రెనాల్ట్ వారి హెచ్‌హెచ్ఏ ప్రీమియం ఎస్‌యూవీ యొక్క వివరాలు బయటపడ్డాయి
అక్టోబర్ 15, 2015 10:27 am manish ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- 3 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
రెనాల్ట్ క్విడ్ మరియూ రెనాల్ట్ డస్టర్ యొక్క విజయం తరువాత, వీరు కొత్త రకం యుటిలిటీ వాహనంతో భారతదేశంలో అడుగు పెడుతున్నారు. దాదాపు 2020 కి 6 కార్లు రానున్నాయి. మొట్టమొదటగా ఈ వరుసలో వచ్చేది HHA అనే కోడ్ పేరిట ఒక ప్రీమియం ఎస్‌యూవీ రానుంది. ఇది 2017 అక్టోబరులో రానుంది. రనాల్ట్ వారి విజయవంతమైన క్యాప్చర్ వాహనం వేదికగా ఇది రానుంది. తరువాత ఒక ఎంపీవీ ఇంకా మరొక ఎస్‌యూవీ ని ప్రవేశపెట్టనుంది. ఇవి తరువాతి తరం రెనాల్ట్ డస్టర్ ని 2018 లో విడుదల చేసే లోపే రానున్నాయి.
ఈ వాహనం రెనాల్ట్ క్యాప్చర్ మిని స్పోర్ట్స్ యూటిలిటీ వాహనం ఆధారంగా నిర్మించబడుతుంది. ఈ కారు లోగన్ M0-B వేదికన ఉండి మరియూ కంపెనీ యొక్క యురోపియన్ స్టైలింగ్ ని కలిగి ఉంటుంది. కారు సెవెన్ సీటర్ మరియూ మహింద్రా ఎక్స్‌యూవీ500 ఇంకా టాటా సఫారీ స్టార్మ్ వంటి వాహనాలకు ధీటుగా నిలువనుంది.
తాజా నివేదికల ఆధారంగా ప్రజలు ఎక్కువగా ఎస్‌యూవీ లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. మారుతి ఎస్-క్రాస్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ పునరుద్దరణ ఇంకా హ్యుండై క్రేటా వంటి ఎన్నో కార్లు ఈ సెగ్‌మెంట్ లో విడుదల అయ్యాయి.
ఇంత పెద్ద డిమాండ్ వలన, లక్షణాల పరంగా మరియూ ధర పరంగా ఈ రెనాల్ట్ వారి ప్రీమియం ఎస్‌యూవీ ఏ విధంగా రాణించనుందో చూడాలి.