• English
  • Login / Register

కామెట్ EV కోసం ఆర్డర్ బుకింగ్‌లను ప్రారంభించిన MG

ఎంజి కామెట్ ఈవి కోసం shreyash ద్వారా మే 17, 2023 10:56 am ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పరిచయ ధర రూ.7.98 లక్షల నుండి రూ.9.98 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) శ్రేణిని కేవలం మొదటి 5,000 బుకింగ్ؚలకు మాత్రమే వర్తిస్తుంది.

MG Comet EV

  • ఈ అల్ట్రా-కాంపాక్ట్ EVని రూ.11,000 డిపాజిట్ؚతో బుక్ చేసుకోవచ్చు.

  • కామెట్ EV టెస్ట్ డ్రైవ్ؚలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

  • MG తన 2-డోర్‌ల ఎలక్ట్రిక్ వాహనాన్ని మూడు వేరియెంట్ؚలలో అందిస్తుంది: పేస్, ప్లే మరియు ప్లష్ 

  • 17.3kWh బ్యాటరీ ప్యాక్‌తో, 230కిమీ క్లెయిమ్ చేసిన పరిధితో వస్తుంది.

  • దీని రేర్-ఆక్సిల్ؚకు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 42PS పవర్ మరియు 110Nm టార్క్‌ను అందిస్తుంది.

  • డెలివరీలు మే 22 నుండి ప్రారంభం కానున్నాయి.

MG కామెట్ EV బుకింగ్ؚలు ఎట్టకేలకు అధికారికంగా రూ.11,000 ముందస్తు చెల్లింపు ధరతో ప్రారంభం కానున్నాయి. ఇది మూడు వేరియెంట్ؚలలో లభిస్తుంది – ఇవి పేస్, ప్లే మరియు ప్లష్ – మొదటి 5,000 బుకింగ్ؚలకు దీని ధరలు రూ.7.98 లక్షల నుండి రూ.9.98 లక్షల వరకు ఉంటుంది(పరిచయ ఎక్స్ షోరూమ్ పాన్ ఇండియా ధరలు). బుకింగ్ చేసినప్పటి నుంచి డెలివరీల వరకు, కొనుగోలుదారులు తమ కామెట్ EV స్టేటస్ؚను మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునేందుకు MG సంస్థ వీలు కల్పించింది. 

అల్ట్రా-కాంపాక్ట్ కొలతలు

MG Comet EV Side

MG కామెట్ EV 2-డోర్‌ల అల్ట్రా-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్, ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. దీని సబ్-3మీ పొడవు కారణంగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్నిటి కంటే చిన్నదైన కారుగా ఇది నిలుస్తుంది, దీని టర్నింగ్ రేడియస్ 4.2 మీటర్‌లుగా ఉంది.  

అందిస్తున్న ఫీచర్‌లు

MG Comet EV Cabin

కామెట్ EV డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ؚల సెట్ؚఅప్ؚతో (ఒకటి ఇన్ఫోటైన్మెంట్ؚకు మరియు రెండవది ఇన్స్ట్రుమెంటేషన్ؚకు) వస్తుంది. దీని ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేలకు మద్దతును ఇస్తుంది, ఇందులో 55 కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు ఉన్నాయి, వీటిలో మొబైల్ యాప్ ద్వారా రిమోట్ ఆపరేషన్‌లు మరియు ఇతర వాయిస్ కంట్రోల్ ఫీచర్‌లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: EVలపై ప్రధాన దృష్టితో 5-సంవత్సరాల రోడ్ మ్యాప్ؚను వివరించిన MG మోటార్ ఇండియా

భద్రత విషయంలో, MG 2-డోర్‌ల EV డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలను, EBDతో ABS, రివర్స్ పార్కింగ్ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚలతో (TPMS) వస్తుంది.  

బ్యాటరీ & పరిధి

MG Comet EV Charging Port

MG కామెట్ EV 17.3kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది, క్లెయిమ్ చేసిన పరిధి 230 కిమీగా ఉంది. ఇది 42PS మరియు 110Nm ఉత్పత్తి చేసే రేర్-ఆక్సిల్ؚకు అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ؚకు జోడించబడుతుంది. EV 3.3kW AC ఛార్జింగ్ؚకు మద్దతు ఇస్తుంది, 0-100 శాతం బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఏడు గంటలు తీసుకుంటుంది మరియు 10-80 శాతం ఛార్జ్ చేయడానికి ఐదు గంటలు పడుతుంది. 

పోటీదారులు 

MG Comet EV Rear

2-డోర్‌ల అల్ట్రా కాంపాక్ట్ EV టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3లతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి : కామెట్ EV ఆటోమ్యాటిక్ 

was this article helpful ?

Write your Comment on M జి కామెట్ ఈవి

explore మరిన్ని on ఎంజి కామెట్ ఈవి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience