ప్యూజో వారు భారతదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు; టాటా మోటర్స్ తో భాగస్వామ్యం కై ప్రయత్నం

అక్టోబర్ 06, 2015 12:32 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఫ్రెంచి ఆటో గ్రూపు PSA ప్యూజో సిట్రోయేన్ వారు క్రితం సారి భారతదేశంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సారి మరొక ఆటో దిగ్గజం సహాయంతో రావాలి అని ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక మేరకు, (ఫ్రెంచి-చైనీస్ బెయిల్ అవుట్ తరువాత) కంపెనీ ఇప్పుడు మెరుగైన ఆర్థిక స్థితిలో ఉంది. ఇప్పుడు టాటా మోటర్స్ వారి భాగస్వామ్యంలో తయారీ, పంపిణీ మరియూ సాంకేతిక పరిజ్ఞానం కలిసి పని చేయాలి అని అనుకుంటున్నారు.

అ ప్యూజో సిట్రొయేన్ వారు భారతదేశం మార్కెట్ చాలా ముఖ్యమని భావించి టాటా మోటర్స్ వారితో తీవ్రమైన చర్చలు జరుపుతున్నారు. కంపెనీ లోనే 'ఇండియా-పెసఫిక్ ఆపరేషన్శ్ అనే పేరిట ఒక బిజినెస్ విభాగాన్ని కూడా మొదలుపెట్టి వీరి రాకకై రంగాన్ని సిద్దం చేస్తున్నారు.PSA వద్ద ఇండియా పెసఫిక్ ఆపరేషన్ విభాగానికి అధినేత అయిన ఇమాన్యువల్ డిలేయ్ గారు టాటా మోటర్స్ తో చర్చలు జరుపుతున్నారు మరియూ 2007 లో టాటా తో ఫియట్ వారు చేసుకున్న ఒప్పందం వంటిదే ప్రకటించే అవకాశం ఉంది. ప్యూజో వారు టాటా మోతర్స్ వారి అంతగా ఉపయోగించని సనంద్ సదుపాయం ని ఉపయోగించుకుంటారు. ఇంజిను మరియూ వేదిక పంచుకోవడమే కాకుండా ఈ ఫ్రెంచి తయారీదారి 208 హ్యాచ్ బ్యాక్, 308 సెడాన్ మరియూ 2008 క్రాస్ ఓవర్ ని విడుదల చేయవచ్చును.

ఫ్రెంచి కారు తయారీదారి వారి ప్రపంచ ప్రసిద్ద సాంకేతిక పరిజ్ఞానం వేదికను ఆధారం చేసుకుని లోకల్ దిగ్గజం అయిన టాటా మోటర్స్ వారి ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకై తోడ్పడితే, టాటా మోటర్స్ వారు ఈ ఫ్రెంచి కంపెనీ భారతదేశంలో ప్రవేశించేందుకు సహాయం అందిస్తారు. టాటా మోటర్స్ వారి సనంద్ సముదాయాన్ని సరిగ్గా వినియోగించుకోనందున ఈ రూపంలో ఇరువురికి లాభం చేకూరనుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience