బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ؚతో పూర్తిగా నలుపు రంగులో వస్తున్న MG గ్లోస్టర్

ఎంజి గ్లోస్టర్ కోసం ansh ద్వారా మే 29, 2023 12:00 pm ప్రచురించబడింది

  • 76 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

పూర్తిగా నలుపు రంగు ఎక్స్ؚటీరియర్ؚతో పాటు, ఈ ప్రత్యేక ఎడిషన్ భిన్నమైన క్యాబిన్ థీమ్ؚను కూడా పొందవచ్చు

MG Gloster Black Storm

MG గ్లోస్టర్ త్వరలోనే కొత్త ప్రత్యేక ఎడిషన్ వర్షన్ؚను పొందనుంది. కొత్త టీజర్ؚలో, ఈ కారు తయారీదారు ఈ SUV ప్రత్యేక “బ్లాక్ స్టోర్మ్” ఎడిషన్ؚను చూపించారు. లుక్ ప్రకారం, గ్లోస్టర్ ప్రత్యేక ఎడిషన్ ఎక్స్ؚటీరియర్‌పై బ్లాక్ స్టోర్మ్ బ్యాడ్జింగ్ؚతో పూర్తిగా నలుపు రంగు ఎక్స్ؚటీరియర్‌ను పొందుతుంది. 

ఏమి ఆశించవచ్చు

MG Gloster Black Storm

MG ఇప్పటికే గ్లోస్టర్ؚను నలుపు ఎక్స్ؚటీరియర్ రంగులో అందిస్తుంది. అయితే ఈ ప్రత్యేక ఎడిషన్ؚలో, క్రోమ్ బిట్స్ అన్నిటినీ నలుపు రంగులో మరియు పూర్తిగా నలుపు అలాయ్ వీల్స్ ఉంటాయని ఆశించవచ్చు. టీజర్ؚలో క్యాబిన్‌ను చూపించకపోయిన, అప్ؚహోల్స్ؚట్రీ కూడా అదే నలుపు రంగులో వస్తుందని ఆశించవచ్చు. 

ఫీచర్‌లు

MG Gloster Cabin

టీజర్‌లో బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ గురించి మరింతగా తెలియచేయలేదు, అయితే ఇందులో ఎటువంటి అదనపు ఫీచర్‌లు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ SUV ప్రామాణిక వర్షన్‌ను మరిన్ని ఫీచర్‌లతో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్ؚరూఫ్, 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: EVలపై ప్రధాన దృష్టితో, 5-సంవత్సరాల రోడ్ మ్యాప్ؚను వివరించిన MG మోటార్ ఇండియా

భద్రత పరంగా, ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP) మరియు లేన్ ఛేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డెటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు ఆటోమ్యాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌లు ఉన్నాయి. 

పవర్ؚట్రెయిన్

MG Gloster Engine

ప్రామాణిక వర్షన్ రెండు ఇంజన్ ఎంపికలను బ్లాక్ స్టోర్మ్ కూడా పొందవచ్చు. రేర్-వీల్-డ్రైవ్ సెట్అప్ؚతో 2-లీటర్‌ల డీజిల్ ఇంజన్ (161PS మరియు 374Nm) మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ట్రెయిన్ؚతో 2-లీటర్‌ల ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ (216PS మరియు 479Nm). రెండు ఇంజన్ లు 8-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ؚతో జోడించబడతాయి.

ధర & పోటీదారులు

MG Gloster

గ్లోస్టర్ ధర రూ.38.08 లక్షల నుండి రూ.42.38 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది మరియు బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ ప్రామాణిక వేరియెంట్‌ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చు. టయోటా ఫార్చూనర్, స్కోడా కోడియాక్ మరియు జీప్ మెరిడియన్ వంటి వాటితో గ్లోస్టర్ పోటీ పడనుంది. 

ఇక్కడ మరింత చదవండి: MG గ్లోస్టర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి గ్లోస్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience