మూడు ప్రత్యేక వేరియంట్లలో చివరి వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై మ్యూజిక్' ని ప్రారంభించిన రోల్స్ రాయిస్

published on ఆగష్టు 10, 2015 02:25 pm by nabeel

  • 12 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రోల్స్ రాయిస్ వ్రైత్ 2013 లో ఆరంభమయినప్పటి నుండి ఒక వైకల్పిక అదనపు బీస్పోక్ ఆడియో సిస్టమ్ కలిగి ఉంది. కానీ తమ చివరి మరియు సరికొత్త మోడల్ కారు 1300డబ్ల్యు, 18 ఛానల్ బీస్పోక్ సౌండ్ సిస్టమ్ ని కలిగి ఉంది. దీనిని సంస్థ "అత్యంత ప్రత్యేక సంగీత వేదిక" అని పేర్కొంది. వ్రైత్ ' ఇన్స్పైర్డ్ బైఫిల్మ్' మరియు 'ఇన్స్పైర్డ్ బైఫ్యాషన్' తరువాత రోల్స్ రాయిస్ వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై మ్యూజిక్' ని ప్రారంభించింది. ఇది 1300డబ్ల్యు, 18 ఛానల్ బీస్పోక్ సౌండ్ సిస్టమ్ ని రెండు బాస్ స్పీకర్లు, ఏడు ట్విట్టర్లను, ఏడు మధ్యస్థాయి స్పీకర్లు మరియు రెండు ఎక్సైటర్ స్పీకర్లుతో పాటుగా ఆప్ష్నల్ గా ప్రామాణిక నమూనా లో అందుబాటులో ఉంది. ఈ ఎక్సైటర్ స్పీకర్లు ప్రత్యక్ష సంగీత అనుభవాన్ని మెరుగుపరచడానికి కారు హెడ్ లైనింగ్ లోనికి బిగించబడి ఉంది. దీనిని అభివృద్ధి పరిచేందుకు రెండు సంవత్సరాలు పట్టిందని రోల్స్ రాయిస్ తెలిపారు. ఈ ఆడియో సిస్టమ్ కాబిన్ చుట్టూ మైక్రోఫోన్లు కలిగి ఉంది. మానిటర్ వెలుపల శబ్దం మరియు వాల్యూమ్ అమర్పుల సర్దుబాటును తదనుగుణంగా కలిగి ఉంది. 

లుక్స్ విషయానికి వస్తే, వ్రైత్ కారు ముదురు రాగి థీమ్ ని అన్ని వైపులా మరియు లోపలి భాగంలో డోర్ మరియు ఫ్లోర్ మాట్స్ కొత్త లెదర్ ఫినిషింగ్ ని కలిగి ఉన్నాయి. దీనిలో స్పీకర్ గ్రిల్స్ 'బిస్పోక్ ఆడియో' తో పాటు లైట్ కాపర్ థీమ్ ని కలిగి ఉంటుంది. ఈ కారు ఇప్పటికీ అదే 6.6-లీటర్ల వి12 ఇంజిన్ ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జత చేయబడి 624bhp శక్తిని అందిస్తుంది. 

ఈ వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై మ్యూజిక్' కనీసం 6.5 కోట్ల ధరను కలిగి ఉండవచ్చని అంచనా మరియు భారతదేశం లో అందుబాటులో ఉంది. మూడిటిలో మొదటిదైన వ్రైత్ ' ఇన్స్పైర్డ్ బైఫిల్మ్' 2015 న్యూ యార్క్ ఆటో షోలో ఏప్రిల్ 1, 2015 న ఆవిష్కరించబడినది. ఈ కారు బిఎఫ్ ఐ (బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) నేషనల్ ఆర్కైవ్ లోకి చేరిన ‘అండ్ ద వరల్డ్ స్టుడ్ స్టిల్' అనే చిత్రం ద్వారా ప్రేరణ పొంది ప్రారంభించబడినది. ఈ మూడిటిలో రెండవది వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై ఫ్యాషన్' మే 2015 లో ప్రారంభించబడినది. ఇది అండాలుసియన్ వైట్ యొక్క టూ- టోన్ రంగు పధకంతో మరియు ఆర్కిటిక్ వైట్ మరియు జాస్మిన్, వ్యక్తీకరించిన పర్పుల్ లేదా ముగెల్లో రెడ్ వంటి ఎంపికలలో అందించబడుతున్నది. 

 వ్రైత్ 'ఇన్స్పైర్డ్ బై మ్యూజిక్' ఇమేజ్ గ్యాలరీ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

trendingకార్లు

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience