అమ్మకాల సంఖ్యలు వెల్లడి: హోండా అమేజ్, కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు కలిగిన కారు!

అక్టోబర్ 05, 2015 06:14 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

సెప్టెంబర్ మాసానికి గల అమ్మకాలను హోండా వారు వెల్లడించారు. హోండా కార్ ఇండియా లిమిటెడ్ (HCIL) యొక్క అమ్మకాలు ఎగుమతులతో కలిపి 19,291 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాదిలో ఇదే నెలతో పోలిస్తే, అమ్మకాలు 15,395 యూనిట్లుగా ఉన్నాయి.

భారతదేశంలో, హోండా వారు సెప్టెంబరు లో అమ్మకాలను 23% పెంచుతూ 18,509 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబరు లో 380 యూనిట్ల ఉండగా, ఈ ఏడాది 782 యూనిట్ల ఎగుమతి అమ్మకాలు నమోదు అయ్యి పోల్చగా ఇది 782 యూనిట్లుగా ఉంది.

భారతదేశానికి హోండా వారి సమర్పణల్లో, అమేజ్, సిటీ, జాజ్, CR-V మరియూ మొబిలియో MPV లు వరుసలో ఉన్నాయి. అనంటికంటే పైన 6,577 యూనిట్ల అమ్మకాలతో అమేజ్ మొదటి స్థానంలో ఉంది. తరువాత 5,702 యూనిట్లతో సిటీ ద్వితీయ స్థానంలో ఉంది. తరువాత 4,762 యూనిట్లతో జాజ్ ఉంది. మిగతావి 759 యూనిట్లతో బ్రయో, 643 యూనిట్లతో మొబిలియో మరియూ 66 యూనిట్లతో CR-V వరుసలో ఉన్నాయి.

ఏటా, కంపెనీ వారు 240,000 యూనిట్లను వారి నొయిడా మరియూ తపుకర సముదాయాలలో తయారు చేస్తారు. హోండా వారి తరువాతి సమర్పణ, BR-V, 7 సీటర్లు కలిగి హోండా బ్రయో ఆధారితంగా ఎస్యూవీ గా రాబోతుంది. ఈ వాహనం భారతీయ వీధుల్లోకి 2016 లో వస్తుంది మరియూ నిస్సాన్ టెర్రానో ఇంకా రెనాల్ట్ డస్టర్ తో పోటీ పడుతుంది. BR-V ఈ ఏడాది ఆగస్టులో ఇండొనేషియా మోటరు షోలో అధికారికంగా బహిర్గతం అయ్యింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience