టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మా కంటపడింది. 2020 లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది
టయోటా ఫార్చ్యూనర్ 2016-2021 కోసం rohit ద్వారా జనవరి 23, 2020 11:54 am ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ తో టయోటా సన్‌రూఫ్ ను జోడించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము
- ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ థాయ్‌లాండ్ లో టెస్టింగ్ అవుతుండగా మా కంటపడింది.
- ఇది లోపల-బయట స్టైలింగ్ అంశాలను కలిగి ఉండే అవకాశం ఉంది.
- దీనిలో సన్‌రూఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది.
- ఇది ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్ G 4 మరియు రాబోయే MG D 90 వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
టయోటా యొక్క పూర్తి-పరిమాణ SUV ఫార్చ్యూనర్, 2016 నుండి భారతదేశంలో అమ్మకానికి ఉంది మరియు మిడ్-లైఫ్ అప్‌డేట్ కోసం వేచి ఉంది. ఇటీవలే థాయ్‌లాండ్ లో మా కంటపడిన ఫేస్‌లిఫ్టెడ్ SUV యొక్క మొట్టమొదటి స్నాప్ షాట్‌లపై ఇప్పుడు మన చేతులు ఉంచాము.
టెస్ట్ మ్యూల్ పూర్తిగా కవరింగ్ తో ఉన్నప్పటికీ, దాని సవరించిన డిజైన్ మరియు స్టైలింగ్ ఎలిమెంట్లు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మూడు-స్లాట్ గ్రిల్ మరియు బంపర్ టయోటా యొక్క RAV4 SUVనుండి ప్రేరణ పొందినట్లుగా ఉంది. గ్రిల్ కాకుండా, రిఫ్రెష్ చేసిన ఫార్చ్యూనర్ టెయిల్ ల్యాంప్స్ లో అప్‌డేట్ చేయబడిన అంశాలతో పాటు LED DRLలతో అప్‌డేట్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌లను కూడా కలిగి ఉంటుంది. కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌ను మినహాయిస్తే దాని సైడ్ ప్రొఫైల్ పెద్దగా మారలేదు.
ఇది కూడా చదవండి: BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8-లీటర్ డీజిల్ ఎంపికను కోల్పోతుంది
ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్‌ల విషయానికొస్తే, ప్రస్తుతానికి అంతగా తెలియదు. ఏదేమైనా, ఇది కొత్త అప్హోల్స్టరీతో కూడిన మరింత ఖరీదైన క్యాబిన్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేకు మద్దతు ఇవ్వగల నవీకరించబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నాము. ఇది పెద్ద పనోరమిక్ యూనిట్ కాకపోయినా ఈ నవీకరణతో చిన్న సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నాము.
ఇంజన్ విషయానికి వస్తే, ఇండియా-స్పెక్ ఫార్చ్యూనర్ ఫేస్ లిఫ్ట్ BS 6 సమ్మతితో ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ మాదిరిగానే ఇంజిన్లతో అందించబడుతుంది. BS 4 ఫార్చ్యూనర్ ప్రస్తుతం 2.7-లీటర్ పెట్రోల్ తో పాటు 2.8-లీటర్ డీజిల్‌తో అందిస్తోంది, రెండూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తాయి.
ఫేస్‌లిఫ్టెడ్ ఫార్చ్యూనర్ ఈ ఏడాది చివర్లో మా తీరానికి వస్తుందని మేము ఆశిస్తున్నాము. నవీకరణల కారణంగా ఇది స్వల్ప ధరల పెరుగుదలను పొందవచ్చు మరియు ఇది ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా అల్టురాస్ G 4, హోండా CR-V, స్కోడా కోడియాక్, VW టిగువాన్ మరియు రాబోయే MG D90 లకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది.
మరింత చదవండి: ఫార్చ్యూనర్ ఆటోమేటిక్