• English
  • Login / Register

మిత్సుబిషి తదుపరి తరం పజేరో స్పోర్ట్ కారు ఆగస్టు 1 న అంతర్జాతీయంగా రంగప్రవేశం!

జూలై 09, 2015 04:40 pm raunak ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మిత్సుబిషి తన తదుపరి తరం పజేరో స్పోర్ట్ యొక్క మొట్టమొదటి అధికారిక టీజర్ ను విడుదల చేసింది. వచ్చే నెల ఆగస్టు 1 న థాయిలాండ్ వద్ద బ్యాంకాక్ అంతర్జాతీయ గ్రాండ్ మోటార్ సేల్ లో ఈ ఎస్యూవి ని ప్రపంచవ్యాప్తంగా రంగప్రవేశం చేయనున్నారు. పొరుగు దేశాలలో దీనిని ఈ సంవత్సరం తరువాత విడుదల చేయాలని భావిస్తున్నారు అయితే భారతదేశంలో మాత్రం వచ్చే ఏడాదిలోగాని లేదా 2017 సంవత్సర ప్రారంభంలో గాని విడుదల చేసే అవకాశాలున్నాయి. మిత్సుబిషి ని 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.

డిజైన్ పరంగా చూసినట్లయితే, మిత్సుబిషి తదుపరి తరం పజేరో యొక్క చిత్రం నీడను గమనించినట్లయితే దీని కొత్త 'డైనమిక్ షీల్డ్' డిజైన్ భాష మనకు అర్థమవుతుంది. పెద్ద 'ఎక్శ్ ఆకారంలో క్రీడా వైఖరి ఉన్న గ్రిల్ మరియు స్వెప్ట్ బ్యాక్ స్లీకర్ హెడ్ల్యాంప్స్ మనకి దీని డిజైన్ ని తెలియజేస్తాయి. 2016 అవుట్ ల్యాండర్ ఫేస్లిఫ్ట్ కూడా ఇదే రకమైన డిజైన్ ను కలిగి ఉంది. అంతేకాక, అది కూడా ఫేస్లిఫ్ట్ అవుట్ ల్యాండర్ లో ఉన్నటువంటి పగటి పూట వెలిగే ఎల్ ఈ డీ లైట్లు కూడా దీనిలో ఉన్నాయి ( క్రింద అవుట్ ల్యాండర్ యొక్క చిత్రం చూడండి).

ముందుదాని వలె, కొత్త తరం పజేరో కూడా గత ఏడాది విడుదలైన ట్రిటాన్ యొక్క పికప్ తో ప్లాట్ ఫాం ని షేర్ చేసుకుంటుంది, కానీ మునుపటి తరం ట్రిటాన్ లాగా కాకుండా పజేరో స్పోర్ట్ దీని మాదిరిగానే ఉంది. పికప్ పోలిస్తే 2016 ఎస్యూవి భిన్నంగా ఉంటుంది (క్రింద ట్రిటాన్ యొక్క చిత్రం చూడండి).

యాంత్రిక పరంగా చూస్తే, రాబోయే 2016 పజేరో 2.5 లీటర్ ఇంజిన్ కి బదులుగా ఇప్పుడు 2015 ట్రిటాన్ యొక్క ఎల్200 కి చెందిన 2.4 లీటర్ ఎం ఐ వి ఈ సి డీజిల్ ఇంజన్ తో రాబోతుందని ఆశిస్తున్నారు. దీనిలో కొత్త చమురు బర్నర్ శక్తివంతంగా మరియు ఇప్పటికి ఉన్న దానికంటే సమర్థవంతమైనదిగా ఉంది. ఇది 4-సిలిండర్ యూనిట్ ను కలిగి 180bhp శక్తిని మరియు గరిష్టంగా 430Nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. అంతేకాక, ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా కొత్త పజేరో లో అప్ డేట్ అవుతాయి మరియు ప్రస్తుతం ఉన్న కారులాగే రాబోయే కారు కూడా ఆటోమేటిక్ వెర్షన్ తో రాబోతుంది.

ఇప్పుడు దీనిలో ఆసక్తికరమైన అంశం ఏమిటనగా, పజేరో మొత్తం విభాగం భారతదేశంలో ప్రవేశించే సమయానికి ఈ సెగ్మెంట్ రూపాంతరం చెంది వస్తుంది. ఈ ఫేస్లిఫ్ట్ హ్యుందాయ్ శాంటా-ఫే మరియు తదుపరి తరం ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ లతో పోటీ పడనుంది అని భావిస్తున్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience