Choose your suitable option for better User experience.
 • English
 • Login / Register

కొత్త హ్యుందాయ్ i20 మెరుగైన మైలేజీని అందించనున్నది 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్ కి ముఖ్యంగా ధన్యవాదాలు

హ్యుందాయ్ ఐ20 2020-2023 కోసం dhruv attri ద్వారా ఫిబ్రవరి 21, 2020 02:19 pm ప్రచురించబడింది

 • 55 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

48V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ బాలెనో యొక్క 12V యూనిట్ కంటే బలంగా ఉంది, అందువలన దానితో పోల్చి చూస్తే మంచి ఫ్యుయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది

 •  దీని 48V మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థ హ్యుందాయ్ ప్రకారం మైలేజీని మూడు నుంచి నాలుగు శాతం మెరుగుపరుస్తుంది. 
 •  కొత్త i20 లో ప్రామాణికంగా ఐడిల్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ కూడా ఉంటుంది.
 •  ఇండియా-స్పెక్ i20 కి మూడు ఇంజన్ ఎంపికలు లభిస్తాయి: అవి వరుసగా 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్.
 •  హ్యుందాయ్ కొత్త i20 ని 2020 మధ్యలో ని భారత్‌ కు తీసుకురానుంది.
 •  దాని ప్రధాన ప్రత్యర్థి మారుతి సుజుకి బాలెనో లో ఉన్నట్లుగా మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ పొందవచ్చు. 

New Hyundai i20 To Offer Better Mileage Thanks To 48V Mild Hybrid Tech

2020 హ్యుందాయ్ i20 లుక్స్ పరంగా ప్రస్తుత కారు నుండి పెద్ద మార్పులను అయితే కలిగి ఉండదు, కానీ ప్రధాన మార్పు ఏమిటంటే ఇది హుడ్ కింద ఒక ప్రధాన అప్‌డేట్ ను కలిగి ఉంది, అది 48V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థ. సాధారణ 12V మైల్డ్-హైబ్రిడ్ యూనిట్‌ తో పోలిస్తే 48V వ్యవస్థ మరింత బలంగా ఉంటుంది మరియు సాధారణంగా ఖరీదైన కార్లలో మనకి కనిపిస్తుంది. 48V సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌తో ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది, ఇది సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు డ్రైవబిలిటీని మెరుగుపరచడానికి మైల్డ్ టార్క్ అసిస్ట్ ని అందిస్తుంది.        

ఈ 48V యూనిట్‌ ను 1.0-లీటర్ T-GDI, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో జత చేయవచ్చు, ఇది రెండు ట్యూన్‌లో లభిస్తుంది: 100Ps మరియు 120Ps. మైల్డ్ హైబ్రిడ్ ఫ్యుయల్ ఎకనామీ ని పెంచుతుంది మరియు ఎమిషన్స్ ని మూడు నుంచి నాలుగు శాతం తగ్గించగలదని హ్యుందాయ్ పేర్కొంది. ఇండియా-స్పెక్ హ్యుందాయ్ వెన్యూ మైల్డ్-హైబ్రిడ్ టెక్ లేకుండా 120Ps పవర్ ని 1.0-లీటర్ తో 18.15 కిలోమీటర్లు (MT) / 18.27 కిలోమీటర్లు (DCT) ARAI- ధృవీకరించబడిన ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని అందిస్తుంది. ఆరాలో అదే ఇంజిన్ యొక్క 100Ps వెర్షన్ 20.5 కిలోమీటర్ల సామర్థ్యాన్ని అందిస్తుంది.         

ఇక్కడ సర్వింగ్ ట్రాన్స్మిషన్ ఎంపికలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఎంపిక ఉన్నాయి. గ్లోబల్ మోడల్ ఐడిల్ ఇంజిన్ ఆటో స్టార్ట్-స్టాప్‌ ను స్టాండర్డ్‌ గా కలిగి ఉంది, ఇది పెట్రోల్-పవర్ తో పనిచేసే టాటా ఆల్ట్రోజ్ మరియు మైల్డ్-హైబ్రిడ్ బాలెనో లో కూడా లభిస్తుంది.  

భారతదేశంలో,వెన్యూ వలె పవర్‌ట్రైన్ ఎంపికలు లభిస్తాయని భావిస్తున్నాము. కాబట్టి మీరు 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ నుండి ఎంచుకోవచ్చు. డీజిల్ మోటారు మినహా, రెండు పెట్రోల్ ఇంజన్లు ఐరోపాలో కూడా లభిస్తాయి.   

భారతదేశంలో హ్యుందాయ్‌కు i20 కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా అమ్ముడుపోయే కారుగా ఉంది మరియు కొత్త తరం కూడా చూస్తుంటే అదే మార్గంలో కొనసాగే అవకాశం ఉంది. థర్డ్-జెన్ i20 2020 మధ్యలో మన తీరానికి చేరుకుంటుందని భావిస్తున్నాము. ఇండియా-స్పెక్ మోడల్‌ లో మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం గురించి తయారీసంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. థర్డ్-జెన్ i20, 2020 మధ్య నాటికి మన తీరాలకు చేరుకొనే అవకాశం ఉంది, దీని ధరలు 5.7 లక్షల రూపాయల వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

అయితే, ఇది వ్యాపార కారణాల వల్ల ఈ క్లీన్ టెక్నాలజీని i20 లో ప్రవేశపెట్టగలదు. దాని ప్రత్యర్థి బాలెనో, ఇప్పటికే 12V మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థను అందిస్తుంది మరియు దాని ఫ్యుయల్ ఎఫిషియన్సీ 23.87Kmpl గా అందించబడుతుంది. అంతేకాకుండా, భారతదేశంలో మైల్డ్-హైబ్రిడ్ సాంకేతిక టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల హ్యుందాయ్, మారుతి యొక్క ‘స్ట్రాంగ్’ హైబ్రిడ్ల దాడిని ఎదుర్కోడానికి  సిద్ధంగా ఉంటుంది, అలాగే రాబోయే CAFE (కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం) నిబంధనలకు అనుగుణంగా దాని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. CAFE నిబంధనల ప్రకారం కారు తయారీసంస్థ యొక్క సంయుక్త ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో నుండి కనీసం ఏవరేజ్ ఫ్యుయల్ ఎఫిషియన్సీ ని కలిగి ఉండడం అవసరం. ఈ నిబంధనలు అనేవి ఆటో పరిశ్రమ యొక్క కార్బన్ పాదముద్రను అరికట్టడానికి ఉద్దేశించినవి మరియు 2022 నాటికి అమలులోనికి వచ్చే అవకాశం ఉంది.

మరింత చదవండి: ఎలైట్ i20 ఆన్ రోడ్ ప్రైజ్

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ ఐ20 2020-2023

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience