సమతుల్యంగా ఉండటానికి, నమ్మకమైన బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే సమర్ధవంతమైన సస్పెన్షన్ మెకానిజాన్ని అందించడం జరిగింది. సంస్థ, ఈ టయోటా యొక్క అన్ని వాహనాలకు, కఠినమైన భారతీయ రోడ్లపై సామర్ధ్యాన్ని అందించడం కోసం అందమైన బలమైన డైనమిక్స్ ను అందించింది. ఈ వాహనానికి బిన్నంగా ఏమి అందించబడలేదు కానీ, ఖచ్చితంగా మెరుగుదల మాత్రం కనిపించింది. ఈ వాహనానికి అందించిన చాసిస్ మాత్రం, భారతీయ రోడ్లకు సరిపోయే చాసిస్ ను అందించింది. ఎగుడుదిగుడు రోడ్లపై కూడా మంచి రైడ్ ను ఇవ్వడానికి తయారీదారుడు ఈ వాహనం యొక్క ముందు చక్రానికి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ ను అలాగే వెనుక చక్రానికి డ్రం బ్రేక్ ను అందించాడు. ఈ బ్రేకింగ్ మెకానిజాన్ని మరింత మెరుగుపరచడానికి, తయారీదారుడు యాంటీ లాక్ బ్రేకింగ్ మెకానిజాన్ని అలాగే బ్రేక్ అసిస్ట్ వంటి ఫంక్షన్ లను అందించాడు. దీనితో పాటు వాహన స్థిరత్వ నియంత్రణను కూడా అందించడం జరిగింది. దీని వలన వాహనం పైకి వెళుతున్నప్పుడు గాని క్రిందకి దిగుతున్నప్పుడు గాని వాహనం దాని పట్టును కోల్పోకుండా మంచి ఆహ్లాదకరమైన రైడ్ ను అందించగలుగుతుంది. మరోవైపు సస్పెన్షన్ మెకానిజం విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క ముందు ఆక్సిల్ డబుల్ విష్బోన్ సస్పెన్షన్ తో అలాగే వెనుక ఆక్సిల్ ఫోర్ లింక్ తో విలీనం చేయబడి ఉంది. అంతేకాకుండా, తయారీదారుడు ఈ వాహనానికి, ర్యాక్ అండ్ పినియన్ ఆధారిత టిల్ట్ సర్ధుబాటు ఫంక్షన్ ను కలిగిన పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ ను అందించాడు. బారీ ట్రాఫిక్ సమయాలలో మంచి నిర్వహణను అందించడానికి, ఈ స్టీరింగ్ వీల్ 5.6 మీటర్ల టర్నింగ్ వ్యాశార్ధానికి మద్దతు ఇస్తుంది.

Image 14

భద్రత


ఈ సంస్థ యొక్క తయారీదారుడు ఈ వాహనానికి, వాహనం అలాగే ప్రయాణికులకు గరిష్ట స్థాయిలో భద్రత ను అందించడానికి అనేక రక్షిత అంశాలను అందించడం జరిగింది. క్యాబిన్ లోపల ఉండే ముందు ప్రయాణికులకు గరిష్ట రక్షణను అందించడానికి, ఎయిర్బాగ్ లను అందించడం జరిగింది. దీనితో పాటు ముందు ప్రయాణికులకు, ప్రీ టెన్సినార్ మరియు బెల్ట్ ఫోర్స్ లిమిటార్ తో కూడిన సీటు బెల్ట్ లను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు తయారీదారుడు ఈ వాహనానికి అనేక అధునాతన భద్రతా అంశాలను అందించాడు. అవి వరుసగా, యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు వాహన స్థిరత్వ నియంత్రణ వంటి అంశాలను అందించడం జరిగింది. మరోవైపు, వాహనం దొంగతనాల బారి పడకుండా ఉండటానికి అలాగే ఈ వాహనంలో ఏ అనధికార ప్రవేశం జరగకుండా ఉండటానికి ఇంజన్ ఇమ్మొబిలైజర్ పరికరాన్ని అందించడం జరిగింది. ఈ వాహనం యొక్క ముందరి వీల్స్ వెంటిలేషన్ డిస్క్ బ్రేక్‌ల సమితితో అమర్చబడి ఉండి తక్షణమే వాహనం యొక్క వేగాన్ని తగ్గించడం లో సహాయపడతాయి. ఇది గ్లోబల్ ఔట్ సైడింగ్ అసెస్మెంట్ బాడీ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీని వలన, తాకిడి సమయంలో ప్రయాణికులను కాపాడుతుంది. దాని ఆటోమేటిక్ హెచ్ ఐడి హెడ్‌ల్యాంప్స్ డ్రైవర్ కి ఒక స్పష్టమైన దృష్టి ని అందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించేందుకు సహాయపడతాయి. అదనంగా ఈ వాహనానికి, ఎస్ యువి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, షిఫ్ట్ లాక్ వ్యవస్థ మరియు ముందర ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా దృష్టి గోచరత పెంచడంలో సహాయపడతాయి. ఈ అంశాలన్నీ కలిసి ఈ విభాగంలో వాహనాన్ని భద్రంగా ఉంచుతాయి.

Image 15

Table 4

వేరియంట్లు


ఈ వాహనం, 4X4 ఏటి, 4X4 ఎం టి, 4X2 ఏటి, 4X2 ఎంటి అను నాగులు వేరియంట్ స్థాయిలలో అందించబడుతుంది. ఈ మోడల్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లకు, ప్రామాణిక కాస్మటిక్ అంశాలు, సౌకర్య మరియు సౌలభ్య లక్షణాలు అన్ని కూడా ప్రామాణికంగా అందించబడతాయి మరియు ఒకే ఒక తేడా ఎక్కడ అంటే, డ్రైవ్ ఫార్మెట్ అలాగే ట్రాన్స్మిషన్ మధ్య స్వల్ప తేడా ఉంటుంది.

Table 5

తుది విశ్లేషణ


కొనుగోలుదారులు ఎవరైన ఒక సంవత్సరం క్రితం ముందు ఈ టయోటా ఫార్చ్యూనర్ వాహనాన్ని గురించి అడిగినట్లైతే, ఫార్చ్యూనర్ ప్రీమియం ఎస్యూవి విభాగంలో ఉత్తమ ఎంపికల లో ఒకటి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సమయంలో గనుక అడిగినట్లైతే, ఈ వాహనానికి, ఇదే విభాగంలో ఉండే ఫోర్డ్ ఎండీవర్ గట్టి పోటీ ను ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఫార్చ్యూనర్ వాహనం, ఎక్కువ ధర ను కలిగి ఉండటమే కాకుండా తక్కువ అంశాలను కలిగి ఉంది. మరోవైపు ప్రయోజనకరమైన విషయం ఏమిటంటే, కఠినమైన రోడ్లపై దృడంగా ఉంటుంది అలాగే కఠినత్వం పరంగా ప్రయోజనాలను నిలుపుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వాహనం కోసం కొంచెం కాలం వేచి ఉండవలసి ఉంది అని ఆశించడమైనది.