రెనాల్ట్ క్విడ్ - మారుతి 800 తర్వాత రెండవ అతిపెద్ద థింగ్!

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం raunak ద్వారా సెప్టెంబర్ 30, 2015 10:49 am ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దాదాపు 3 దశాబ్దాల క్రితం 800 ఏమి చేసింది, క్విడ్ కూడా దాని ఆశ్చర్య ధర మరియు నిష్పత్తిలో అదే చేయాలని సన్నద్ధమవుతోంది .

జైపూర్:

Renault KWID & Maruti Suzuki 800

భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీ భారీ అంబాసిడర్స్ మరియు ఫద్మినీస్ ఆధిపత్యం చేసినప్పుడు మారుతి 800 ఉనికిలోకి వచ్చింది. ఈ 800 వాటి కంటే పరిమాణంలో చిన్నది, తక్కువ ఖరీదు మరియు గణనీయంగా తేలికైనది దాని ప్రాముఖ్యత లేని 796 సిసి మోటార్ తో రోఅడ్ పైన ప్రాముఖ్యత చెందదు అనుకున్నారు. కానీ 800 సులభంగా అంబాసిడర్స్ ని మరియు ఫియాట్ ని అధిగమించింది. మారుతి ప్రసిద్ధ ట్యాగ్లైన్ 'కిత్నా దేతీ హై?' ఈ విషయం కొరకు మారుతి 800 కి మేము క్రెడిట్ అందిస్తున్నాము.

Rnault KWID

నానో విడుదలయినప్పుడు అది భారత ఆటో స్పేస్ లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆ సంస్థ చాలా ఆశించింది. అదే దారిలో ఇప్పుడు క్విడ్ ఉంది. నానో కి టెస్ట్ డ్రైవ్స్ లేకపోవడం డెలివరీస్ అంతగా లేకపోవడం వలన నానో ని చీప్ కారు 1 లక్ష కి అందుబాటులో ఉన్న కారు గా అమ్మకాలు చేశారు. కానీ 800 దానికి వ్యతిరేఖంగా ఇది ఎక్కువ ఇంధన సామర్ధ్యం అందించే కారు గా చెప్పి అమ్మకాలు చేసారు. భారత వినియోగదారులు తక్కువ ఖరీదు ఉన్న కారు కావాలనుకుంటారు కాని అది చీప్ కారు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నానో చీప్ కారు అని ప్రచారం జరిగిన మూలాన దానిలో ఎన్ని అద్భుతమైన లక్షణాలు మరియు ఏఎంటి అందించినప్పటికీ ప్రాముఖ్యత చెందలేకపోతుంది. ఉదాహరణకు ఫోర్డ్ ఫియస్టా అధిక ధరతో వచ్చింది ఇప్పుడు దాని విభాగంలో బేస్ ట్రిం ప్రస్తుత ఫేస్లిఫ్ట్ వెర్షన్ తక్కువ ధరతో డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మరియు ఏబిఎస్ తో ఉన్నప్పటికీ ఎవరూ మక్కువ చూపలేదు.

క్విడ్ ఎందుకు వీటికి వేరుగా ఉంది. ఫ్రెంచ్ ఆటో తయారీదారుడ్ ఈ క్విడ్ కి తెలివిగా వెనక నుండి చూస్తే బేబీ డస్టర్ లా కనిపించేలా రూపొందించారు. అంతేకాకుండా ఇది ఆల్టో 800 కంటే తక్కువ ధరను కలిగి ఉంది.  భారత వినియోగదారులు క్రాసోసర్ మరియు కాంపాక్ట్ ఎస్యువి కార్లపై మక్కువ చూపిస్తారు కావున క్విడ్ ప్రారంభానికి ఇది సరైన సమయం. అంతేకాకుండా క్విడ్ చీప్ కారు అనే భావన వినియోగదారులకి కలగలేదు. అది పెద్దగా కనిపించడం వలన లేదా అత్యుత్తమ లక్షణాల వలనో కానీ క్విడ్ మంచి ఆదరణ పొందింది.

Renault KWID

Renault Duster & Renault Captur

Renault KWID

మొదటిసారి కొనుగోలుదారులు ఖచ్చితంగా దాని ప్రత్యర్ధుల కంటే క్విడ్ ని ఎన్నుకుంటున్నారు కానీ రెండవ మరియు మూడవ కొనుగోలుదారులు కూడా క్విడ్ ని ఇంటికి తెచ్చుకుంటున్నారు. దాని ఆకర్షణీయమైన లుక్స్ మాత్రమే కాకుండా, ఇది చాలా అరుదైన విషయాలను ఈ విభాగంలో అందిస్తుంది. అవి డస్టర్ 7-అంగుళాల మీడియా నావిగేష టచ్స్క్రీన్ యూనిట్ మరియు 300 లీటర్ల బూట్ ఇది ఒక్కటే హోండా జాజ్ యొక్క 353-లీటర్ల బూట్ కంటే తక్కువ ఉంది. ఇది మిగిలిన హ్యాచ్బాక్ అయిన ఎలైట్ ఐ 20, ఫిగో, పుంటో పోలో వంటి వాటితో పోటీగా ఉంది మరియు 3.53 లక్షల ధర వద్ద డ్రైవర్ వైపు ఎయిర్బ్యాగ్ వంటి లక్షణంతో పిర్యాదు చేసేందుకు ఏమీ లేదు. బహుశా ఈ వాహనం పరిపూర్ణతకు చాలా దగ్గరగా ఉంది!

Renault KWID

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience