• English
  • Login / Register

ఒక రోజులో 700 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకున్న జిమ్నీ: మారుతి

మారుతి జిమ్ని కోసం rohit ద్వారా ఫిబ్రవరి 16, 2023 07:51 pm ప్రచురించబడింది

  • 70 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ఐదు-డోర్‌ల సబ్ؚకాంపాక్ట్ ఆఫ్-రోడర్, ఈ సంవత్సరం మే నెలలో షోరూమ్ؚలలోకి రానుంది.

Maruti Jimny

  • మారుతి ఈ వాహనాన్ని జెటా, ఆల్ఫా రెండు వేరియంట్‌లలో అందించనుంది. 

  • ఈ వాహన బుకింగ్ؚల సంఖ్య 16,500 మార్క్ؚను దాటింది. 

  • ఐదు డోర్‌లు, ఉపయోగించుకోగల బూట్ స్పేస్ ؚఈ రెండింటితో ఇది మహీంద్రా థార్ వంటి వాహనాల కంటే ఎంతో ఆచరణాత్మకమైనది. 

  • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది; 4x4 ప్రామాణికంగా అందించబడుతుంది. 

  • తొమ్మిది-అంగుళాల టచ్ؚస్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి పరికరాలు దీనిలో ఉన్నాయి. 

  • దీని ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు. 

ఆటో ఎక్స్ؚపో 2023లో, ఈ ఐదు డోర్‌ల మారుతి సుజుకి జిమ్నీ గ్లోబల్ ప్రీమియర్‌లో ప్రదర్శించబడి కేవలం నెల కంటే కొంత సమయం మాత్రమే గడిచింది. ఈ సరికొత్త మోడల్ కోసంؚ 16,500 కంటే ఎక్కువ బుకింగ్ؚలు వచ్చాయని, ప్రతి రోజు 700-750 బుకింగ్ؚలు వస్తున్నాయని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలియజేశారు.

Maruti Jimny Rear Doors

అదనపు డోర్‌లకు, వెనుక భాగంలో మరింత లెగ్ రూమ్ؚ, అధిక బూట్ స్పేస్ؚను అందించడానికి ఈ ఇండియా-వెర్షన్ జిమ్నీؚకి గ్లోబల్ వర్షన్ కంటే పొడవైన వీల్ؚబేస్‌ అందించబడింది, తద్వారా ఈ వాహనాన్ని మరింత ఆచరణాత్మకంగా కనిపించేలా చేస్తుంది. అయినా సరే, ఇది ఇప్పటికీ సాపేక్షంగా చిన్న SUVనే ఎందుకంటే ఇది నాలుగు మీటర్‌ల కంటే తక్కువ ఎత్తుగల విభాగంలోనే ఉంది, అందువలన మరింత చవకగా కొనుగోలు చేయగలిగేలా తక్కువ టాక్స్ తో అందుబాటులోؚ ఉంటుంది. 

సంబంధించినవి: తరతరాలుగా మారుతి జిమ్నీ పరిణామం

మారుతి ఈ SUVని ఏకైక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (105PS/134Nm)తో అందిస్తుంది. ఫోర్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ (4WD) ప్రామాణికంగా అందించబడుతుంది, ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ మరియు నాలుగు-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚల ఎంపిక ఉంది.

Maruti Jimny cabin

జిమ్నీ రెండు విస్తారమైన వేరియెంట్‌లలో విక్రయించబడుతుంది: జెటా మరియు ఆల్ఫా. దీని ఫీచర్‌ల జాబితాలో వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లేతో తొమ్మిది-అంగుళాల టచ్ؚస్క్రీన్, ఆటో AC, క్రూజ్ కంట్రోల్, ఆటో-LED హెడ్ؚలైట్ؚలు ఉన్నాయి. భద్రత విషయంలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, డిసెంట్ కంట్రోల్ మరియు EBDతో ABS ప్రామాణికంగా ఉన్నాయి. Maruti Jimny rear

జిమ్నీ, రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మే 2023 నాటికి వస్తుందని ఆశిస్తున్నాము. త్వరలోనే ఐదు-డోర్‌ల వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్న మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖాలతో పోటీ పడనుంది. 

was this article helpful ?

Write your Comment on Maruti జిమ్ని

explore మరిన్ని on మారుతి జిమ్ని

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience