• English
  • Login / Register

కొత్త జనరేషన్ కొడియాక్ మరియు సూపర్బ్ ఇంటీరియర్ؚలను ప్రదర్శించిన Skoda

స్కోడా కొడియాక్ 2024 కోసం rohit ద్వారా సెప్టెంబర్ 01, 2023 11:29 am సవరించబడింది

  • 67 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

స్కోడా రెండు మోడల్‌లలో ప్రస్తుతం 13-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందిస్తుంది మరియు గేర్ సెలక్టర్ స్టీరింగ్ వీల్ వెనుక ఉంటుంది

2024 Skoda Kodiaq and Superb

కొడియాక్ మరియు సూపర్బ్‌ను కొత్త-జనరేషన్ లుక్‌లో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా స్కోడా పరిచయం చేయనుంది. తమ ఫ్లాగ్ؚషిప్ SUV మరియు సెడాన్ ఆఫరింగ్ؚల ప్రొడక్షన్-స్పెక్ ఇంటీరియర్‌లను ప్రస్తుతం కారు తయారీదారు వెల్లడించారు. ఈ రెండు మోడల్‌లలో మార్పులను ఇప్పుడు నిశితంగా చూద్దాం.

ప్రీమియర్ లుక్ 

2024 Skoda Kodiaq cabin
2024 Skoda Superb cabin

2024 స్కోడా కొడియాక్ మరియు సూపర్బ్ రెండిటిలో దాదాపుగా-ఒకే విధమైన క్యాబిన్ థీమ్‌తో (బ్లాక్ మరియు టాన్) అందిస్తున్నారు, అయితే వీటిలో భిన్నంగా కనిపించేది డ్యాష్‌బోర్డ్ డిజైన్ మరియు సెంటర్ కన్సోల్. ఈ సెడాన్ సన్నని సెంటర్ AC వెంట్ؚలు మరియు ప్రయాణీకుల వైపు స్లాట్‌లు కలిగిన నాజూకైన లేఅవుట్ؚను కలిగి ఉంటుంది, ఈ SUV మందమైన మరియు నిటారైన డిజైన్ؚతో వస్తుంది.

మధ్యలో ఉండే డ్యాష్ؚబోర్డ్ పై భారీ 13-అంగుళాల ఫ్రీ-ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ ఈ రెండు మోడల్‌లలో ఉన్న ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు, అంతేకాకుండా అప్ؚహోల్ؚస్ట్రీ 100 శాతం పాలియెస్టర్ؚతో తయారు చేయబడింది. రెండు మోడల్‌లలో సెంటర్ కన్సోల్ؚలో ప్రస్తుతం ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ డ్రైవ్ సెలెక్టర్ లేదు (ఇది ప్రస్తుతం స్టీరింగ్ వీల్ వెనుక మరియు స్టీరింగ్ కాలమ్ పై ఉంది), అందువలన ఎక్కువ స్టోరేజ్ స్థలం ఉంటుంది. 

2024 Skoda Kodiaq climate controls
2024 Skoda Superb climate controls

మరొక ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే, రెండు మోడల్‌లు ఫిజికల్ నాబ్ؚలు మరియు బటన్ؚలతో వస్తాయి. రెండు ఔటర్ రోటరీ డయల్స్ AC టెంపరేచర్ ఫంక్షన్ؚలను, అలాగే సీట్ హీటింగ్ మరియు వెంటిలేషన్ కూడా నిర్వహిస్తాయి. సెంట్రల్ డయల్ؚను ఫ్యాన్ స్పీడ్, ఎయిర్ డైరెక్షన్, స్మార్ట్ ఎయిర్ కండిషనింగ్, డ్రైవ్ మోడ్ؚలు, మ్యాప్ జూమ్, మరియు ఇన్ఫోటైన్ؚమెంట్ వాల్యూమ్ కోసం నియంత్రణగా అనుకూలీకరించవచ్చు.

ఇది కూడా చదవండి: రూ. 20 లక్షలలో అందుబాటులో ఉన్న 5 ప్రీమియం సెడాన్ؚలు

ఈ మాడెల్‌లలో ఉన్న ఇతర ఫీచర్‌లు

ఈ రెండు కొత్త జనరేషన్ స్కోడా మోడల్‌లలో 10-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్డ్ ఫ్రంట్ సీట్ؚలు, ఆంబియెంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ؚతో అందిస్తున్నారు. రెండు కార్‌ల డ్రైవర్ సీట్లు, న్యుమాటిక్ మసాజ్ ఫంక్షన్ؚతో వస్తాయి.

బహుళ ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు అనేక అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలు (ADAS) ప్రయాణీకుల భద్రతకు హామీ ఇస్తాయి.

ఈ రెండిటికి శక్తిని అందించేది ఏది?

కొత్త కొడియాక్ మరియు సూపర్బ్ రెండూ వాటి అంతర్జాతీయ-స్పెక్ లుక్‌లో, అనేక ఇంజన్-గేర్ బాక్స్ కలయికలతో వస్తాయి. ఇంతకు ముందు ధృవీకరించిన ఎంపికలను ఇప్పుడు చూద్దాం: 

2024 Skoda Kodiaq

స్పెసిఫికేషన్ 

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్  

2-లీటర్ టర్బో-పెట్రోల్ 

2-లీటర్ డీజిల్ 

2-లీటర్ డీజిల్ 

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్  

పవర్

150PS

204PS

150PS

193PS

204PS

ట్రాన్స్ؚమిషన్

7-స్పీడ్ DSG

7-స్పీడ్ DSG

7-స్పీడ్ DSG

7-స్పీడ్ DSG

6-స్పీడ్ DSG

డ్రైవ్ؚట్రెయిన్

FWD

AWD

FWD

AWD

FWD

గ్లోబల్-స్పెక్ సూపర్బ్ కూడా కొడియాక్‌లో అందించే పవర్‌ట్రెయిన్ؚల సెట్ؚను పొందుతుంది. ఈ సెడాన్ 2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 256PS గల అత్యధిక పవర్‌ను అందించే మోడల్‌లో కూడా లభిస్తుంది, ఆల్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ؚను కలిగి ఉంటుంది (AWD). 

రెండిటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వర్షన్ؚؚలు 25.7kWh బ్యాటరీ ప్యాక్ؚను పొందాయి, ఇవి ఎలక్ట్రిక్ పవర్‌పై 100కిమీ వరకు ప్రయాణించే వీలు కల్పిస్తాయి, అలాగే 50kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ؚకు కూడా మద్దతు ఇస్తాయి. అయితే, స్కోడా ఇండియా డీజిల్ పవర్‌ట్రెయిన్ؚలను నిలిపివేసే ప్రణాళికలను కలిగి ఉంది, అందువలన ఇండియా-స్పెక్ కొత్త-జెన్ కొడియాక్ మరియు సూపర్బ్ కూడా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ؚను కాకుండా కేవలం టర్బో-పెట్రోల్ ఎంపికలలో మాత్రమే అందిస్తారని ఆశించవచ్చు. 

ఇది కూడా చదవండి: భారత్ కొత్త కార్ విశ్లేషణ కార్యక్రమం వచ్చేసింది!

భారతదేశంలో విడుదల మరియు ధర 

2024 Skoda Superb

తమ ఫ్లాగ్ షిప్ SUV-సెడాన్ జంటను స్కోడా ఇంపోర్ట్ؚలుగా మన దేశానికి వచ్చే సంవత్సరం తీసుకువస్తుందని ఆశిస్తున్నాము. కొడియాక్ మరియు సూపర్బ్ రెండూ మోడల్‌లు రూ. 40 లక్షలు (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ప్రారంభ ధరను కలిగి ఉంటాయని అంచనా. జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, మరియు MG గ్లోస్టర్ؚలతో స్కోడా కొడియాక్ తన పోటీని కొనసాగిస్తుంది, అలాగే సెడాన్, టయోటా కామ్రికు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. 

ఇక్కడ మరింత చదవండి: కొడియాక్ ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Skoda కొడియాక్ 2024

Read Full News

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience