• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ ఔట్‌సైడర్ Vs రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ - ఏమిటి వ్యత్యాసం?

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం dinesh ద్వారా ఏప్రిల్ 23, 2019 11:51 am ప్రచురించబడింది

  • 100 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

క్విడ్ ఔట్‌సైడర్ బ్రెజిల్ లో 2019 నాటికి అమ్మకానికి వెళ్ళవచ్చు, అయితే క్విడ్ క్లైంబర్ ఇండియలో ఇప్పటికే అమ్మకానికి ఉంది.

Renault Kwid Outsider vs Renault Kwid Climber - What’s Different?

రెనాల్ట్ 2016 సావో పాలో మోటర్ షోలో క్విడ్ ఔట్‌సైడర్ కాన్సెప్ట్ ని ప్రారంభించింది. ఇప్పుడు, రెండు సంవత్సరాల తర్వాత ఔట్‌సైడర్ కాన్సెప్ట్ త్వరలో ఉత్పత్తి యొక్క కాంతిని చూడడానికి సిద్ధపడుతోందని తెలుస్తోంది. పుకార్లు గనుక మీరు నమ్మినట్లయితే, రెనాల్ట్ 2019 ప్రారంభంలో లాటిన్ అమెరికా మార్కెట్ లో క్విడ్ అవుట్‌సైడర్ ని ప్రారంభించాలని యోచిస్తోంది అని అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఫ్రెంచ్ కార్ల తయారీ అధికారి నుంచి అధికారిక నిర్ధారణ అయితే ఇంకా లేదు.

ఇప్పటివరకూ మనం క్విడ్ అవుట్‌సైడర్ గురించి ఏమి తెలుసుకున్నాము:

బాహ్యభాగాలు

Renault Kwid Outsider vs Renault Kwid Climber - What’s Different?

క్విడ్ ఔట్‌సైడర్ దాని భావనలకు సమానంగా ఉంటుంది,ఇప్పటివరకు డిజైన్ సంబంధించి ఇది ప్రామాణిక క్విడ్ కి సమానంగా ఉంటుంది. అయితే, ప్రామాణిక కారు నుండి ఔట్‌సైడర్ ను వేరు చేసే కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది అదనపు బాడీ క్లాడింగ్, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్లు మరియు రూఫ్ రెయిల్స్ వంటి లక్షణాల తో SUV- లాంటి ఉనికిని కలిగి ఉంది. ఔట్సైడర్ ఫ్రంట్ గ్రిల్ మీద ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు మిశ్రమాలు, అలాయ్స్, రూఫ్ రెయిల్స్, బాడీ క్లాడింగ్ మరియు ఫాగ్ లాంప్ హౌసింగ్ వంటి లక్షణాలతో ఒక  చురుకుదైన రూపాన్ని కలిగి ఉంది.

అవుట్‌సైడర్ స్పోర్ట్స్ యొక్క అధనపు డిజైన్ ఎలిమెంట్స్ ని చూస్తే గనుక ఇప్పటికే భారతదేశంలో అమ్ముడుపోతున్న క్విడ్ క్లైంబర్ తో వాటిని పోల్చడం అనేది కష్టం. అవుట్‌సైడర్ లానే క్లైంబర్ ప్రాధమిక క్విడ్ కి బాగా సమానంగా ఉంటుంది. అయితే ఇది అధనపు డిజైన్ లక్షణాలు అయిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు తిరిగి డిజైన్ చేయబడిన వీల్స్ ని కూడా కలిగి ఉంది. ఇది అవుట్‌సైడర్ మీద ఉండే గ్రీన్ ఇన్సర్ట్స్ కి సమానంగా ఉండే ఆరెంజ్ ఇన్సర్ట్స్ ని కూడా కలిగి ఉంది.

లోపల భాగాలు

Renault Kwid Outsider vs Renault Kwid Climber - What’s Different?

బాహ్య భాగాల వలె, క్విడ్ ఔట్‌సైడర్ యొక్క లోపలి భాగాలు కూడా కొన్ని రంగుల ఇన్సర్ట్స్ తప్ప మిగిలినవి అంతా కూడా ప్రామాణిక క్విడ్ తో సమానంగా ఉంటుంది. ఔట్‌సైడర్ స్టీరింగ్ వీల్ మీద ఆరెంజ్ ఇన్సర్ట్, A.C వెంట్స్, సెంటర్ కన్సోల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు గేర్ నాబ్ తో వస్తుంది. ఈ రంగురంగుల ఇన్సర్ట్ సీట్లు మరియు డోర్ ట్రిమ్స్ లో చూడవచ్చు.

మేము క్విడ్ క్లైంబర్ తో పోల్చినట్లయితే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తప్ప క్యాబిన్ అంతా ఒకేలా ఉంటుంది. బ్రెజిల్-స్పెక్ కారులో కనిపించే అనలాగ్ విభాగానికి బదులుగా భారత-స్పెక్ క్విడ్ ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని పొందుతుంది. క్లైంబర్ లో కనుగొనబడిన మీడియా నావిగేషన్ వ్యవస్థ మొదటి-తరం వ్యవస్థ, అయితే ఔట్సైడర్ లో ఉన్నది రెండవ తరం వ్యవస్థ.

లక్షణాలు

Kwid Climber Infotainment System

ముందు లక్షణాల విషయానికి వస్తే, క్విడ్ అవుట్‌సైడర్ ప్రామాణిక క్విడ్ వలె అమర్చబడి ఉంటుంది. 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కాకుండా, బ్రెజిల్-స్పెక్ క్విడ్ AC, వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రేర్-వ్యూ మిర్రర్స్, ఎలక్ట్రిక్ ఓపెనింగ్ టెయిల్‌గేట్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ మరియు ఇంధన సామర్థ్య డ్రైవ్ కోసం ఎకో ఫ్యుయల్ కోచింగ్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

మేము క్విడ్ క్లైంబర్ తో పోల్చినట్లయితే, అవుట్‌సైడర్ బాగా ఉత్తమంగా అమర్చబడుతుంది. ఎలక్ట్రిక్ ఓపెనింగ్ టెయిల్‌గేట్, ఎలక్ట్రికల్ సర్దుబాటు వింగ్ మిర్రర్స్ మరియు పర్యావరణ ఇంధన కోచింగ్ వంటి లక్షణాలు భారతదేశం-స్పెక్ కారు లో మిస్ అవుతున్నాయి.

అగ్రశ్రేణి క్విడ్ నాలుగు ఎయిర్బాగ్స్, ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటి లక్షణాలతో అమర్చబడి ఉండటంతో, ఈ భద్రతా లక్షణాలను ఈ క్విడ్ అవుట్‌సైడర్ కూడా కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము.     

ఇంజిన్

Renault Kwid Outsider vs Renault Kwid Climber - What’s Different?

యాంత్రికంగా, క్విడ్ ఔట్‌సైడర్ బ్రెజిలియన్ క్విడ్ లో ఉండే అదే 1.0 లీటర్ మూడు సిలిండర్ల SCe ఇంజిన్ ని కలిగి ఉందని భావిస్తున్నారు. ఇది డ్యూయల్-ఇంధన ఇంజిన్ ఇది పెట్రోలు మరియు ఇథనాల్ రెండింటిలోనూ నడుస్తుంది. పెట్రోల్ తో ఇంజిన్ 66Ps పవర్ మరియు 91Nm టార్క్ ని అందిస్తుంది, ఇథనాల్ లో అయితే ఇంజిన్ 70Ps పవర్ మరియు 91Nm టార్క్ ని అందిస్తుంది. పవర్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ద్వారా ముందర వీల్స్ కి పంపబడుతుంది.   

ఈ 1.0-లీటర్ ఇంజిన్ కూడా క్వైడ్ క్లైంబర్ కి శక్తినిస్తుంది. భారతదేశంలో, ఇది 68Ps శక్తిని మరియు 91Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఒక AMT గేర్బాక్స్ తో జత చేయబడింది.  

ధర

Kwid Climber

భారతదేశంలో రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ ధర రూ. 4.29 లక్షలు ఉంది, ఇది రూ.4.04 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో ఉన్న టాప్ మోడల్ కంటే రూ.25,000 కంటే ఎక్కువ. క్లైంబర్ లాగానే, ఔట్‌సైడర్ ప్రామాణిక క్విడ్ కంటే చాలా ఖరీదైనది, ఇది R$ 49,740 (రూ 8.13 లక్షల రూపాయలు) ధరతో ఉంటుంది. బ్రెజిల్-స్పెక్ క్విడ్ ఇండియన్ స్పెక్ కారు కంటే రూ .4.09 లక్షల విలువైనది.

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience