టాటా టియాగో EV పోటీదారుగా ఏప్రిల్‌లో రాబోతున్న MG కామెట్ విక్రయాలు
ఎంజి కామెట్ ఈవి కోసం tarun ద్వారా మార్చి 14, 2023 12:15 pm ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
MG అందించే కొత్త చవకైన ఎలక్ట్రిక్ కారు 300 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందించగలదు
-
రెండు-డోర్‌ల కామెట్ EV ధరలను MG ఏప్రిల్ చివరిలో ప్రకటించనుంది.
-
బహుళ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో, 300 కిలోమీటర్‌ల మైలేజ్‌ను అందించగలదు.
-
డ్యూయల్ 10.25-అంగుళాల డిస్ప్లే, ఆటో AC మరియు రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్‌లతో వస్తుందని అంచనా.
-
ధరలు సుమారు రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాము.
భారతదేశంలో MG అందించే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్ అమ్మకాలు ఏప్రిల్ నుండి ప్రారంభం కావచ్చు. ఇటీవల ప్రకటించిన మాస్ మార్కెట్ రెండు-డోర్‌ల ఎలక్ట్రిక్ కార్ కామెట్ EV సిట్రోయెన్ eC3, టాటా టియాగో EV వంటి వాటితో పోటీపడనుంది.
MG కామెట్ EV అనేది ముఖ్యంగా ఎయిర్ EV, ఇది ఇండోనేషియాలో MG యొక్క అనుబంధ సంస్థ అయిన వులింగ్ పేరుతో విక్రయించడుతుంది. ఎత్తు విషయంలో, ఇది టాటా నానో కంటే చిన్నదిగా ఉంటుంది కానీ మారుతి ఆల్టో K10 కంటే వెడల్పు, పొడవుగా ఉంటుంది. ఎంట్రీ-లెవెల్ MG EV క్యాబిన్‌లో నలుగురు కూర్చోవచ్చు.
ఇది కూడా చదవండి: MG కామెట్ EV గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
మైక్రో EVలో అనేక ఫీచర్‌లు ఉంటాయని అంచనా, వీటిలో రెండు 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్‌లు (ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ కోసం ఒకటి, డ్రైవర్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం ఒకటి), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమ్యాటిక్ AC, స్టీరింగ్ؚకు అమర్చిన కంట్రోల్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు రేర్-వ్యూ కెమెరా వంటివి ఉంటాయి.
ఇండోనేషియాలో, ఎయిర్ (కామెట్) EVని 17.3kWh మరియు 26.7kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందిస్తున్నారు, ఇవి వరుసగా 200కిమీ మరియు 300కిమీ వరకు పరిధిని అందిస్తాయి. రెండు బ్యాటరీలు వెనుక-వీల్ డ్రైవ్‌కు 40PS ఎలక్ట్రిక్ మోటార్ؚకు పవర్‌ను అందిస్తాయి. కామెట్ EVతో ఈ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందిస్తారని ఆశిస్తున్నాము.
ఇది కూడా చదవండి: భారతదేశంలో రాబోయే ఎలక్ట్రిక్ కార్‌లు
MG కామెట్ EV ధర సుమారుగా రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా, మార్కెట్‌లో అమ్మకాలు మొదలైన తరువాత, దీన్ని ఫ్లీట్/కమర్షియల్ కొనుగోలుదారుల కోసం కూడా అందించవచ్చు.
ఇక్కడ మరింత చదవండి: టాటా టియాగో AMT