రెనాల్ట్ క్విడ్ Vs ప్రత్యర్ధులు - అద్భుతాలు & లోపాలు
ఏప్రిల్ 23, 2019 11:46 am raunak ద్వారా ప్ర చురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెనాల్ట్ క్విడ్ ఎక్కువగా ఆకట్టుకునేటట్టు ఉన్నా కూడా, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి!
రెనాల్ట్ క్విడ్ అనేది ఈ A- సెగ్మెంట్ లో దాని తెలివైన ప్యాకేజీతో పునరుద్ధరించబడింది అని చెప్పవచ్చు. ప్రారంభించినప్పటి నుండి, రెనాల్ట్ యొక్క ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ ని ఎప్పటి నుండో ఆ విభాగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకి ఆల్టో కి గట్టి పోటీ ని ఇస్తూ మరియు ఆ విభాగాన్నే శాసించదగ్గ లక్షణాలను ఉదాహరణకు ఒక విశాలమైన క్యాబిన్ మరియు ఒక క్రాస్ఓవర్-వంటి రూపాన్ని కలిగి ఉంది. ఇంత మంచి పరికరాలు జాబితా ఉన్నప్పటికీ, వినయపూర్వకమైన రెనాల్ట్ కొన్ని అవసరాలను కూడా కోల్పోతుంది. ఇక్కడ ఎక్కడ అయితే రెనాల్ట్ క్విడ్ ఉత్తీర్ణత చెందిందో మరియు ఎక్కడ అయితే దాని యొక్క ప్రత్యర్థులైన మారుతి సుజుకి ఆల్టో 800 మరియు ఆల్టో K10 తో పోల్చితే పోటీ పడలేక డీలా పడిందో చూద్దాము.
అద్భుతాలు
రెనాల్ట్ మీడియానావ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్:
దాని 7-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్ తో, రెనాల్ట్ క్విడ్ దాని యొక్క ఆల్టో తోబుట్టువుల కార్ల తో పోలిస్తే ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే ముందుకు దూసుకెళుతుందని చెప్పాలి. రెనాల్ట్ యొక్క మీడియా నావ్ వ్యవస్థ బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ కనెక్టివిటీ వంటి చాలా ఎంపికలు తో పాటు బిల్ట్-ఇన్ నావిగేషన్ తో కూడా వస్తుంది. టచ్‌స్క్రీన్ లను మర్చిపోండి, ఆల్టో కవలలు కనీసం మీ స్మార్ట్ఫోన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీని కూడా అందించవు.
రెనాల్ట్ ఈజీ - R AMT:
అవును, ఆల్టో K10 కూడా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT) తో అందించబడుతుంది. కానీ మారుతి పై ఫ్లోర్-మౌంటెడ్ యూనిట్ కాకుండా, రెనాల్ట్ క్విడ్ చాలా అనుకూలమైన డయల్ లాంటి సెటప్ ని కలిగి ఉంది, ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఇది రివర్స్, న్యూట్రల్ మరియు డ్రైవ్ ఎంపికలతో కలిగిన నాబ్ తోవస్తుంది, ఈ నాబ్ ని ట్విస్ట్ చేసుకుని మీరు సులభంగా వెళిపోవచ్చు. ఆల్టో AMT స్టిక్ షిఫ్ట్ తో వస్తుంది, అంటే మీరు గేర్లు మార్చవచ్చు. ఇది త్వరగా ఓవర్ టేక్ చేయాలన్నా లేదా మీరు మాన్యువల్ బాగా ఇష్టపడి డ్రైవ్ చేయాలనుకున్నా ఇది ఉపయోగపడుతుంది.
.300-లీటర్ల బూట్ స్పేస్: రెనాల్ట్ క్విడ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఆల్టో తోబుట్టువుల (ఒకేలా 177-లీటర్ల) సామర్థ్యాన్ని అధిగమించడమే కాకుండా, అది 300 కిలోల లీటరు బూట్ స్పేస్ తో ఆల్టో నే కాకుండా రెండు సెగ్మెంట్ల పైన ఉన్న కార్ల కంటే మంచి బూట్ సామర్ధ్యాన్ని అందిస్తుంది. వెనుక సీట్లని గనుక ఫోల్డ్ చేస్తే నిల్వ స్థలాన్ని 1115-లీటర్ల వరకూ విస్తరించవచ్చు!
ఫ్రంట్ సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లు & లోడ్ లిమిటర్స్:
ఇక్కడ అన్ని మూడు కార్లు డ్రైవర్ ఎయిర్బ్యాగ్ ని అందిస్తున్నప్పటికీ, రెనాల్ట్ ఒక అడుగు ముందుకు వేసి ప్రీ టెన్ష్నర్స్ తో ఫ్రంట్ సీట్‌బెల్ట్స్ మరియు లోడ్ లిమిటర్స్ ని అందిస్తుంది. ఇది ఘర్షణ సందర్భంలో గాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ప్రీమియం లక్షణాలు : రెనాల్ట్ క్విడ్ మొత్తం డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని పొందుతుంది, ఇది చదవడానికి చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా, డ్రైవర్ ఎయిర్బాగ్-ఎక్వైపెడ్ స్టీరింగ్ వీల్ మరింత ప్రీమియం అనుభూతి కోసం పాక్షిక లెథర్ తో పాటు అదనపు సౌలభ్యం కోసం ఒక టచ్ లేన్ ఇండికేటర్ కూడా అందించబడుతుంది.
లోపాలు
టాకోమీటర్ లేదు: క్విడ్ ఒక ఫాన్సీ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉండగా, అది స్పీడ్ ని డిస్ప్లే చేయడం మాత్రమే కాకుండా డ్రైవర్-సంబంధిత సమాచారం ని కూడా మనకి చూపించినప్పటికీ, ఈ క్విడ్ లో అత్యవసర లక్షణం మిస్ అవుతుంది అది ఏమిటంటే టాకోమీటర్. మారుతి తోబుట్టువుల మధ్య, కేవలం ఆల్టో K10 మాత్రమే ఈ లక్షణాన్ని పొందుతుంది.
కొంచెం నాసిరకమైన పరికరాలు
ఈ క్విడ్ లో సీట్‌బెల్ట్స్ ఉపసంహరించదగిన రకమైన మరియు చాలా తక్కువ క్వాలిటీ లా అనిపిస్తాయి. ఇప్పుడు మీరు మీ కారులో ఉండే వస్తువులన్నీ పద్దతిగా పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు ఈ సీట్‌బెల్ట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయని చెప్పవచ్చు. ORVM లను అంతర్గతంగా సర్దుబాటు చేయడం సాధ్యం కాదు, ఆల్టోస్ ఇద్దరూ ఇదే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటూ మెరుస్తున్నాయి. ఇంకా దీనిలో సెంట్రల్ A.C వెంట్స్ కూడా నాసిరకంగా ఉంటాయి మరియు అవి పూర్తిగా మూసివేయబడినా కూడా, మీరు పూర్తిస్థాయిలో బ్లోవర్ ఉంచితే అది తెరవబడుతుంది.
28-లీటర్ ఇంధన ట్యాంక్: ఆల్టో తోబుట్టువులు తో పోలిస్తే రెనాల్ట్ క్విడ్ యొక్క ఇంధన ట్యాంక్ సామర్థ్యం 28-లీటర్ల వద్ద గణనీయంగా తక్కువగా ఉంది, వీటిలో రెండూ కూడా 35 లీటర్ ఇంధన ట్యాంక్ ని కలిగి ఉన్నాయి.7-లీటర్ వ్యత్యాసం గుర్తించదగినది, ముఖ్యంగా దూరపు రహదారి ప్రయాణాలలో. దీని వలన మొత్తంగా ఆల్టో అనేది మెరుగైన శ్రేణిని కలిగి ఉంటుందనేది చెప్పుకోవచ్చు.
Check out: Renault Kwid EV Nears Production; Might Be Imported To India From China
Read More on : Renault KWID AMT