కొత్త మహీంద్రా KUV100 ట్రైలర్ వెనుక ప్రొఫైల్ ని విడుదల చేసింది

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం nabeel ద్వారా డిసెంబర్ 30, 2015 12:07 pm ప్రచురించబడింది

న్యూ డిల్లీ:

KUV100

నూతన సంవత్సరంలోనికి అడుగుపెడితే 2016 లో ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రారంభాలలో KUV100 ఒకటి. కారు బహిర్గతం అయిన తరువాత మహీంద్రా వాహనం వెనుక ప్రొఫైల్ మరియు అంతర్భాగాల గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, అంతర్భాగాలు అంతకు మునుపు బహిర్గతం అయ్యాయి మరియు వెనుక ప్రొఫైలు ఇప్పటికీ రహస్యంగా ఉండిపోయింది. ఈ క్రిస్మస్ న మహీంద్రా శాంటా వలే నటించి అనుకోకుండా KUV100 యొక్క వెనుక భాగం కలిగియున్న బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించిన వారి తాజా ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ కూడా ముందు మరియు ప్రక్క ప్రొఫైల్ యొక్క వివరాలను అందించింది. అయితే, మహీంద్రా కారు యొక్క వెనుక భాగం యొక్క చిత్రాలను అస్పష్టంగా విడుదల చేసింది, మేము వాటిని సంపాదించాము, కనుక మీరు మరి కొంచం ఎక్కువ చూడవచ్చు.

KUV100

వెనుక ప్రొఫైల్ స్పాయిలర్ ని కలిగియుండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టెయిల్‌లైట్ క్లస్టర్ బాడీ లైన్ తో చుట్టబడి ఉంటుంది. దీని లోగో బూట్ గేట్ యొక్క టాప్ సెంటర్ వద్ద ఉంచబడింది మరియు బూట్ కి గేట్ కి ఇరువైపులా మహీంద్రా మరియు KUV100 అని రాసి ఉంటుంది. దీనిలో వెనుక వైపర్ ఆర్మ్ మహీంద్రా లోగో కి కుడివైపున అమర్చబడి చూడడానికి ఎబెట్టుగా ఉంది. అది కాకుండా బూట్ గేట్ పైన ఎటువంటి లక్షణాలు కూడా చూడడానికి ఎబెట్టుగా లేవు.

భద్రతకు సంబంధించి, KUV అన్ని 4 వేరియంట్లలో ఎయిర్బ్యాగ్స్ తో ఆభ్శ్ ని ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10, ఫోర్డ్ ఫిగో, టాటా జైకా తో పాటూ మారుతి స్విఫ్ట్ వంటి వాటితో పోటీగా ఉండవచ్చు మరియు రూ. 4-7 లక్షల ధరని కలిగి ఉండవచ్చు. ఈ కారు కోసం బుకింగ్స్ మహీంద్రా డీలర్షిప్ల వద్ద రూ.10,000 కి తెరవబడవచ్చు.

KUV100

ఈ కారు mFALCON ఫ్యామిలీ యొక్క ఇంజిన్లను కలిగి ఉంటుంది. దీని పెట్రోల్ ఇంజిన్ 1.2-లీటర్, 3-సిలిండర్ యూనిట్ తో అమర్చబడి 5,500rpm వద్ద 82bhp శక్తిని మరియు 114Nm టార్క్ ని అందిస్తుంది. దీనిని mFALCON G80 అని పిలుస్తారు. డీజిల్ ఇంజిన్ 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బో యూనిట్ ని కలిగియుండి 3,750rpmవద్ద 77bhp శక్తిని మరియు 1,750rpm నుండి 2,250rpm వద్ద 190Nm టార్క్ ని అందిస్తుంది మరియు దీనిని mFALCON D75 అని పిలుస్తారు. ఈ రెండూ కూడా ఒక 5-స్పీడ్ మాన్యువల్ తో జత చేయబడి ఉంటాయి. అయితే మహీంద్రా భవిష్యత్తులో ఒక ఆటోమేటిక్ వేరియంట్ ని పరిచయం చేయవచ్చు. మనం దీని యొక్క డ్రైవింగ్ అనుభవం పొందిన తరువాతనే ఈ ఇంజన్ల యొక్క పనితీరు ఎలా ఉందో చెప్పగలం. కనుక వేచి ఉండండి.

పూర్తి ట్రైలర్ చూడండి

ఇంకా చదవండి

మహీంద్రా KUV100 గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా KUV 100 NXT

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience