• English
  • Login / Register

ఫిబ్రవరి 3 వ తేధీ బహిర్గతం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న రెనాల్ట్ క్విడ్ ప్రత్యేక ఎడిషన్స్

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా జనవరి 29, 2016 12:06 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫ్రెంచ్ ఆటో సంస్థ ఫిబ్రవరి 3న క్విడ్ హ్యాచ్బ్యాక్ యొక్క కొత్త వెర్షన్లు ఆవిష్కరించనుంది అని భారత ఆటో ఎక్స్పోలో జరుగనున్న విలేకర్ల సమావేశంలోధ్రువీకరించారు. ఈ బహిర్గతం 1:20 pm మరియు 1:40 pm మధ్య జరుగుతాయి మరియు మోడల్స్ లో క్విడ్ యొక్క 1.0 లీటర్, ఆటోమేటిక్ మరియు ఇతర ప్రత్యేక సంచికలు ఉండవచ్చు. ఈ నమూనాలు, క్విడ్ ప్రస్తుత 799cc మోడల్ తో పాటు అమ్మబడతాయి, ఇవి ప్రామాణిక 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ని కలిగి ఉంటాయి. ప్రారంభ స్థాయి హాచ్బాక్ రాబోయే వేరియంట్స్ ప్రామాణిక 799cc మోడల్ పైన ధరకు అందించబడతాయి. 

వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ వాహనం క్విడ్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్ ఆంట్ గేర్బాక్స్ కలిగి ఉంటుంది మరియు మరింత శక్తివంతమైన 1 లీటర్ పెట్రోల్ వెర్షన్ ప్రామాణిక 799cc మోడల్ తో పాటు పైన పేర్కొన్న గేర్బాక్స్ తో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇవి ఎలా ఉన్నప్పటికీ ఇవన్నీ ఉహాగానాలే కానీ అధికారిక నిర్ధారణలు లేవు. రెనాల్ట్ దాని 1 లీటర్ క్విడ్ వేరియంట్లలో ABS అందివ్వచ్చు అని చెబుతూ పుకార్లు కూడా ఉన్నాయి. 1 లీటర్ వేరియంట్ 799ccయూనిట్ యొక్క నవీకరించబడిన వెర్షన్, ఇది ప్రస్తుత తరం క్విడ్ లో భాగంగా ఉంది. క్విడ్ ప్రస్తుత నమూనా లో 799 cc పెట్రోల్ యూనిట్ 5678rpm వద్ద 53.3bhp శక్తిని మరియు 4386rpm వద్ద 72Nm టార్క్ ని అందిస్తుంది. 

రెనాల్ట్ సంస్థ రాబోయే ఆటో ఎక్స్పోలో Lodgy MPVయొక్క ప్రత్యేక ఎడిషన్ కూడా ప్రదర్శిస్తుందని భావిస్తున్నాము. ఈ ఆటో షో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు ప్రజల కోసం తెరిచి ఉంటుంది మరియు గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరుగుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience