• English
  • Login / Register

షెల్బి లో 750బిహెచ్పి పవర్ ను విడుదల చేసే ముస్తాంగ్ సూపర్ స్నేక్ కార్ బహిర్గతం

ఫోర్డ్ ముస్తాంగ్ 2016-2020 కోసం raunak ద్వారా జూన్ 17, 2015 05:22 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2015 ముస్టాంగ్ జిటి ఆధారంగా తయారుచేబడిన ఈ ముస్తాంగ్ సూపర్ స్నేక్ కారు, డాడ్జ్ ఛాలెంజర్ హెల్కట్ కు గట్టి పోటీను ఇవ్వబోతుంది. 

జైపూర్: అమెరికాకు చెందిన షెల్బి ముస్తాంగ్ యొక్క 750 బిహెచ్ పి పవర్ ను విడుదల చేసే అగ్ర శ్రేణి వేరియంట్ అయిన సూపర్ స్నేక్ బహిర్గతం అయ్యింది. ఇది ముస్తాంగ్ యొక్క ఆరవ తరం కారు. ఈ కారును 2015 ముస్టాంగ్ జిటి ఫాస్ట్బేక్ ఆధారంగా తయారుచేశారు. అంతేకాక, ఇది  6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే కాకుండా ఈ సూపర్ స్నేక్ మొదటి సారిగా ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉంండబోతుంది. ఈ 2015 షెల్బి సూపర్ స్నేక్స్ ల ఉత్పత్తి 300 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దీని యొక్క ధర (బేస్ ముస్టాంగ్ ఘ్ట్ ఖర్చు మినహాయించి) $ 49,995 వద్ద మొదలవుతుంది.

"ఈ కొత్త సూపర్ స్నేక్ కారు ఉత్తమం, ఎందుకంటే అన్ని-కొత్త ఫోర్డ్ ముస్తాంగ్ కార్ల కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక"-జో కాన్వే అన్నారు

షెల్బి అమెరికన్ సిఈఓ మరియు కెరోల్ షెల్బి ఇంటర్నేషనల్ కో సిఈఓ అయిన జో కాన్వే మాట్లాడుతూ "షెల్బి అమెరికన్ 2007 లో 605 హార్స్పవర్ కలిగిన సూపర్ స్నేక్ ను పరిచయం చేసినప్పుడు, ఆ కారు ఒక తక్షణ సంచలనంగా మారింది" అని వ్యాఖ్యానించారు.

"ఫోర్డ్ ప్రదర్శన వద్ద మా భాగస్వాములు, వెల్డ్ రేసింగ్, మిచెలిన్, డిజైన్ మరియు విప్ల్సే మరియు కెన్నే బెల్ సూపర్ఛార్జర్ ద్వారా కార్బన్ తో కలిసి పనిచేయడం ద్వారా, 2015 షెల్బి సూపర్ స్నేక్ ప్రపంచ స్థాయి ప్రదర్శన లో ఒక అద్భుతమైన కారు" అని ఆయన మరింత జోడించి అన్నారు.

ఈ వాహనం, ముస్టాంగ్ జిటి లో ఉండే 5-లీటర్ వి8 ఇంజెన్ తో రాబోతుంది మరియు ఈ ఇంజెన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా మాన్యువల్ తో రాబోతుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ అత్యధికంగా 650bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. మరింత పవర్ ను ఉత్పత్తి చేయాలి అనుకుంటే, ఈ వాహనంలో మరింత శక్తివంతమైన సూపర్చార్జర్, మెరుగైన ఇంటర్ కూలర్ మరియు హీట్ ఎక్స్చేంజర్ వ్యవస్థ వంటి వాటిని ప్రవేశపెట్టడం ద్వారా 750 bhp ఉత్పత్తి చేసేలా చేయవచ్చు. వీటితో పాటు, షెల్బి లో ఫోర్డ్ పెర్ఫార్మెన్స్ సస్పెన్షన్ భాగాలు,  త్రోటీ బోర్లా ఎగ్జాస్ట్, వెల్డ్ రేసింగ్ సూపర్ స్నేక్ 20 " అల్లాయ్స్ ను, మిచెలిన్ పైలట్ సూపర్ స్పోర్ట్ టైర్లు మరియు 6-పిస్టన్ విల్వుడ్ బ్రేక్లతో రాబోతుంది. అంతేకాక, దీని యొక్క అంతర్గత భాగాలు కూడా స్టాక్ ముస్టాంగ్ జిటి తో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా నవీకరణ చేసినట్లుగా కనిపిస్తాయి.   

హెన్రీ ఫోర్డ్ III - "షెల్బి అమెరికన్ మరియు ఫోర్డ్ టీం సంస్థ వారు కలిసి ఈ అద్భుతమైన ముస్తాంగ్ ను అధిక పనితీరు సామర్థ్యాలను కలిగిన కారు గా రాబోతుంది అని అన్నారు. 

ఫోర్డ్ పెర్ఫోమెన్స్ మార్కెటింగ్ మేనేజర్ అయిన హెన్రీ ఫోర్డ్ ఈఈఈ మాట్లాడుతూ, ఫోర్డ్ రేసింగ్ మరియు షెల్బి కలిసి ఎప్పుడూ రానటువంటి మరియు చూడనటువంటి ముస్టాంగ్ ఉత్పత్తులను తీసుకు రావాలి అని హెన్రీ పేర్కొన్నారు. ఈ షెల్బి సూపర్ స్నేక్ అనేది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు, ఎలా అంటే ఔత్సాహికులు కోరిన విధంగా ఈ కారు అబివృద్ది చేయబడినది.  

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Ford ముస్తాంగ్ 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience