తమ “డార్క్ ” శ్రేణికి త్వరలోనే నెక్సాన్ EV మాక్స్ؚను జోడించనున్న టాటా, విడుదలైన మొదటి టీజర్
టాటా నెక్సన్ ఈవి మాక్స్ 2022-2023 కోసం rohit ద్వారా ఏప్రిల్ 14, 2023 02:48 pm సవరించబడింది
- 62 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నెక్సాన్ EV మాక్స్ డార్క్ؚలో ముఖ్యమైన అంశం కొత్త 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, దీన్ని నవీకరించబడిన హ్యారియర్-సఫారి జంటలో చూడవచ్చు
-
ఎలక్ట్రిక్ సబ్-4m SUV డార్క్ శ్రేణిని నెక్సాన్ EV మాక్స్ సంపూర్ణం చేస్తుంది.
-
డ్యాష్ బోర్డ్ؚపై ఉన్న టేల్ బ్లూ యాక్సెంట్ؚను టీజర్‌లో చూడవచ్చు.
-
నెక్సాన్ EV ప్రైమ్ డార్క్ؚకు సారూప్యంగా ఉన్న నలుపు రంగును మరియు EV-కేంద్రీకృత అంశాలను లోపల, వెలుపల పొందనుంది.
-
వెంటిలేటెడ్ ముందు సీట్‌లు మరియు సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా ప్రామాణిక నెక్సాన్ EV మాక్స్ ఫీచర్‌ల జాబితాతో ఇది కొనసాగుతుంది.
-
నెక్సాన్ EV మాక్స్ 453km క్లెయిమ్ చేసిన పరిధిని అందించగల 40.5kWh బ్యాటరీ ప్యాక్ؚను ఉపయోగిస్తుంది.
-
అధిక ధరతో, హయ్యర్ వేరియెంట్ؚలుగా మాత్రమే అందిస్తారని అంచనా.
ఇప్పటి వరకు, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ؚను కొనుగోలు చేయాలంటే, కేవలం ప్రామాణిక అంతర్గత కంబుషన్ ఇంజన్ (ICE) వేరియెంట్ؚలు లేదా నెక్సాన్ EV ప్రైమ్ మాత్రమే ఎంచుకోగలరు. ఈ కారు తయారీదారు తన ఫ్లాగ్ షిప్ EV అయిన నెక్సాన్ EV మాక్స్ త్వరలోనే డార్క్ శ్రేణికి జోడించబడుతుందని సూచిస్తూ కొత్త టీజర్ؚను విడుదల చేశారు.
అతి పెద్ద ప్రకటన
View this post on InstagramA post shared by TataPassengerElectricMobility (@tatamotorsevolvetoelectric)
నవీకరించిన హ్యారియర్ మరియు సఫారీలో ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇందులో కూడా ఉండవచ్చని టీజర్ వీడియోలో తెలియచేసిన ముఖ్యమైన అంశం. SUV జంటలో కనిపించిన ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, మరింత సులభమైన యూజర్ ఇంటర్ఫేస్ (UI) మరియు మెరుగైన గ్రాఫిక్స్ؚ కలిగి ఉంటుంది. కొత్త డిస్ప్లే యూనిట్ కోసం నెక్సాన్ డ్యాష్ؚబోర్డ్ పై భాగాన్ని టాటా సర్దుబాటు చేసి ఉండవచ్చు. ప్రస్తుత మోడల్ؚలో విధంగానే, డ్యాష్‌బోర్డ్ అంతటా ఉన్న టేల్ బ్లూ యాక్సెంట్ؚను టీజర్ؚలో చూడవచ్చు.
ఇది కూడా చదవండి: లిథియం రిజర్వ్ؚను కలిగి ఉండటం వలన భారతదేశానికి ప్రయోజనం ఏమిటి?
నెక్సాన్ EV ప్రైమ్ డార్క్ؚతో సారూప్యతలు
నెక్సాన్ EV ప్రైమ్ డార్క్ విధంగానే, నెక్సాన్ EV మాక్స్ నలుపు రంగు ఎడిషన్ “మిడ్ؚనైట్ బ్లాక్” ఎక్స్ؚటీరియర్ రంగులో కూడా వస్తుంది. స్వరూప చార్ؚకోల్ బ్లాక్ అలాయ్ వీల్స్, బంపర్ చుట్టూ ముదురు నీలం క్రోమ్ స్ట్రిప్ؚలు, ఫ్రంట్ ఫెండర్ؚలపై “డార్క్” స్టిక్కర్‌లు మరియు నలుపు రంగు ఫినిష్ కలిగిన “నెక్సాన్” బ్యాడ్జ్ ఉండవచ్చు. ఎలక్ట్రిక్ స్వభావాన్ని సూచించడానికి పూర్తిగా నీలం యాక్సెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది.
టీజర్ؚలో వెల్లడించినట్లు క్యాబిన్ లోపల బ్లూ హైؚలైట్ؚలతో పాటు, ఇతర సారూప్యతలలో డ్యాష్‌బోర్డుؚకు నలుపు రంగు ఫినిష్, లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ మరియు లెదర్-చుట్టబడిన స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
నెక్సాన్ EV ప్రైమ్ డార్క్ క్యాబిన్ చిత్రం రిఫరెన్స్ కోసం అందించబడింది
ప్రస్తుత నెక్సాన్ EV మాక్స్ؚను పోలిన ఫీచర్‌లనే ఇందులో ఆశించవచ్చు, దీనిలో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రేర్ వెంట్ؚలతో ఆటో AC, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు ఉన్నాయి. దీని భద్రత ఫీచర్‌లలో మార్పులు ఉండవు మరియు ఇందులో డిస్క్ؚబ్రేక్ؚలు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి.
బ్యాటరీ, పరిధి మరియు ఛార్జింగ్
నెక్సాన్ EV మాక్స్‌కు టాటా 40.5kWh బ్యాటరీ ప్యాక్ؚను అందించింది, ఇది 143PS పవర్ మరియు 250Nm టార్క్‌ను ఎలక్ట్రిక్ మోటార్ؚకు అందిస్తుంది. ARAI-క్లెయిమ్ చేసిన పరిధి 453kmగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు ఛార్జింగ్ ఎంపికలకు మద్దతు ఇస్తుంది: 3.3kW మరియు 7.2kW, వీటి ఛార్జింగ్ సమయాలు వరుసగా 15 గంటలు మరియు ఆరు గంటలుగా ఉన్నాయి. అలాగే, 50kW DC ఫాస్ట్ ఛార్జర్ؚను ఉపయోగించి, బ్యాటరీ కేవలం 50-60 నిమిషాలలో 0-80 శాతం ఛార్జ్ అవుతుంది.
సంబంధించినది: మహీంద్రా XUV400 Vs టాటా నెక్సాన్ EV మాక్స్–వాస్తవ పరిస్థితులలో అత్యధిక పరిధిని అందించే ఎలక్ట్రిక్ SUV ఏది?
వేరియెంట్ؚలు, ధరలు మరియు విడుదల
నెక్సాన్ EV ప్రైమ్ డార్క్ వేరియెంట్‌లను బట్టి, నెక్సాన్ EV మాక్స్ డార్క్ ఎడిషన్ హయ్యర్-స్పెక్ వేరియెంట్ؚలలో మాత్రమే అందించబడుతుంది, ఇది ప్రస్తుత ధరల కంటే అధిక ధరను కలిగి ఉంటుంది. టాటా నెక్సాన్ EV మాక్స్‌ను మరి కొన్ని రోజులలో విడుదల చేయనుంది. మహీంద్రా XUV400 EVతో నెక్సాన్ EV మాక్స్ పోటీ పడుతుంది, ఇది MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ؚకు చవకైన ఎంపికగా నిలుస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ EV మాక్స్ ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful