రేనాల్ట్ క్విడ్: బయటకు రాని కొన్ని విజయవంతమైన అంశాల విశేషాలు
ఫిబ్రవరి 03, 2016 11:18 am manish ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీదారులు సాధించాలనుకునే కలకి అనుగుణంగా 85,000 లకు పైగా యూనిట్లు బుకింగ్ చేయబడి రెనాల్ట్ క్విడ్ ఒక ప్రభంజనంగా మారి చాతుర్యం మరియు ఆటోమోటివ్ సమర్థత యొక్క సంక్షేపమునకు పునాది వేసింది. ప్రవేశ స్థాయి హ్యాచ్బ్యాక్ విభాగంలో ఒక అనూహ్యమైన రీతిలో స్పందన లభించడం వలన ఫ్రెంచ్ వాహన తయారీదారులు తమ యొక్క బుకింగ్స్ ని తాత్కాలికంగా చాలా శందర్భాలలో నిలిపివేయడం జరిగింది. ఏ విధంగా క్విడ్ ప్రత్యేఖమైనదో? పరిశీలిద్దాం రండి..
పవర్ప్లాంట్:
దీనిలో ఉన్న చిన్న 799cc పవర్ప్లాంట్ అంచనాలను మించిపోయింది మరియు పనితీరు విష్యానికి వస్తే తన యొక్క బలమైన 53bhp పెట్రోల్ యూనిట్ తో ఆకట్టుకుంది మరియు దాని పోతీదారి హ్యుందాయి ఇయాన్ కంటే కొన్ని bhp శక్తి మాత్రమే తక్కువ అందిస్తుంది. మార్కెట్ లీడర్ మారుతి ఆల్టో 800 పోలిస్తే కూడా, క్విడ్ వాహనం 6bhp ల అధనపు శక్తిని అందిస్తుంది. ఇవన్నీ కాకుండా ఈ విభాగంలో ఉత్తమంగా లీటర్ కి 25కిలోమీటర్లు ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.
లుక్స్:
రెనాల్ట్ క్విడ్ భారతదేశంలో ప్రతీ వినియోగదారుని యొక్క కలలకి చేరువగా ఉంటుంది మరియు ప్రవేశ స్థాయి కార్లలో ఒక పెద్ద కారుని సొంతం చేసుకున్నాననే అనే అనుభూతిని ఇస్తుంది. ఎస్యువి స్టయిలింగ్, క్లాడింగ్, అధిక గ్రౌండ్ క్లియరన్స్ మరియు ఉత్తేజకరమైన రంగులతో ఈ కారు వినియోగదారుల యొక్క హృదయాన్ని దోచుకుంటుంది.
అందించబడే అంశాలు:
ఈ చిన్న హ్యాచ్బ్యాక్ బాహ్య వీక్షణతో మాత్రమే ఆకట్టుకోవడమే కాకుండా అంతర్భాగలాలో కూడా సమాచార వినోద వ్యవస్థ, AC నియంత్రణలు మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అంశాలతో మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.
వాహన ప్రియులకు అదనపు ఆనందాన్ని అందిస్తూ ఫ్రెంచ్ వాహన తయారీసంస్థ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరుగనున్న రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో క్విడ్ యొక్క ప్రత్యేక సంచికలను కూడా ప్రదర్శించనున్నది. ప్రత్యేక ఎడిషన్ వేరియంట్స్లలో 1 లీటర్ సూపెడ్ అప్ వెర్షన్ హ్యాచ్బ్యాక్ తో పాటూ ABS ఎంపికతో కూడా అందించబడుతుందని భావిస్తున్నారు. రెనాల్ట్ సంస్థ షో సమయంలో AMT క్విడ్ వేరియంట్లని కూడా బహిర్గతం చేసి ప్రేక్షకుల యొక్క స్పందనని తెలుసుకోవాలని ఆశిస్తుంది.
రెనాల్ట్ క్విడ్ యొక్క మొదటి డ్రైవ్ వీక్షించండి