షెవ్రొలె వారు బీట్ యొక్క 1,01,597 యూనిట్లను వెనక్కి తీసుకున్నారు

డిసెంబర్ 17, 2015 06:18 pm nabeel ద్వారా సవరించబడింది

  • 12 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

Chevrolet

షెవ్రొలె ఇండియా వారు వారి యొక్క 1,01,597 బీట్ డీజిల్ హ్యాచ్‌బ్యాక్ వాహనాలను వెనక్కి తీసుకోబోతున్నారు. జనరల్ మోటార్స్ వారి నిన్నటి ఒక ప్రటన ప్రకారం ఈ వాహనంలోని క్లచ్ పెడల్ లీవర్ లో సమస్య కారణం అని తెలియవచ్చింది. ఈ షెవ్రొలె బీట్ వాహనం డిసెంబర్ 2010 మరియు జులై 2014 మధ్య తయారుచేయబడి మార్కెట్ లోనికి వచ్చింది. ఇప్పుడు ఈ వాహనాలను వెనక్కి తీసుకొనే క్రమంలో వాహన యజమానులకు సమాచారాన్ని అందిస్తున్నారు. వినియోగదారులు వారి వాహనాలను షెవ్రొలే వారి A 2048 సేవా సెంటర్లలోకైనా తీసుకు వెళ్ళవచ్చు. సంస్థ వారు అక్కడ వాహనాలను పరీక్షించి ఈ క్లచ్ పెడల్ లీవర్ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా బీట్ యజామనులు సంస్థ వారి ఏ డీలర్ వద్దకైనా వెళ్ళి వారి వాహన ఇన్స్పెక్షన్ గురించి నమోదు చేసుకోవచ్చు. 

"వినియోగదారులకు నాణ్యత మరియు సేవా అందించడం మా యొక్క అతి ముఖ్యమైన ఉద్దేశ్యం. ఇటువంటి సమస్యలు తలెత్తినపుడు మేము మా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించే క్రమంలో అన్ని చర్లను తీసుకుంటాము. ఇది మా పూర్తి వినియోగదారుల సంతృప్తి ప్రణాళికలో ఒక ముక్యమైన భాగంగా మేము భావిస్తాము." అని జనరల్ మోటార్స్ ఇండియా వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.   

Chevrolet Beat

ఈ అమెరికన్ వాహన తయారీదారి యొక్క భారతీయ వాహనాల సంస్య మరియు మరియు వెనక్కి తీసుకొనుట ఈ ఏడాది జులైలో జరిగింది. ఇది కీలెస్ ఎంట్రీ రిమోట్ విభాగంలో తలెత్తిన ఒక సమస్య వలన జరిగిన సందర్భం(G.M వారు కీలెస్ ఎంట్రీ ఇన్స్యులేషన్ సిష్టం ను దృవీకరించారు,RKE సిష్టం ను కూడా) ఇవి బీట్, ఎంజాయి మరియు స్పార్క్ వాహనాలకు సంబంధించినవి. ఈ సందర్భంలో వారు 1.55 లక్షల యూనిట్లను వెనక్కి తీసుకున్నారు. ఇది భారతదేశంలోని అతి ఎక్కువ సంఖ్యలో వెను తీసుకున్న వాహనాల సంఖ్య. ఈ నెల మొదటి భాగంలో హోండా వారు కూడా ఇటువంటి ఒక రీకాల్ కి పిలుపునిచ్చారు. ఇది వారి డీజిల్ వాహనాలలోని సమస్య వలన జరిగినది. వారు దాదాపుగా 25,782 మొబిలియో వాహనాలను మరియు 64,428 హోండా సిటీ యూనిట్లను వెనక్కి తీసుకున్నారు. ఫ్యుయల్ పంప్ పైపు బయటకు వచ్చిన కారణంగా తద్వారా ఇంధన లీకేజ్ మరియు ఇంజిన్ ఆగిపోవడం కారణంగా ఈ రీకాల్ జరిగింది. ఈ రీకాల్ తరువాత మొబిలియో జూన్ 2014 నుండి జులై 2015 మధ్య తయారు చేయబడిన మరియు హోండా సిటీ సెడాన్ ఇవి డిసెంబర్ 2013 నుండి జులై 2015 యూనిట్లకు వర్తించింది. 

ఇంకా చదవండి

2017 లో రాబోతున్న షెవ్రొలే కాంపాక్ట్ బీట్ సెడాన్ 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience