• English
  • Login / Register

బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ తో హోండా జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ స్పెక్స్ బహిర్గతం

జూన్ 06, 2015 11:21 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హోండా జాజ్ తిరిగి మళ్ళీ మాకు కనిపించింది. ఈసారి జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన పెట్రోల్ వేరియంట్ చిత్రాలను కలిగి ఉన్నాము. రెండు రోజుల క్రితం మేము హోండా జాజ్ తో పాటు టచ్స్క్రీన్ యూనిట్ యొక్క మొదటి చిత్రాలను మీకు అందించాము. ఇప్పుడు అందించిన జాజ్ యొక్క వైట్ చిత్రాలు దీని అగ్ర శ్రేణి వేరియంట్ చిత్రాలు. అంతేకాకుండా ఇది ఒక హాట్చ్బాక్ మరియు అంతర్గత భాగాలు అన్ని డ్యూయల్ టోన్ బ్లాక్ కలర్ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా జాజ్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన రెడ్ కలర్ జాజ్ యొక్క చిత్రాలను ముందుగానే చూపించాము. 

హోండా జాజ్ అంతర్గత బాగాలన్ని నలుపు రంగు పధకంతో పాటు వెండి చేరికలతో అలంకరించబడి ఉంటుంది. జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ చిత్రాలను కనుక చూసినట్లైతే, ఐ-విటెక్ పెట్రోల్ తో పాటు ప్రీమియం బ్లాక్ ఫ్యాబ్రిక్ అపోలిస్ట్రీ తో అందించబడుతుంది. లక్షణాలు పరంగా చెప్పాలంటే, ఈ జాజ్ లో 15.7 సెం.మీ. టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ అమర్చబడి ఉంటుంది. దీనిని ఇంతకుముందు మనం హోండా సిటీ లో చూడవచ్చు. అంతేకాకుండా ఈ హోండా సిటీ నుండి ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్ తో పాటు బ్లూటూత్ మరియు ఆడియో స్ట్రీమింగ్, మరియు డివిడి / సిడి ప్లేబ్యాక్ వంటి లక్షణాలను ఇప్పుడు రాబోయే జాజ్ లో చూడవచ్చు.     

ఇంజెన్ ఎంపికల విషయానికి వస్తే, రాబోయే ఈ 2015 హోండా జాజ్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఎంపికలతో అందుబాటులో ఉండబోతుంది. ఈ జాజ్ లో డీజిల్ వేరియంట్ ను మొట్టమొదటిసారిగా చూడబోతున్నాము. రాబోయే జాజ్ యొక్క పెట్రోల్ వేరియంట్ పాత దానిలాగే అదే 1.2 లీటర్ ఐ-విటెక్ ఇంజెన్ తో రాబోతుంది. ఈ ఇంజెన్ అత్యధికంగా 88PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా మరోవైపు 109Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. మరియు ఇది రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలు తో సిస్టమ్తో వస్తుంది - 5-స్పీడ్ మాన్యువల్ స్టీరింగ్ మౌంటెడ్ పెడల్ షిఫ్టర్ తో పాటు ఆటోమేటిక్ సివిటి తో రాబోతుంది. ఈ జాజ్ యొక్క డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, హోండా సిటీ మరియు అమేజ్ లాగానే 1.5 లీటర్ ఐ-డిటెక్ తో రాబోతుంది. ఈ ఇంజెన్ అత్యధికం 100PS పవర్ ను ఉత్పత్తి చేయగా 200Nm గల టార్క్ ను అత్యధికంగా విడుదల చేస్తుంది. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience