ఈ సంవత్సరంలో ప్రారంభం కానున్న మేబ్యాక్ ఎస్ 600 ఇండియా

ఆగష్టు 14, 2015 02:10 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

భారతదేశంలో గత రెండు వారాల వ్యవధిలో, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ ఫ్యామిలీ లో మూడు కొత్త వేరియంట్స్ ని జోడించారు. ఈ కొత్త ఎస్-క్లాస్ ఎడిషన్ రాబోయే వారాల్లో మన ముందుకు రాబోతున్నది. అది మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600. మెర్సిడెస్ మేబ్యాక్ నుండి ఈ ఈ ప్రధాన విలాసవంతమైన సెడాన్ ను 2014 ఎల్ ఎ ఆటో షోలో ఆవిష్కరించారు.

ఈ కారు హోమోలగేషన్ నుండి దిగుమతి చేయబడి 6.0 లీటర్ బైటర్బో వి12 పెట్రోల్ ఇంజన్ తో శక్తి అందించబడి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు 4000 నుండి 5000rpm వద్ద 523hp శక్తిని మరియు 1,900-4,000rpm వద్ద 830Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 5 సెకన్ల లోపే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సాధించగలదు. ఇది నగర పరిధిలలో 5.53kmpl మైలేజ్ ని హైవేలో 8.5kmpl మైలేజ్ ని అందిస్తుంది.

సాధారణ ఎస్ క్లాస్ తో పోలిస్తే , మేబ్యాక్ ఎస్ 600, పొడవులో 207mm పెద్దదిగా మరియు వీల్బేస్ లో 200mm పెద్దదిగా ఉంటుంది. ఈ కారు పొడవు 5,453mm మరియు వీల్బేస్ 3,365mm. దీనిలో సౌలభ్యం లక్షణాలు చాలా అందించబడ్డాయి. మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్600 కూడా ఇటీవల ఎస్63 ఎ ఎంజి సెడాన్ లో చూసిన విధంగా మేజిక్ శరీర కంట్రోల్ సస్పెన్షన్ వ్యవస్థతో అందుబాటులో ఉంది. ఈ కారు విస్తృత స్లయిడింగ్ పైకప్పు, శక్తి ద్వారా పనిచేసే సన్ షేడ్స్, వేడి విండ్షీల్డ్, హెచ్చరిక ప్రదర్శన, ఎల్ ఇడి ఇంటెలిజెంట్ లైటింగ్ సిస్టమ్ మరియు మేజిక్ స్కై కంట్రోల్ సిస్టమ్ వంటి అంశాలను కలిగి ఉంది.

భద్రత పరంగా, ఈ కారు సీట్ బెల్ట్ ఎయిర్బ్యాగ్ మరియు సీట్ కుషన్ ఎయిర్బ్యాగ్స్ తో పాటూ ఫ్రంట్, సైడ్, కర్టెయిన్ మరియు తొరాక్స్ ఎయిర్బ్యాగ్స్ ని ప్రయాణికులకు వెనుక వైపు అందుబాటులో ఉంది. దీనితో పాటూ పెడెస్ట్రెయిన్ రికగ్నిషన్ తో ముందు సేఫ్ బ్రేక్, స్టీరింగ్ అసిస్ట్ తో డిస్ట్రోనిక్ ప్లస్, క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్ తో బిఎ ఎస్ ప్లస్, ఆక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ హై బీం ప్లస్ మరియు నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్ వంటివి అందుబాటులో ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience