• English
  • Login / Register

వాట్ ఎ జూన్ ఆఫర్ అంటూ మన ముందుకు రాబోతున్న స్కోడా ఇండియా ర్యాపిడ్

స్కోడా రాపిడ్ కోసం sourabh ద్వారా జూన్ 08, 2015 05:13 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: స్కోడా ఇండియా ఇప్పుడు జూన్ లో, ఆకర్షణీయమైన ఆఫర్లతో రాబోతుంది. జూన్ లో రాబోయే ఆఫర్ ఏమిటంటే, స్కోడా సంస్థ వారు ఉచిత బీమా పధకాన్ని, ఉచిత రోడ్సైడ్ సహాయం, ఉచిత ఎక్స్టెండెడ్ వారెంటీ మరియు తక్కువ వడ్డి రేటు అంటే, 7.99%. ఈ ఆఫర్, రాపిడ్ లో ఉన్న అన్ని వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది మరియు ఈ ఆఫర్ సూచించిన విధంగా 30 వ జూన్, 2015 వరకు చెల్లుబాటౌతుంది.

ఈ స్కోడా రాపిడ్ సెలూన్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ షేడ్స్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ముందు ఫాగ్ ల్యాంప్స్ , క్లైమేట్రోనిక్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, క్రూయిజ్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, పార్క్ట్రోనిక్స్, న్యూ 7-స్పీడ్ ఆటోమేటిక్ డిఎస్జి (డీజిల్ గేర్బాక్స్, పోర్టబుల్ నావిగేషన్ పరికరం మరియు ఆల్కంటరా లెధర్ సీట్లు వంటి అద్భుతమైన లక్షణాలతో వస్తుంది.  

హుడ్ క్రింది భాగానికి వస్తే, ఇది ఒక కొత్త రకమైన డీజిల్ ఇంజెన్ తో వస్తుంది. ఈ డీజిల్ ఇంజెన్ 1.5 లీటర్ టిడీఇ టర్బో మిల్లు తో వస్తుంది. ఈ ఇంజెన్ లు అత్యధికంగా 103bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా టార్క్ విషయానికి వస్తే, ఈ ఇంజెన్ లు అత్యధికంగా 250Nm గల టార్క్ ను విడుదల చేస్తాయి. ఇంధన సామర్ధ్యం విషయంలో ఈ డీజిల్ ఇంజెన్ లు మాన్యువల్ వేరియంట్లలో 21.14 kmpl మైలేజ్ ను అందిస్తాయి. ఈ స్కోడా రాపిడ్ యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్ 1.6 లీటర్ ఎంపి ఐ పెట్రోల్ ఇంజెన్ తో వస్తాయి. ఈ ఇంజెన్ అత్యధికంగా 103bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, అత్యధికంగా 153Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజెన్ మాన్యువల్ వేరియంట్ లో 15kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్ లో 14.3kmpl మైలేజ్ ను ఇస్తుంది.      

ఇటీవల స్కోడా, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) సహకారంతో దేశంలో ఉచిత పొల్యూషన్ చెక్ అప్ ను 'నిర్వహించారు.

was this article helpful ?

Write your Comment on Skoda రాపిడ్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience