ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసాక ఇండియా లో టెస్లా అరంగేట్రాన్ని ధ్రువీకరించిన ఎలన్ మస్క్

టెస్లా మోడల్ 3 కోసం tarun ద్వారా జూన్ 22, 2023 09:55 pm ప్రచురించబడింది

  • 52 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారతదేశంలో టెస్లా యొక్క తొలి కార్లు మోడల్ 3 మరియు మోడల్ Y కావచ్చు

Elon Musk Narendra Modi

తాజా వార్త!  ఎలన్ మస్క్ టెస్లా ఇండియా లాంచ్‌ను  ధృవీకరించారు. ట్విట్టర్ CEO భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా పర్యటనలో కలిశారు, అక్కడ వారు అనేక సమస్యల గురించి మాట్లాడారు. 

ఒక బహిరంగ ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ మాట్లాడుతూ, "ప్రధానితో ఇది అద్భుతమైన సమావేశం అని, ఆయనంటే చాలా ఇష్టం అని తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఎలన్ మస్క్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారని కొంతకాలంగా పరిచయం ఉందని" కూడా తెలియజేసారు.

"భారతదేశం భవిష్యత్తు గురించి ఎన్నో యోచనలు ఉన్నాయని, ప్రపంచంలోని పెద్ద దేశాలతో పోలిస్తే భారతదేశం ఎంతో సమర్థవంతమైన దేశమని భావిస్తున్నారని," అన్నారు.

ఇది కూడా చదవండి: పెద్దది, మంచిది? ఈ 10 కార్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి

టెస్లా ఎప్పుడు వస్తుంది?

Tesla Model Y

టెస్లా వీలైనంత త్వరగా భారత్‌లోకి వస్తుందని మస్క్ చెప్పారు. ప్రధాని భారతదేశంలో గణనీయమైన పెట్టుబడి అవకాశాల కనుగొనటానికి టెస్లా వ్యవస్థాపకుడిని ఆహ్వానించారు. టెస్లా భారతదేశంలో ఒక కర్మాగారాన్ని నెలకొల్పాలని స్థానికంగా ఉత్పత్తి చేయబడిన EVలను విక్రయించాలని యోచిస్తోందన్న నివేదికలను ఇది మరింత బలపరుస్తుంది. ఇది ఇప్పటికీ ప్రీమియంలో ఉన్న EVల కన్నా తక్కువ ధరలను నిర్ధారిస్తుంది.

టెస్లా గురించిన చర్చలు

Tesla Model 3

టెస్లా-ఇండియా చర్చలు సంవత్సరాలుగా ఎన్నో ఒడి దుడుకులు చూశాయి. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బెంగళూరులో కార్యాలయాన్ని కూడా నమోదు చేసింది, మోడల్ 3 యొక్క అనేక టెస్ట్ మ్యూల్స్‌ను కూడా గుర్తించబడ్డాయి. అయినప్పటికి,అధిక దిగుమతి పన్నులు ప్రధాన అడ్డంకిగా నిలిచాయి, దీని వలన టెస్లా భారతదేశ  తరలింపుపై సందేహాన్ని వ్యక్తం చేసాయి. EVలపై తక్కువ టాక్స్ ల కోసం అమెరికన్ కారు తయారీ సంస్థ యొక్క అభ్యర్థన తొలగించబడింది. కంపెనీ ఉత్పత్తులతో మార్కెట్‌ను ముందుగా పరీక్షించకుండానే తయారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేదు.

ఇది కూడా చదవండి: భారతదేశం యొక్క లిథియం నిల్వలు ఇప్పుడే పెద్దవిగా మారాయి

కారు తయారీ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోడల్ 3, మోడల్ Y, మోడల్ X మరియు మోడల్ Sలను విక్రయిస్తోంది. భారతదేశం మొదట మోడల్ 3 సెడాన్ మరియు మోడల్ Y క్రాసోవర్‌లను పొందవచ్చు. సైబర్‌ట్రక్ 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రారభించబడుతుంది, అయితే కార్ల తయారీదారు కొత్త ఎంట్రీ-లెవల్ EVని కూడా సిద్ధం చేస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన టెస్లా మోడల్ 3

1 వ్యాఖ్య
1
S
sunilkumar
Jun 21, 2023, 12:30:42 PM

Have they agreed to lower the import duty? That was the main issue

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    explore మరిన్ని on టెస్లా మోడల్ 3

    space Image

    ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    ×
    We need your సిటీ to customize your experience