రెనాల్ట్ క్విడ్ వారు మారుతి వారిని డిస్కౌంట్లు ఇచ్చేందుకు ప్రోత్సహించింది
అక్టోబర్ 12, 2015 03:16 pm manish ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
రెనాల్ట్ క్విడ్ విడుదల అయినప్పుడు ఎందరో కారు ఔత్సాహికులు ఇటువంటి కారు ఎన్నడూ రాలేదు అని అన్నారు. ఇది రూ.2.57 లక్షల (ఎక్స్-షోరూం, డిల్లీ) ధర కి అందించారు. దాని ఉన్నత-శ్రేని రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూం డిల్లీ) కి అందించారు. ఈ పోటీ ని చూసి పండుగ కాలంలో పోటీ ని తట్టుకోవడానికి డిస్కౌంట్లు ఇవ్వల్సిందేనని నిర్నయించుకున్నారు. మారుతీ వారు ఆల్టో 800 ని దాదాపు రూ.35,000 మరియూ హ్యుండై వారు ఇయాన్ హ్యాచ్ బ్యాక్ పై రూ.37,000 డిస్కౌంట్ ని అందిస్తున్నారు.
పండుగ కాలం లో ఆఫర్లు ఇవ్వడం సహజమే అయినా, దాదాపుగా 14% డిస్కౌంట్ ని అందించడం కేవలం పోటీని తట్టుకొనేందుకే. క్విడ్ దాదాపు 25000 బుకింగ్స్ ని నెల రోజులలో అందుకుంది, ఇది మరుతీ కి హ్యుండై కి కలవరపరిచే విషయమే.
క్విడ్ వారు కారు నాణ్యత గురించి గర్వపడుతోంది. సెగ్‌మెంట్ లో మొదటిసారి అందిస్తున్న ఉపకరణాలు ఇంకా అందమైన రూపం గురించి క్విడ్ ఎంట్రీ-లెవల్ కార్ల స్థాయిని పెంచింది.