రెనాల్ట్ క్విడ్ డీలర్షిప్‌లను చేరుకుంది, డెలివరీలు మొదలు అయ్యాయి
అక్టోబర్ 14, 2015 12:45 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఎంతో కాలం వేచి చూసిన తరువాత దిగువ శ్రేని వేరియంట్ల డెలివరీలు ఇప్పుడు మొదలు అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్ పెద్దగా ఉంది మరియూ ఈ 25,000 బుకింగ్స్ డెలివరీలకై 2 నెలలు పడుతుంది. డెలివరీలు ముందు మెట్రో సిటీలలో మరియూ తరువాత ఇతర సిటీలలో వచ్చే వారాలలో జరుగుతాయి. జైపూర్ లో ఒక డీలర్ చెప్పిన వివరాల ప్రకారం, ఇప్పుడు క్విడ్ ని బుక్ చేసుకుంటే, వచ్చే ఏడాది మిడ్-జనవరీ కి డెలివరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారు సెప్టెంబరు 24న విడుదల అయ్యింది. అప్పటి నుండి బుకింగ్స్ రికార్డు పెరిగిపోతోంది. రెనాల్ట్ వారికి ఇది కొత్త రికార్డు మరియూ ఇది మారుతీ వారిని కలవరపరిచే అంశం ఎందుకంటే ఈ క్విడ్ ఆల్టో 800 కి పోటీగా నిలువనుంది.
రెనాల్ట్ క్విడ్ ని రూ. 2.57 లక్షల ధరకి విడుదల చేశారు. ఇది రూ. 3.53 (ఎక్స్-ఢిల్లీ) ధరకి చేరుకుంటుంది. ఇది తయారీ 98% స్థానికంగా చేయడం వలన సాధ్యపడింది. నిర్వహన గురించి మాట్లాడుతూ, దిగువ శ్రేణి హ్యాచ్ బ్యాక్ కి ఇన్-లైన్ 3-సిలిండర్, 800cc ఇంజిను కలిగి, ఇది 54bhp శక్తిని ఇంకా 72Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఇది దాదాపుగా 25.17Kmpl యొక్క ఇంధన సామర్ధ్యం కలిగి ఉంది. ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దీనికి జత చేయబడి ఉండటం వలన, ఈ కారులో షికారు ఇంకా హాయిగా సాగుతుంది.
కస్టమర్లకి కస్టమైజ్ చేసుకోవడానికి గాను ఎంపిక చేసుకునేందుకు ఎన్నో ఉపకరణాలను అందిస్తున్నారు. ధర తక్కువ ఉండటం వలన అధిక ఉపకరణాలు పొందాలి అనుకునే కస్టమర్ల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చును.