7,8 సీట్ల ఎంపికలతో కూడిన టాప్-ఎండ్ RxZ వర్షన్ ఆధారంగా అందుబాటులో ఉన్న రెనాల్ట్ లాడ్జీ స్టెప్వే
రెనాల్ట్ లాడ్జీ కోసం raunak ద్వారా జూన్ 15, 2015 03:09 pm ప్రచురించబడింది
- 29 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: - రెనాల్ట్ ఇండియా, లాడ్జీ ఎంపివి లో స్టెప్వే అను కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇది లాడ్జీ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఆర్ ఎక్స్ జెడ్ లో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ 7 సీట్లతో మరియు 8 సీట్లతో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ డీజిల్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వాహనాలు 1.5 లీటర్ కె9కె డిసి ఐ డీజిల్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజెన్ అత్యధికంగా 110PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ స్టెప్వే లాడ్జీ RxZ 110PS 7 మరియు 8 సీట్ల వేరియంట్లతో పోలిస్తే, ఈ స్టెప్వే వేరియంట్ యొక్క ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది.
లాడ్జీ లో ఉన్న లక్షణాలను మినహాయించి, ఇప్పుడు విడుదల అయిన స్టెప్వే లో ఏమేం రాబోతున్నాయో చూద్దాం
- ఇప్పుడు స్టెప్వే, ఆల్ అరౌండ్ బాడీ క్లేడింగ్ తో పాటు డ్యూయల్ టోన్ బంపర్స్ ను అందిస్తుంది
- ఈ వాహనం యొక్క ముందు మరియు వెనుక బంపర్ లు ఫాక్స్ వెండి ఫినిషింగ్ తో పాటు స్కిడ్ ప్లేట్ల తో అందుబాటులో ఉంది.
- దీని యొక్క గ్రిల్ల్ కొత్తది మరియు స్పోటీ లుక్ ను ఇస్తుంది. రెనాల్ట్ సంస్థ వారు ఈ వాహనం యొక్క గ్రిల్ ను 'రత్నాలు పొదిగిన' గ్రిల్ గా పిలుస్తారు.
- ఈ స్టెప్వే యొక్క రూఫ్ రైల్స్ సాటిన్ క్రోమ్ తో అందించబడుతుంది మరియు డోర్ క్లాడింగ్, క్రోమ్ హైలైట్స్ తో అందించబడుతుంది.
- దీనిలో, పాత దాని వలే అవే అల్లాయ్ వీల్ అందించబడతాయి. కానీ, స్టెప్వే లో గన్ మెటల్ కలర్ తో అందించబడతాయి.
- ఈ స్టెప్వే వాహనాల ముందు డోర్లకు మరియు క్రోమ్ డోర్ స్టఫ్ ప్లేట్స్ పై స్టెప్వే బేడ్జింగ్ అమర్చబడి ఉంటుంది.
- వీటితో పాటు, యూరప్ లో ఉన్న వాహనం మాదిరిగా, ఈ స్టెప్వే లో కూడా ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో అందుబాటులో ఉన్నాయి. అంతర్భాగాల విషయంలో, లాడ్జీ RxZలో ఉన్న మాదిరిగా అందించబడ్డాయి.
యాంత్రికంగా, ఈ వాహనాలు 1.5 లీటర్ డిసి ఐ డీజిల్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజెన్లలో 4 సిలండర్లు అందించబడతాయి. ఈ ఇంజెన్ లు ఇంటర్కూలర్ తో ఒక టర్బోచార్జర్ జత చేయబడి ఉంటుంది. ఈ డీజిల్ ఇంజెన్ 4000rpm వద్ద అత్యధికంగా 108bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా టార్క్ విషయానికి వస్తే, 1750rpm వద్ద అత్యధికంగా 245Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. దీని యొక్క పవర్ ను ఈ ట్రాన్స్మిషన్ ద్వారా ముందు వీల్స్ కు అందించబడుతుంది. మరియు ఏఆరే ఐ ఆధారంగా ఈ వాహనాలు 19.98 kmpl మైలేజ్ ను ఇస్తాయి.
0 out of 0 found this helpful