• English
  • Login / Register

BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా 2.8-లీటర్ డీజిల్ ఆప్షన్‌ను కోల్పోయింది

టయోటా ఇనోవా క్రిస్టా 2016-2020 కోసం sonny ద్వారా జనవరి 15, 2020 12:19 pm ప్రచురించబడింది

  • 208 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇప్పుడే లాంచ్ అయిన BS6 టయోటా ఇన్నోవా క్రిస్టా రెండు ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తుంది

  •  2.7-లీటర్ పెట్రోల్ మరియు 2.4-లీటర్ డీజిల్ మోటార్లు BS6 ఎమిషన్ నారంస్ మీట్ అయ్యే విధంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.
  •  BS6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వాటి BS4 వెర్షన్ల మాదిరిగానే అదే పెర్ఫామెన్స్  ని అందిస్తాయి.
  •  టయోటా ఇప్పుడు 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో ఆటోమేటిక్ ఆప్షన్‌ ను అందిస్తోంది.
  •  BS6 ఇన్నోవా క్రిస్టా ధర రూ .15.36 లక్షల నుంచి రూ .24.08 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఇన్నోవా క్రిస్టా యొక్క BS 6 కంప్లైంట్ వెర్షన్లు ఇటీవల ప్రారంభించబడ్డాయి మరియు ఇది ఇప్పుడు రెండు ఇంజన్లతో వస్తుంది, పెద్ద 2.8 లీటర్ డీజిల్ మోటార్ ముందు తీసుకెళ్ళబడడం లేదు. 2.8-లీటర్ ఇంజిన్ ప్రముఖ MPV యొక్క BS4 వెర్షన్‌ లో చాలా శక్తివంతమైన యూనిట్. అయితే టొయోటా సంస్థ ఇన్నోవా లోని ఈ మోటారుని MPV ధరలను అదుపులో ఉంచుకోవాలనే ఆసక్తితో తీసేసింది, అయితే ఇది రాబోయే BS6  ఫార్చ్యూనర్ SUV కోసం BS6 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడుతుందని ఊహిస్తున్నాము.

BS4 ఇన్నోవా క్రిస్టా లోని 2.8-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో మాత్రమే అందించబడింది.ఇది 174Ps పవర్ మరియు 360Nm టార్క్ ని ఉత్పత్తి చేసింది. ఇదిలా ఉండగా, BS4 2.4-లీటర్ డీజిల్ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్‌ తో మాత్రమే అందించబడింది. అయితే, డీజిల్-ఆటోమేటిక్ MPV కోసం చూస్తున్న కొనుగోలుదారులు ఇప్పుడు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టయోటా ఇప్పుడు 6-స్పీడ్ ఆటో ‘బాక్స్‌ తో చిన్న డీజిల్ ఇంజిన్‌ ను అందిస్తుంది. అంతకు ముందులాగే, కొనుగోలుదారులు 2.7-లీటర్ పెట్రోల్-ఆటోమేటిక్ వేరియంట్‌ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.   

BS6 Toyota Innova Crysta Loses 2.8-litre Diesel Option

2.8-లీటర్ డీజిల్-ఆటో కాంబో మాదిరిగా, కొత్త 2.4-లీటర్ డీజిల్-ఆటో మిడ్-స్పెక్ GX మరియు టాప్-స్పెక్ ZX అను రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఇది టొయోటా BS 6 అప్‌డేట్ కోసం ప్రీమియాన్ని రూ .1 లక్షలోపు తగ్గించడానికి హెల్ప్ అయ్యింది.  

MPV యొక్క 2.4-లీటర్ డీజిల్-ఆటో వేరియంట్ల ధరలు ఇక్కడ ఉన్నాయి:

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

GX AT 7-సీటు/8-సీటు

రూ. 17.46 లక్షలు/ రూ. 17.51 లక్షలు (2.8-లీటర్)

రూ. 18.17 లక్షలు/ రూ.18.22 లక్షలు

రూ. 71,000

ZX AT

రూ. 22.43 లక్షలు (2.8-లీటర్)

రూ. 23.02 లక్షలు

రూ. 59,000

ZX AT టూరింగ్ స్పోర్ట్

రూ. 23.47 లక్షలు (2.8-లీటర్)

రూ. 24.06 లక్షలు

రూ. 59,000

టయోటా ఇంకా BS 6 ఇంజిన్ల పెర్ఫార్మెన్స్ సంఖ్యలను ఇంకా వెల్లడించాల్సి ఉంది, అయితే అవి BS 4 వెర్షన్ల మాదిరిగానే కొంచెం ఎక్కువ లేదా తక్కువగానే ఉండొచ్చని మేము ఆశిస్తున్నాము. రిఫరెన్స్ కోసం, BS 4 2.7-లీటర్ పెట్రోల్ 166Ps పవర్ మరియు 245Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది, అయితే 2.4-లీటర్ డీజిల్ మోటారు 150 Ps పవర్ మరియు 343Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.    

రెండు ఇంజన్లు ఇప్పుడు 5-స్పీడ్ మాన్యువల్‌ తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో అందించబడుతున్నాయి. BS 4 పెట్రోల్-మాన్యువల్ మరియు పెట్రోల్-ఆటో పవర్‌ట్రెయిన్‌ లు సుమారు 10 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి, అయితే డీజిల్ మోటారు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో 14-15 కిలోమీటర్ల మైలేజ్ ఫిగర్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

BS6 Toyota Innova Crysta Loses 2.8-litre Diesel Option

BS 6 టయోటా ఇన్నోవా క్రిస్టా ధర రూ .15.36 లక్షల నుంచి రూ .24.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది త్వరలో, 2020 లో  Tata Gravitas టాటా గ్రావిటాస్ మరియు 6 సీట్ల MG హెక్టర్ వంటి వాటితో పోటీ పడుతుంది.  

మరింత చదవండి: టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్

was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా క్రిస్టా 2016-2020

2 వ్యాఖ్యలు
1
R
rakesh sharma
Jan 9, 2020, 12:43:01 PM

I have been driving Innova since 2008 February and logged one lacs 11thousand. The cars engine gearbox n other fittings r doing perfectly well. It's cheaper to maintain strong very comfortable on longdrives

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    R
    raju kakkassery
    Jan 7, 2020, 8:48:35 PM

    It is very economical car. Very comfortable also, getting mileage around 15 kmper litre. Raju Kakkassery-Xenon Solar.

    Read More...
      సమాధానం
      Write a Reply

      ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience