• English
  • Login / Register

గుర్గాన్ లో కొత్త డీలర్షిప్ ప్రారంబించిన మిత్సుబిషి

జూన్ 22, 2015 05:30 pm akshit ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఢిల్లీ: భారతదేశం లో మిత్సుబిషి బ్రాండ్ ఉత్పత్తిదారులు మరియు హిందూస్తాన్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ ఎం ఎఫ్ సిఎల్) వారిరువురు కలిసి విక్రయధారుల కొరకు గుర్గాన్, హర్యానా లో ఒక కొత్త షోరూం ను ప్రారంబించారు. సమురాయ్ మిత్సుబిషి,  హెచ్ ఎం ఎఫ్ సిఎల్ టాప్ అధికారుల సమక్షంలో ఏస్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చే ప్రారంభించబడింది.    

"గుర్గాన్ డీలర్ షోరూం రూపకల్పన జరిగింది మరియు ఒక సంప్రదాయ డీలర్ ను మరియు అనేక ఆఫర్లను అందిస్తుంది. దీని యొక్క లక్ష్యం ఏమనగా, ఇది దాని వినియోగదారుల కోసం ఒకేరకమైన అనుభవాన్ని సృష్టించడంలో దృష్టి పెడుతుంది మరియు నిజమైన లగ్జరీ కార్లను అందించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, మిత్సుబిషి యొక్క బ్రాండ్ గుర్తింపును పర్యాయపదంగా ప్రకాశము మరియు ఉన్నతమైన సేవ నాణ్యత ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశ్యం అని, "మిత్సుబిషి పేర్కొంది. 

ఈ షోరూం లో మిత్సుబిషి కార్ల యొక్క అమ్మకాలు, విడిభాగాలు మరియు సేవను అందించటం జరుగుతుంది. ఈ కొత్త డీలర్షిప్ జి3, పర్సావనత్ ఆర్కాడియా, ఎంజి రోడ్డు, సెక్టార్ 14 వద్ద ఉంది. అంతేకాకుండా, ఇది మొత్తం మనేసర్, బేడ్షాపూర్ మరియు సోహ్నా సమీపంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది.   

హెచ్ ఎం ఎఫ్ సిఎల్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, మేము గుర్గాన్ భూభాగం లో ఒక భాగం అయినందుకు సంతోషిస్తున్నాము ", అని అన్నాడు. హర్యానా చారిత్ర గురించి చెప్పాలంటే, ఇది మనకు ఒక కీ మార్కెట్ లాంటిది. ఎందుకంటే, పజెరో వాహన విధేయులు ఈ రాష్ట్రం నుండే వచ్చారు. సమురాయ్ మిత్సుబిషి, మేము సహస్రాబ్ది నగరం లో మా వినియోగదారులు కొరకు మరియు ఎస్యువి ప్రియులు కొరకు దీనిని ప్రారంబించాము అని అన్నారు. అంతేకాకుండా, మేము  మా వినియోగదారులను  చేరుకునేందుకు మంచి సర్వీస్ ను అందించడం లో మరియు అవకాశాలను అందించడం కొరకు ఈ ప్రాంతంలో  కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. 


మిత్సుబిషి, ఈ డీలర్షిప్ ద్వారా పజెరో రిటైలింగ్ మాత్రమే చేయబడుతుంది. ఈ ఎస్యువి వాహనాలలో 2.5 లీటర్ టర్బోచార్జెడ్ డీజిల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 175 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటుగా అత్యధికంగా 400 Nm గల టార్క్ ను మాన్యువల్ వెర్షన్స్ లో విడుదల చేస్తుంది. అదే ఆటోమేటిక్ వెర్షన్ విషయానికి వస్తే, అత్యధికంగా 350 Nm గల టార్క్ విడుదల అవుతుంది.  

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience