• English
  • Login / Register

మీ డోర్స్టీప్ వద్ద టాటా మోటర్స్ సర్వీస్ కార్లు

టాటా నెక్సన్ 2017-2020 కోసం dhruv attri ద్వారా ఏప్రిల్ 18, 2019 12:25 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2019 Tata Hexa Launched; Prices Start At Rs 12.99 Lakh

  • టాటా కార్ల యజమానులు ఇప్పుడు తమ కార్లను తమ ఇంటికి తీసుకెళ్లారు.
  •  టాటా మోటార్స్ వెబ్సైట్ ద్వారా కార్లను ఆన్లైన్ నుండి బుక్ చేసుకోవచ్చు.
  •  మారుతి మరియు హ్యుందాయ్ వంటి ప్రత్యర్థి వాహనాలు కూడా డోర్ స్టెప్ సర్వీసులను అందిస్తున్నాయి.

మీ కారును సరైన ఆకృతిలో ఉంచడానికి సాధారణ నిర్వహణ అవసరం. అయితే, కొందరు వారి కారులను సేవా కేంద్రానికి తీసుకొచ్చే సమయాన్ని కనుగొనడం ఒక ఇంత కష్టం కావచ్చు. కాబట్టి టాటా కేర్ మొబైల్ సర్వీస్ వాన్ అని పిలవబడే కొత్త చొరవను టాటా మోటార్స్ ఇటీవల ప్రవేశపెట్టింది. అంతేకాకుండా శిక్షణ పొందిన మెకానిక్స్, మీ ఇంటి వద్దే సాధారణ సేవలు మరియు చిన్న మరమ్మతులను చేపడతారు. ప్రస్తుతం, ఇది భారతదేశం అంతటా 38 నగరాల్లో 42 స్థానాల్లో అమలులో ఉంది.

టాటా మోటర్స్ యొక్క వెబ్సైట్ను సందర్శించి టాటా కార్ల యజమానులు ఈ సేవను పొందవచ్చు మరియు వారి ఎంపిక చేసుకునే సమయాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. టాటా ప్రత్యర్ధి వాహనాలైన- మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి సంస్థలు కూడా ఇదే డోర్ స్టెప్ కారు సేవలను అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం, టాటా మోటర్స్ నుండి పత్రికా ప్రకటనను తనిఖీ చేయండి.

ప్రెస్ రిలీజ్:

టాటా మోటార్స్ మొబైల్ సర్వీస్ వాన్, మీ ఇంటి వద్దే అనుకూలమైన సేవ పరిష్కారాలను అందిస్తుంది

ముంబై, మార్చ్ 07, 2019 - విక్రయాల తర్వాత సేవా నాణ్యతను అందించడం మరియు వినియోగదారుల సంతృప్తిని పెంపొందించటానికి కట్టుబడి, టాటా మోటర్స్ మొబైల్ సర్వీస్ వాన్స్ (ఎం ఎస్ వి) యొక్క ప్రోగ్రాంను బలపరిచింది. టాటా కేర్ మొబైల్ సర్వీస్ వాన్ (కార్ అసిస్ట్ అండ్ రిపేర్ ఎక్స్పర్ట్) గా పిలవబడుతోంది - ప్రయాణంలో వినియోగదారుల కోసం ఈ సేవ, అనేక నగరాల్లో 42 స్థానాల్లో కంపెనీ అనుకూలమైన సేవ పరిష్కారాలను అందిస్తోంది.

టాటా కేర్ అనేది, టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాలకు కాలానుగుణ సేవలును (షెడ్యూల్ ఉచిత మరియు చెల్లింపు సేవలను) అందించడానికి రూపొందించబడింది. టాటా కేర్ ద్వారా, పలు సేవా వ్యాన్లు వినియోగదారుల అవసరాలను నెరవేర్చడానికి లేదా సమీపంలోని ఉన్న స్టేషన్కు ప్రయాణం చేయలేని వినియోగదారుల కోసం నియమించబడతాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన మెకానిక్స్ బృందం ద్వారా కస్టమర్ యొక్క ఇంటి వద్దే అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి.

2019 టాటా హెక్సా ప్రారంభం; ధర రూ. 12.99 లక్షలు.

సీనియర్ జనరల్ మేనేజర్, హెడ్ కస్టమర్ కేర్ టాటా మోటార్స్ అయిన మిస్టర్ సుభజిత్ రాయ్ టాటా కేర్ గురించి మాట్లాడుతూ .. టాటా కేర్ అనేది భారతదేశం అంతటా వారి ప్రాథమిక అవసరాలకు సౌలభ్యం కల్పించటం, వినియోగదారులకు సులభతరం చేయడమే వారి ముఖ్య ఉద్దేశ్యం. సేవా కేంద్రాలను సందర్శించడానికి విలు లేకపోవడం వల్ల వారి వాహనాలను క్రమంగా సర్వీసు చేయించలేకపోతున్నారో వారి కోసం ఈ విధమైన సేవలు అందిస్తును అందించడమే మా ఆశయం. మా వ్యాపార కేంద్రం వద్ద మా వినియోగదారులని ఉంచడం మరియు వారి వాహనాలను సురక్షితంగా ఉంచడం, మేము వినియోగదారుల కోసం అందిస్తున మా సేవలను మరింత మెరుగుపరచడానికి అలాగే మెరుగుపరచబడిన సేవలను అందజేస్తామన్నారు దీనినే లక్ష్యంగా పెట్టుకున్న టాటా మోటార్స్, విక్రయాల తర్వాత, అనేక సేవలను అందిస్తూ, వినియోగదారుల సమస్యలకు పరిష్కారాలను అందించడమే ధ్యేయమని తెలిపారు.

Tata Harrier SUV: In Pictures

మొబైల్ సర్వీస్ వాన్స్ యొక్క ఫీచర్లు:

టూల్ క్రిబ్ కంప్రైజెస్ సెట్ లో చేతి పరికరాలు, డ్రైవర్లు & స్పానర్లు, సాకెట్లు & బిట్స్ ఉన్నాయి

ఎలక్ట్రికల్ టెస్ట్ పరికరాలు - మల్టీమీటర్, క్లాంప్ మీటర్, హైడెర్ మీటర్ & థర్మామీటర్

సర్వీస్ పరికరాలు - క్రీపర్, జాక్ స్టాండ్, జాక్ & స్టాపర్స్

ఆయిల్ డిస్పెన్సర్స్ & వేస్ట్ ఆయిల్ కలెక్టర్స్

న్యుమాటిక్ టూలింగ్

పవర్ జనరేటర్ / ఇన్వర్టర్

ఎయిర్ కంప్రెషర్

వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో కార్ వాషర్, దీనితో పాటు ఎకో వాష్ కిట్

హెవీ డ్యూటీ వెట్ & డ్రై వాక్యూమ్ క్లీనర్

క్యాంప్ టేబుల్ & కుర్చీలు

టెలిమాటిక్స్ వ్యవస్థ

టాటా మోటర్స్ సర్వీస్ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ సెక్షన్, ఈ సేవలను ప్రారంభించటానికి వీలు కల్పిస్తుంది. డీలర్షిప్లకు రియల్ టైమ్ డేటాను అందించడానికి ట్రాకర్లను అమర్చడంతో, ఈ సర్వీసు చేయబడే వాహనాలు సులువుగా గుర్తించబడతాయి. డీలర్షిప్లు తమ వినియోగదారులకు దగ్గరున్న సేవా వాన్ యొక్క స్థానమును అందిస్తాయి, తద్వారా చింతలేని మరియు అనుకూలమైన అనుభవాన్ని వినియోగదారులు పొందగలుగుతారు. ఎం ఎస్వి లతో పాటు, ఆన్లైన్ బుకింగ్ ద్వారానే- కస్టమర్ యొక్క నివాసం నుండి వాహనాన్ని పికప్ మరియు డ్రాప్ సౌకర్యం అందిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ బహిర్గతం; భారతదేశంలో 2019 మధ్యలో ప్రారంభం

మరింత చదవండి: టాటా నెక్సాన్ ఏఎంటి

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata నెక్సన్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience