• English
  • Login / Register

హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్ మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటితో పోటీ పడుతున్న ఎస్ - క్రాస్

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 06, 2015 10:57 am ప్రచురించబడింది

  • 13 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మారుతి చివరకు ఎస్-క్రాస్ ని 8.34 లక్షలు ప్రారంభ ధర నుండి 13.74 లక్షలు వరకూ ఎక్స్ షోరూమ్ ఢిల్లీలో ప్రారంభించింది. ఇది హ్యుందాయ్ క్రెటా మరియు రెనాల్ట్ డస్టర్ వంటి వాటితో పోటీ పడుతున్నది. కానీ ఎస్-క్రాస్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కంటే ధర ఎక్కువగా ఉన్నది. ధర పక్కన పెట్టి మిగిలిన అంశాలను పరిగణలోనికి తీసుకొని ఎస్-క్రాస్ ఎలా ఇతర వాటితో పోటీ పడుతుందో చూద్దాం. 

పరిమాణం! 

 సైజ్ గురించి మాట్లాడుకుంటే, ఎస్- క్రాస్ అద్భుతమమైన పరిమాణం కలిగి ఉంది. ఈ కారు క్రెటా కంటే 30mm పెద్దది మరియు డస్టర్ కంటే 15mm చిన్నది. ఎకోస్పోర్ట్ పరిమాణం 4 మీటర్ల కంటే తక్కువ. ఇది పక్కన పెట్టి వీల్బేస్ గురించి మాట్లాడుకుంటే, ఎకోస్పోర్ట్ మరియు క్రెటా కంటే ఎస్-క్రాస్ వీల్బేస్ ఎక్కువ. అందువలనే దీనిలో క్యాబిన్ స్పేస్ పుష్కలంగా ఉంటుంది.

 క్రింది వైపు ఎస్-క్రాస్ కి పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ దానికి క్రెటా, ఎకోస్పోర్ట్ మరియు డస్టర్ వలే ఆకర్షణీయమైన లుక్ లేదు. 

పరికరాలు

ఎస్-క్రాస్ టచ్స్క్రీన్ మల్టీమీడియా మరియు నావిగేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్, స్టీరింగ్ నియంత్రణలు, లెదర్ సీట్లు అన్ని నలుపు అంతర్భాగాలు మరియు క్రూజ్ నియంత్రణ వంటి లక్షణాలు పుష్కలంగా అందించబడినవి. బయటి వైపు ఇది డి ఆర్ ఎల్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ ని ప్రామాణిక లక్షణంగా కలిగి ఉంది. 

ఇంజిన్

హుడ్ క్రింద, ఇది 120 శక్తి ps మరియు 320Nm టార్క్ ని ఉత్తమంగా అందించే 1.6 లీటర్ డి డి ఐ ఎస్320 ఇంజిన్ తో అమర్చబడి ఉంది. అంతేకాకుండా ది నిరాడంబరమైన ధర వేరియంట్లలో 1.3 డి డి ఐఎస్200 ఇంజిన్ ని కలిగి ఉంది. దీనిలో పెట్రోల్ ఇంజిన్ లేదు. 

ఇతర వాటితో పోలిస్తే, డస్టర్ 210mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఎడబ్లు డి ఎంపికను తో ఆఫ్- రోడింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. క్రెటా 17 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ తో అందుబాటులో ఉంది. ఎకోస్పోర్ట్ అంతర్భాగాలలో అనేక లక్షణాలను కలిగి ఉంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఎస్-క్రాస్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience