రానున్న 5-సంవత్సరాల ప్రణాళికలను వివరించిన MG మోటార్ ఇండియా, EVలపైనే దృష్టి

మే 14, 2023 03:25 pm rohit ద్వారా సవరించబడింది

  • 36 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

వచ్చే ఐదు సంవత్సరాలలో, భారత వ్యాపార కార్యకలాపాలలో రూ.5,000 కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ కారు తయారీదారు తెలిపారు

MG logo

  • MG గుజరాత్‌లో మరొక ఉత్పత్తి కర్మాగారాన్ని నెలకొల్పనుంది, తద్వారా ప్రస్తుత 1.2 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని 3 లక్షలకు పెంచునుంది. 
  • EV భాగాల స్థానిక తయారీని బలోపేతం చేయడం మరియు గుజరాత్ؚలో బ్యాటరీ అసెంబ్లీ యూనిట్ؚను నెలకొల్పడంపై దృష్టి సారించింది. 
  • 4-5 కొత్త కార్‌లను ఆవిష్కరించే ప్రణాళికలు కలిగి ఉంది, వీటిలో ఎక్కువగా EVలు ఉంటాయి.
  • 2028 నాటికి EV లైన్అప్‌లోని కార్‌ల అమ్మకాలలో 65 నుండి 75 శాతం అమ్మకాలను సాధించడం లక్ష్యంగా అడుగులు వేస్తుంది. 

MG మోటార్ భారత మార్కెట్ పట్ల తన నిబద్ధతను పునరుధ్ఘాటించింది మరియు కొత్తగా ప్రకటించిన తన 5-సంవత్సరాల రోడ్ మ్యాప్‌తో సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా కొత్త కర్మాగారాన్ని స్థాపించడం, కొత్త కార్‌లను ప్రవేశపెట్టడం, కొత్త సాంకేతికతను స్థానికీకరించడం మరియు కొత్తగా పెట్టుబడులు పెట్టడం ఉన్నాయి. ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం:

స్థానికీకరణ మరియు ఉత్పత్తిని పెంచడం 

MG Halol plant in action

ప్రస్తుత 1.2 లక్షల కార్‌లుగా ఉన్న వార్షిక ఉత్పత్తిని 3 లక్షల వరకు పెంచేందుకు గుజరాత్ؚలో రెండవ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పడానికి MG ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.

గుజరాత్ؚలో బ్యాటరీ అసెంబ్లీ యూనిట్ؚను నెలకొల్పడం మరియు EV కాంపొనెంట్ؚల స్థానిక తయారీని బలోపేతం చేయడానికి ఈ కారు తయారీదారు ప్రణాళికలను కలిగి ఉంది. హైడ్రోజెన్ ఫ్యూయల్ సెల్స్ మరియు సెల్ తయారీ వంటి కొత్త సాంకేతికతలలో కూడా పెట్టుబడి పెట్టనున్నారు మరియు JVలు లేదా మూడవ-పక్ష తయారీ ద్వారా స్థానికీకరణను పెంచనున్నారు.

వచ్చే రెండు నుండి నాలుగు సంవత్సరాలలో భారతీయులు కలిగి ఉన్న వాటాని కూడా తగ్గించాలని ప్రణాళికలను కలిగి ఉంది.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 2023లో ఎక్కువగా అమ్ముడైన 10 కార్‌లు

కొత్త కార్‌లు మరియు అమ్మకాల అంచనా 

MG ZS EV

వచ్చే ఐదు సంవత్సరాలలో, భారతీయ మార్కెట్‌లో నాలుగు నుండి ఐదు కొత్త కార్‌లు, ఎక్కువగా EVలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు MG వెల్లడించింది. ఇండియా మార్కెట్‌లో 2028 నాటికి మొత్తం విక్రయాలలో 65 నుండి 75 శాతం EVలు ఉండాలని కోరుతున్నట్లు కూడా కారు తయారీదారు ప్రకటించారు.

పెట్టుబడి విలువ మరియు శ్రామిక శక్తి

MG Comet EV

పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి, ఈ కారు తయారీదారు వచ్చే ఐదు సంవత్సరాలలో భారత వ్యాపార కార్యకలాపాలలో రూ.5,000 కోట్ల కంటే ఎక్కువగా వెచ్చించాలని నిర్ణయించింది. లక్ష్యాన్ని చేరుకునేందుకు మరొక అంశం అతి పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉండటం, కారు తయారీదారు వెల్లడించిన దాన్ని బట్టి, ఇది 2028 నాటికి 20,000గా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 2023లో అత్యంత అధికంగా అమ్ముడైన 15 కార్‌లు

ఇప్పటి వరకు MG ఇండియా ఇన్నింగ్స్

2023 MG Hector

మిడ్ సైజ్ SUV హెక్టార్ؚతో, ఈ కారు తయారీదారు 2019లో భారతదేశ మార్కెట్‌లోకి ప్రవేశించారు. సుమారు 4-సంవత్సరాలలో, MG మోటార్ ఇండియా మార్కెట్‌లో వివిద కార్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది, వీటిలో పూర్తి సైజ్ SUV, భారతదేశంలో అత్యంత చవకైన, కొత్తగా ఆవిష్కరించిన కామెట్ EVతో సహా రెండు EVలు ఉన్నాయి. ఏప్రిల్ 2023లో హోండా తరువాత MG మోటార్ ఎనిమిదవ అత్యంత ఎక్కువగా అమ్ముడైన బ్రాండ్ؚగా నిలిచింది.

ఇది కూడా చదవండి: 2023 MG హెక్టార్ ఫస్ట్ డ్రైవ్: ADAS మరియు అదనపు ఫీచర్‌లు ధర పెంపు సమర్ధనీయమేనా?

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience