పొల్యూషన్ చెక్ క్యాంప్ తో "ప్రపంచ పర్యావరణ దినోత్సవం" జరుపుకోబోతున్న స్కోడా ఇండియా

జూన్ 03, 2015 12:18 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూఢిల్లీ: భారతదేశంలో స్కోడా 'ఉచిత పొల్యూషన్ చెక్ అప్' ను భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) సహకారంతో జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు.

ఉచిత పొల్యూషన్ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా పర్యావరణ సమతుల్యత పై ప్రజలకు అవగాహన కలిగించేలా బోధించే అంశం అని స్కోడా ఆటో ఇండియా  ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. పర్యావరణ రక్షణ పట్ల ప్రచారం చేసే అంశం లో స్కోడా ఆటో ఎల్లప్పుడు ముందు ఉంటుంది. స్కోడా కంపనీ ప్రొడక్ట్ లు అన్ని పర్యావరణాన్ని కలుషితం చేసే విధంగా కాకుండా పునర్వినియోగపరచదగిన మెటీరియల్స్ తో పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తులను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఎల్లప్పుడూ ఖచ్చితమైన కట్టుబాట్లను అనుసరిస్తూ తయారు చేస్తారు. ఇంకా స్కోడా కార్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన స్థిరత్వంగల ప్రమాణాలను కలిగి ప్రజలకు ఆధునిక ఉత్పత్తి సౌకర్యాలు కలిగిన వాహనాలను అందజేస్తుంది.

పొల్యూషన్ చెక్ అనేది మన వాహన పరికరాల ఇంజిన్ శుభ్రం చేయడానికి మరియు వాటి భాగాల పనితీరు తనిఖీ చేయడం ద్వారా మన వాహనానికి ఆమోదయోగ్యమైన నమ్మకం చేకూరుతుంది. ఆ కంపనీ కి చెందిన వాహన వినియోగదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన రోజే అధీకృత డీలర్ల వద్ద వారి కారు యొక్క పొల్యూషన్ చెకింగ్ చేయించవచ్చు.

సేల్స్ ప్రచారం తర్వాత, స్కోడా ఆటో ఇండియా హెడ్ అజయ్ షిండే వ్యాఖ్యానిస్తూ, స్కోడా ఇండియా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది అటువంటి  మా కంపనీ, ఎస్ఐఎఎం (సొసైటీ ఆఫ్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్) తో భాగస్వామ్యం తీసుకోవడం గర్వంగా ఉంది", అన్నారు. మా వినియోగదారుల యొక్క సంరక్షణ మాకు ముఖ్యం అందుకే మేము వారి పట్ల పర్యావరణ సంబంధమయిన జాగ్రత్తలు తీసుకుంటాము అని ఆయన చెప్పారు. ఈ ప్రచారం వలన మేము పర్యావరణము పట్ల ఎంత నిబద్ధతగా వ్యవహరిస్తున్నామో, దానిని కాపాడటానికి మరియు నిలకడగా ఉంచడానికి ఎంత కృషి చేస్తున్నామో  తెలుస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience