పోలో వారు కొత్త పరికరం తో సిద్దంగా ఉంది: మీరు ఏమనుకుంటారు?
వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 08, 2015 02:11 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దీపావళి పండుగా వస్తుండటంతో అందరు తయారీదారులు కస్టమర్లను ఊరించే డీల్స్ తో ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అదే విధంగా, ఫోక్స్వాగెన్ వారు పోలో హ్యాచ్బ్యాక్ యొక్క కొత్త వేరియంట్ ని ప్రవేశపెట్టారు. ఇందులో అధిక లక్షణాలు అమర్చి రూ.5.24 లక్షల (ఎక్స్-షోరూం) ధరకి అందిస్తున్నారు. ఈ మోడల్ దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుండి లభ్యం అవుతుంది. కొత్త పుంటో అబార్త్ విడుదల తో ఈ పునరుద్దరణ చెందిన కొత్త వేరియంట్ వలన కంపెనీ వారు పెరుగుతున్న పోటీని తట్టుకోవచ్చు.
దిగువ శ్రేని ట్రెండ్లైన్ మరియూ కంఫర్ట్ లైన్ ట్రిం లలో కేవలం టర్న్ ఇండికేటర్స్ ని బాహ్యపు అద్దలకు అందించడం జరిగింది, అదే ఉన్నత శ్రేని వేరియంట్ కి ఎలక్ట్రికల్లీ మడవగలిగే బాహ్యపు అద్దాలతో పాటుగా టర్న్ ఇండికేటర్స్ ని కూడా అందిస్తున్నారు మరియూ చూలింగ్ గ్లవ్ బాక్స్ ఇంకా క్రూయిజ్ కంట్రోల్ కూడా లభిస్తాయి. ఈ లక్షణాలు మొత్తం పోలో అంతటికీ లభ్యం. వీటిలో 1.2-లీటర్ ఎంపీఐ, 1.2-లీటర్ జీటీ టీఎసై, 1.5-లీటర్ టీడీఐ మరియూ 1.5-లీటర్ జీటీ టీడీఐ. సాకేతికంగా, కార్లో మార్పు చెందదు మరియూ అవే ఇంజిన్లు ఉంటాయి.
ఈ వెర్షన్ యొక్క క్రాస్ ఓవర్ కారు అయిన క్రాస్ పోలో కి కూడా ఇదే మార్పులు అందించి డీజిల్ మరియూ పెట్రోల్ వేరియంట్స్ ని అందించడం జరుగుతుంది.
ఫోక్స్వాగెన్ గ్రూప్ సేల్స్ ఇండియా కి ఫోక్స్వాగెన్ ప్యాసెంజర్ కార్స్ కి డైరెక్టర్ అయిన మైఖేల్ మేయర్ " కొత్త పోలో తో మేము మా కస్టమర్ల డ్రైవింగ్ సౌకర్యాన్ని పెంచాము. ఈ కొత్త లక్షణాలు పెంచడంతో ఈ పండుగ కాలంలో పోలో కి కొనుగోలుదారులు ఆక్స్ర్షితులు అవుతారని నమ్ముతున్నాము," అని అన్నారు.
2015 VW Polo 1.2 MPI – INR 5.23 lakhs onwards
2015 VW Polo 1.5 TDI – INR 6.55 lakhs onwards
2015 VW Cross Polo 1.2 MPI – INR 7.04 lakhs onwards
2015 VW Cross Polo 1.5 TDI – INR 8.31 lakhs onwards
2015 VW Polo GT TSI – INR 8.41 lakhs onwards
2015 VW Polo GT TDI – INR 8.41 lakhs onwards