రెనాల్ట్ క్విడ్ ఉపకరణాలు: మీ హాచ్బ్యాక్ ను మీకు నచ్చినట్టు మల్చుకోండి
జూన్ 21, 2019 10:12 am akas ద్వారా ప్రచు రించబడింది
- 27 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంట్రీ లెవల్ కార్లలో ఒకటి, రెనాల్ట్ క్విడ్ వాహనాన్ని పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ హాచ్బ్యాక్ ప్రారంభ ధర రూ 2.66 లక్షలు (ఎక్స్- షోరూమ్, ఢిల్లీ) మరియు ఎస్‌యువి -ప్రేరేపిత డిజైన్ మరియు సెగ్మెంట్- ఫస్ట్ ఫీచర్లకు ప్రసిద్ది చెందింది. క్విడ్ ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకునే విధంగా ఉంది మరియు ఇది క్రియాత్మకమైన కారు అలాగే దీనిలో అందించే అదనపు ఉపకరణాల జాబితా చాలా సుదీర్ఘమైనది. ఉపకరణాలు బేసిక్ ప్యాక్, స్మార్ట్ క్రోమ్ ప్యాక్, ఎసెన్షియల్ ప్యాక్, ఇంటెన్స్ క్రోమ్, లగ్జరీ ప్యాక్ మరియు అవుట్డోర్ ప్యాక్ అనే ఆరు అనుకూలీకరణ ప్యాక్‌లుగా కలిసి ఉన్నాయి. క్విడ్ యజమానులు ఈ ప్యాక్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు లేదా వారి ప్రాధాన్యత ప్రకారం వ్యక్తిగత ఉపకరణాలను ఎంచుకోవచ్చు. రెనాల్ట్ దాని అన్ని ఉపకరణాలపై 1 సంవత్సరం / 20,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. వాటిని తనిఖీ చేద్దాం.
- రెనాల్ట్ క్విడ్ వర్సెస్ ప్రత్యర్థులు - హిట్స్ & మిసెస్
1) బేసిక్ ప్యాక్
బేసిక్ ప్యాక్ ధర రూ 2,768 మరియు సిల్వర్ కార్ కవర్, మడ్ ఫ్లాప్స్ మరియు ఫ్లోర్ మాట్ కార్పెట్ బ్లాక్ క్యాబిన్ ఫ్లోర్ ఉన్నాయి.
2) స్మార్ట్ క్రోమ్ ప్యాక్
స్మార్ట్ క్రోమ్ ప్యాక్ ధర 3,435 రూపాయలు మరియు టైల్ గేట్, ఫ్రంట్ గ్రిల్, డోర్ హ్యాండిల్స్ మరియు గేర్ షిఫ్ట్ దగ్గర క్రోమ్ స్ట్రిప్స్ జతచేయ బడుతున్నాయి.
3) ఎసెన్షియల్ ప్యాక్
ఎసెన్షియల్ ప్యాక్ ధర రూ 8,751 మరియు బేసిక్ ప్యాక్‌తో అందించే ఉపకరణాలతో పాటు బాడీసైడ్ క్లాడింగ్, రూఫ్ రైల్స్ మరియు సిల్ ప్లేట్ లను అందిస్తుంది.
రెనాల్ట్, భారతదేశం కోసం క్విడ్ ఆధారిత ఎంపివిని సిద్ధం చేస్తోంది. ఇక్కడ మరింత చదవండి.
4) ఎక్కువ మొత్తంలో క్రోమ్ ప్యాక్
మీరు క్రోమ్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నట్లయితే, ఈ ప్యాక్ మీకు బాగా సరిపోతుంది. దీని ధర రూ 8,276 వద్ద ఉంది మరియు ఈ ధరతో ఫాగ్ లాంప్లు, టెయిల్ లాంప్లు, బంపర్ క్రోమ్ గార్నిష్, క్రోమ్ వెదర్ డిఫ్లెక్టర్, క్రోమ్ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్ మరియు క్రోమ్ హెడ్‌ల్యాంప్ ఐలైనర్ వంటి వాటి చుట్టూ క్రోమ్ ఫినిషింగ్ అందించబడుతుంది.
5) లగ్జరీ ప్యాక్
రూ 10,980 ధరతో, ఈ ప్యాక్ ప్రకాశవంతమైన సిల్ ప్లేట్లు, డిజైనర్ ఫ్లోర్ మాట్, ఫ్రంట్ గ్రిల్‌లో క్రోమ్ గార్నిష్, గేర్ షిఫ్టర్ దగ్గర క్రోమ్ బెజెల్, యాంబియంట్ లైటింగ్ మరియు డిజైనర్ కార్ కవర్ వంటి ఉపకరణాలను అందిస్తుంది.
6) అవుట్డోర్ ప్యాక్
ఇది అత్యంత ఖరీదైన ప్యాక్ మరియు దీని ధర రూ 12,469. ఇది ప్రకాశవంతమైన సిల్ ప్లేట్లు, బాడీ సైడ్ క్లాడింగ్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ బంపర్ ఫినిషర్, వెనుక బంపర్ ఫినిషర్, వెదర్ డిఫ్లెక్టర్ మరియు బంపర్ కార్నర్ ప్రొటెక్టర్ వంటి ఉపకరణాల జాబితాను అందిస్తుంది.
స్టీరింగ్ వీల్ కవర్లు, డాష్‌బోర్డ్ కోసం యాంటీ- స్లిప్ మాట్స్ మరియు సీట్ కవర్లు వంటి పైన పేర్కొన్న అనుబంధ ప్యాక్‌లతో పాటు ఆఫర్‌లో మరిన్ని ఉపకరణాలు ఉన్నాయి. పై ప్యాకేజీలలో భాగమైన వివిధ ఉపకరణాలు ఒక్కొక్కటిగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఉపకరణాలతో పాటు, మీ క్విడ్‌కు వేరే గుర్తింపు ఇవ్వడానికి మీరు ఆరు రకాల బాడీ డికాల్స్‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
![]() |
![]() |
ఇవి కూడా చదవండి: రెనాల్ట్ క్విడ్ - వేరియంట్ల వివరాలు
మరింత చదవండి: క్విడ్