రీకాల్ చేసుకోవటం అనే విషయంల ో ఎటువంటి మోసం లేదు అని రెనాల్ట్ సి ఈ ఓ అన్నారు.
జనవరి 25, 2016 04:11 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రీకాల్ తర్వాత కొద్ది రోజుల్లోనే రెనాల్ట్ తమ రీకాల్ విషయంలో తాము జారీ చేసిన ప్రకటన లో ఏ మాత్రం మోసం లేదని వివరించింది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సుమారు 15,000 వాహనాలు పరీక్ష ఫలితాలు వ్యత్యాసం మరియు కాలుష్యం కారణంగా వెనక్కి తీసుకుంది.
రెనాల్ట్-నిస్సాన్ చీఫ్, కార్లోస్ ఘోసన్ ఈ విధంగా చెప్పారు. మా సంస్థ ఉద్గారాలని ఉద్దేశ్య పూర్వకంగా అనుమతించలేదు కావాలంటే పటిష్టమైన యూరోపియన్ పరీక్షలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాము. " నేను ఇంత తక్కువ కాలంలో ఏమీ చేయలేక పోవచ్చు కానీ ఖచ్చితంగా మాకంటూ కొన్ని సొంత ఆలోచనలు ఉన్నాయి" అని మిస్టర్ ఘోసన్ స్విట్జర్లాండ్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇంటర్వ్యూ లో తెలిపారు.
రీకాల్ వార్త బయటకు తెలియగానే ప్రజలు వోక్స్వాగన్ ఉద్గార నిబంధనల కి సంబంధించిన విషయం అని అనుకున్నారు. కానీ ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని తెలపడం ముఖ్యం. మిస్టర్ ఘోసన్ జర్మన్ కార్ల తయారీ సంస్థ ద్వారా ఎటువంటి ఓటమి పరికరాల వ్యవస్థాపన జరగలేదని చెప్పారు. దీని గురించి వివరిస్తూ ఈయన ఇలా చెప్పారు. దీని గురించి మూడు ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న. దీనిలో ఎటువంటి చీటేడ్ పరికరం ఉందా? అంటే సమాదానం లేదు. రెండవ ప్రశ్న, మేము నిభందనలకి స్పందిస్త్ఘున్నారా అంటే సమాదానం అవును. " ఫ్రెంచ్ ఆటో మేకర్ కి కస్టమర్ యొక్క సంతృప్తి ముఖ్యము. అని హామీ ఇచ్చారు. అతడు ఇలా పేర్కొన్నాడు. వినియోగదారుడి యొక్క మనస్సులో ఏ విధమయిన గందరగోళం లేకుండా చేయటమే . నిజమయిన డ్రైవింగ్ అనుభవాన్ని ఇవ్వటంలో ఎలాంటి అస్పష్టతనీ లేకుండా నివారించటం మా ఉద్దేశ్యం" అన్నారు.
ఇది కూడా చదవండి; షెవ్రొలె వారు బీట్ యొక్క 1,01,597 యూనిట్లను వెనక్కి తీసుకున్నారు